సాధారణంగా కాన్పులు హాస్పిటల్స్ లోనో లేకపోతే అరుదుగా ఇళ్లల్లోనో అవుతుంటాయి. కానీ ఓ మహిళ మాత్రం బీచ్ లో ప్రసవించింది.ఆ మహిళ బీచ్ కు వెళ్లినప్పుడు అనుకోకుండా ఇలా జరిగి ఉండవచ్చని అనుకుంటే పొరపాటే. ఆమె కావాలనే పక్కా ప్లాన్ తో అలల మధ్య బిడ్డకు జన్మనిచ్చింది. ఆమె ఎందుకు అలా చేసిందో తెలియాలంటే ఇది పూర్తిగా చదవాల్సిందే.
ఓ మహిళ ఎలాంటి వైద్య సహాయమూ లేకుండా పసిఫిక్ మహా సముద్రంలో మగ బిడ్డకు జన్మనిచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను ఆ మహిళ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇప్పడది వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఉన్న మహిళ పేరు జోసీ ప్యూకెర్ట్. 37 సంవత్సరాల వయస్సు. తన మూడో డెలివరీని ఎవరి సహాయం లేకుండా బీచ్ కు వెళ్లి తనకు తానే జరుపుకుంది. నికరాగ్వాలోని ప్లేయా మజాగువల్ తీరంలో ఈ డెలివరీ అయిన రోజునే మహిళ వీడియో పోస్ట్ చేసింది.
జోసీ ప్యూకెర్ట్ మూడో సారి గర్భం దాల్చింది. అయితే ఈ సారి ప్రసవం కోసం ఎలాంటి మందులూ ఉపయోగించకూడదని, డాక్టర్ల సాయమూ తీసుకోకూడదని ఆమె భావించింది. దీని కోసం ఆమె స్కానింగ్ లను కూడా తిరస్కరించింది. అనుకున్నట్టుగానే ఫిబ్రవరి 27వ తేదీన వైద్య సహాయం లేకుండానే ఉచిత బర్నింగ్ పద్ధతి ద్వారా ఆమె ప్రసవించింది. ఆ బిడ్డకు బోధి అమోర్ ఓషన్ కార్నెలియస్ అనే పేరు కూడా పెట్టుకుంది. ఇప్పుడు ఆ పిల్లాడు ఆరోగ్యంగానే ఉన్నాడు. ఈ విషయంలో జోసీ డైలీ మెయిల్‌తో మాట్లాడింది. ‘‘ నేను సముద్రంలో ప్రసవించాలనుకుంటున్నాను. ఆ రోజు పరిస్థితులు బాగానే ఉన్నాయి. ఇక నేను వెనకడుగు వేయకుండా అలానే చేశాను. వారాల తరబడి నేను సముద్రపు ఆటుపోట్లను గమనించాను. అయితే నేను ప్రసవించే సమయం వచ్చినప్పుడు బీచ్ మాకు సురక్షితంగా ఉంటుందని నాకు తెలుసు ’’ అని తెలిపింది.
జోసీకి పురిటి నొప్పులు రాగానే.. ఆమె ఇద్దరు పిల్లలు వారి స్నేహితులతో ఆడుకోవడానికి బయటకు వెళ్లారు. భర్త ఆమెను తీసుకొని, బర్నింగ్ టూల్ కిట్ ను చేతబట్టుకొని బీచ్‌కి తీసుకెళ్లాడు. ఆ కిట్ లో తువ్వాలు, ప్లాసెంటాను పట్టుకోవడానికి స్ట్రైనర్‌తో కూడిన గిన్నె, గేజ్, పేపర్ టవల్స్ ఉన్నాయి. ఆమెకు నొప్పి రాగానే బీచ్‌లో మోకరిల్లి కూర్చుంది. తరువాత మగ బిడ్డను ప్రసవించింది. అయితే జోసీ అలల మధ్యకు వెళ్లి కూర్చున్న వీడియో, తరువాత బిడ్డను పట్టుకొని ఉన్న వీడియో సోషల్ మీడియాలో విడుదల చేశారు. రెండో వీడియాలో ఆమె బొడ్డుతాడు కూడా నీటిలో ఉండటం కనిపిస్తోంది.
Agnipath : ‘అగ్నిపథ్’ స్కీమ్ ను ప్రధానికి వివరించిన సైనికాధికారులు.. ఇంతకీ ఆ స్కీమ్ ఏంటంటే ?
‘‘ బోధి (శిశువు పేరు) పుట్టి టవల్‌లో చుట్టుకున్న తర్వాత నేను రిఫ్రెష్ కావడానికి తిరిగి సముద్రానికి వెళ్లాను. తరువాత నేను బట్టలు వేసుకున్నాను. అక్కడ అన్నీ సర్దుకుని ఇంటికి వెళ్ళాము. మేం ముగ్గురం మా మంచంపై పడుకున్నాం. అదేరోజు సాయంత్రం బోధిని తూకం వేసాము. 3.5 కేజీలు బరువు ఉన్నాడు. ’’ అని జోసీ తెలిపింది. అయితే ఆమె తన బిడ్డ ఎలాంటి వైద్య సహాయం లేకుండా ఎందుకు పుట్టాలనుకుందో కూడా వివరించింది. ‘‘నేను ఈ ఒక్కసారి ఆందోళన లేకుండా ఉండాలనుకున్నాను. నా మొదటి డెలివరీ క్లినిక్‌లో జరిగింది. అప్పుడు చాలా బాధగా అనిపించింది. నా రెండవ డెలివరీ ఇంట్లో జరిగింది, కానీ మూడో డెలివరికీ మంత్రసాని కూడా ఉండొద్దు అనుకున్నాను. ఈ సారి నా బిడ్డపై డాక్టర్, స్కానింగ్, బయట వారి ప్రభావం అస్సలు పడలేదు ’’ అని ఆమె వివరించింది.
అయితే ఈ ప్రసూతి పద్దతిని పలువురు ప్రశంసించగా మరికొందరు విమర్శించారు. ‘‘ వాట్ ఎ లెజెండ్.. వాట్ ఎ మదర్, వాట్ ఎ లక్కీ బాయ్ ! ’’ అని ఓ యూజర్ కామెంట్ చేయగా.. ఆమె చాలా శక్తివంతమైన నిర్ణయం తీసుకుందని మరో యూజర్ కామెంట్ చేశాడు. ‘‘ ఇది శానిటరీనా? సముద్రంలో చాలా బ్యాక్టీరియా ఉంది. ’’ అని ఒకరు ‘‘ వెచ్చని గర్భ౦ ను౦డి చల్లని సముద్ర౦ వరకు రావడం ఆ బుబ్బాకు ఎ౦తటి షాక్ అయ్యింటుంది ’’ అని మరొకరు కామెంట్ రాశారు. అయితే వీటిపై జోసీ స్పందిస్తూ ‘‘ బాబుకు జలుబు చేరస్తుందని మేము అస్సలు బాధపడలేదు. నీటి ఇన్ఫెక్షన్ల విషయంలోనూ నేను చింతించలేదు. పిల్లాడు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాడు. పసివాడు పూర్తిగా సురక్షితంగా ఉండేందుకు నేను ముందే అన్ని పరిశోధనలు చేశాను ’’ అని ఆమె పేర్కొంది.
