Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దాడిని నిరసిస్తూ.. అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దూకుడు కు కళ్లెం వేయడానికి , రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే క్రమంలో అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా నుండి దిగుమతి అవుతున్నవోడ్కా, సీఫుడ్, వజ్రాలపై అమెరికా నిషేధించనున్నట్లు అధ్యక్షుడు జో బిడెన్ శుక్రవారం ప్రకటించారు.
Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌పై రష్యా పోరు సాగిస్తూనే ఉంది. ఇరు దేశాల సేనాల మధ్య హోరాహోరీ పోరు 16వ రోజుకు చేరుకుంది. ఈ వీరోచిత యుద్దంలో ఉక్రెయిన్ సామాన్య పౌరులను టార్గెట్ చేస్తూ విరుచుకుపడుతున్నాయి రష్యన్ బలాగాలు. 16 రోజులుగా యుద్ధం సాగుతున్నా రాజధాని కీవ్‌ను స్వాధీనం చేసుకోవాలని రష్యా ఎంతగానో ప్రయత్నిస్తున్నా.. సాధ్యం కావడం లేదు. నగర సరిహద్దులోనే రష్యన్ సైన్యాలను ఉక్రెయిన్ సేనాలు నిలువరించాయి.
మరోవైపు ఇరుదేశాల మధ్య మూడు సార్లు చర్చలు జరిగినా.. ఎలాంటి పురోగతి లేదు. ఆ చర్చలు అసంపూర్తిగానే ముగిశాయి. యుద్ధం విరమించడానికి రష్యా ఏమాత్రం సిద్దంగా లేదు.. ఇటు ఉక్రెయిన్ ఓటమిని అంగీకరించి..లొంగిపోవడానికి ఒప్పుకోవడం లేదు. ఇరు దేశాలు ఏ మాత్రం తగ్గకపోవడంతో యుద్దం కొనసాగుతూనే ఉంది. రష్యా దాడుల్లో ఇప్పటివరకు 1300మంది పౌరులు చనిపోయారని ప్రకటించింది ఉక్రెయిన్.
ఈ క్రమంలో రష్యా దూకుడుకు కళ్లెం వేయాలని ప్రపంచదేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే పలు దేశాలను రష్యాపై ఆంక్షాలు విధించాయి. రష్యాను ఆర్థికంగా దెబ్బ తీయడానికి అనేక ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ క్రమంలో అమెరికా మరో ముందడుగు వేసింది. రష్యా పాల్పడుతున్న యుద్ధనేరాలపై అంతర్జాతీయంగా దర్యాప్తు జరగాలని అమెరికా పిలుపునిచ్చింది. ప్రసూతి ఆస్పత్రిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించింది.
రష్యా దండయాత్రను తీవ్రంగా వ్యతిరేఖిస్తూ.. అమెరికా శుక్రవారం మరికొన్ని ఆంక్షలు అమల్లోకి తీసుకొచ్చింది. తాజాగా రష్యా నుండి అమెరికాకు దిగుమతి అయ్యే వోడ్కా, సీఫుడ్, వజ్రాల దిగుమతులపై అమెరికా నిషేధించనున్నట్లు అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. రష్యా నుంచి పలు రకాల వస్తువుల దిగుమతిపై నిషేధం అమల్లోకి తెస్తూ పలు ఆదేశాలు జారీ చేశారు. పుతిన్ దూకుడుకు రష్యా భారీ మూల్యం చెల్లించాలి" అని బైడెన్ అన్నారు.
రష్యా ఆర్థిక వ్యవస్థకు ఈ చర్య .. మరో దారుణమైన దెబ్బ అని , ఇది ఇప్పటికే విధించిన పలు ఆంక్షల వల్ల రష్యా చాలా తీవ్రంగా బాధపడుతోందని అన్నారు. ప్రపంచ దేశాలు కూడా రష్యా దిగుమతులపై ఆంక్షాలు విధించాలని పిలుపు నిచ్చారు. జీ 7 దేశాలు, యూరోపియన్ యూనియన్.. రష్యా వాణిజ్యం ఆంక్షలు విధించాలని ఆయన పిలుపునిచ్చారు. అమెరికా కాంగ్రెస్‌లోని చాలా మంది చట్టసభ సభ్యులు ఈ చర్యను స్వాగతిస్తున్నారని ఆయన తెలిపారు.
మరోవైపు, అమెరికా, దాని జీ-7 దేశాలు, యూరోపియన్ యూనియన్ దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. రష్యాకు ఉన్న మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అనే హోదాను తొలగించాయి. దీనివల్ల రష్యా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అధిక మొత్తంలో ట్యాక్సులు వసూల్ చేశాయి. తత్ఫలితంగా రష్యా తీవ్ర ఆర్థిక మాంద్యంలోకి కూరుకుపోతుందని అంచనా వేస్తున్నారు. ఉక్రెయిన్‌పై స్పెషల్ ఆపరేషన్ చేపట్టనున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించిన నేపథ్యంలో అమెరికా, దాని మిత్ర దేశాలు ఈ నిర్ణయాలు తీసుకోవడం గమనార్హం. రష్య ఆర్థిక వ్యవస్థ పాశ్చాత్య దేశాల ఆంక్షలు పెరుగుతుండటంలో US మరియు యూరోపియన్ కంపెనీల అక్కడ నుంచి తరలించబడుతున్నాయి. అలాగే. విదేశీ కరెన్సీ నిల్వలను తగ్గిపోయాయి.
