థాయ్‌లాండ్: థాయిలాండ్‌లో ఓ సైనికుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 20 మంది మృతిచెందారు. మరో 14 మంది గాయాలపాలయ్యారు.
థాయిలాండ్‌లోని నఖోన్‌ రట్చసిమా నగరంలో శనివారం మధ్యాహ్నం ఈ దారుణ ఘటన జరిగింది. 

నగరంలోని సైనిక స్థావరం నుండి  సైనిక వాహనాన్ని దొంగిలించిన సైనికుడు సర్జంట్‌ మేజర్‌ జక్రపంత్‌ తొమ్మా నగరానికి తీసుకెళ్లారు. అక్కడి షాపింగ్ మాల్‌లోకి ప్రవేశించాడు. తన వద్ద  ఉన్న గన్ తో అక్కడ ఉన్న వారిపై నిందితుడు విచక్షణరహితంగా కాల్పులు జరిపాడు. దీంతో అక్కడికక్కడే 20 మంది మృతి చెందారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు 

ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలను నిందితుడే స్వయంగా ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. తాను లొంగిపోవాలా, మరణాన్ని ఎవరూ తప్పించుకోలేరని నిందితుడు ఈ పోస్టులో పేర్కొన్నారు. నిందితుడు మాల్‌లోనే ఉన్నాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ షాపింగ్ మాల్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతానికి పోలీసులు తమ అదుపులోకి తీసుకొన్నారు. 

షాపింగ్ మాల్ లో ఉన్నవారిలో సుమారు 16 మందిని నిందితుడు బంధించినట్టుగా స్థానిక మీడియా ప్రకటించింది.