బ్యాంకాక్:థాయ్ లాండ్ లో ఆదివారం నాడు జరిగిన ఘోర ప్రమాదంలో 17 మంది మరణించారు.  రైల్వే ట్రాక్ దాటుతున్న బస్సును రైలు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకొంది.

బ్యాంకాక్ నుండి  చాగోంగ్ సావో ఫ్రావిన్సులోని ఒక ఆలయానికి బస్సులో భక్తులు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకొంది.బుద్దుడి ఆలయంలో ముగింపు వేడుకలో పాల్గొనేందుకు వెళ్లే సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకొందని అధికారులు తెలిపారు.

ఈ ఘటనలో ప్రస్తుతం 17 మంది మరణించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 29  మంది మరణించారని గవర్నర్ మైత్రి తెలిపారు.

రైల్వే ట్రాక్ దాటుతున్న బస్సును రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు రైల్వే ట్రాక్ పై పడిపోయింది. ఈ ప్రమాదంలో కుప్పకూలిపోయిన బస్సును క్రేన్ సహాయంతో సహాయక బృందాలు బయటకు తీస్తున్నాయి. 

థాయ్‌లాండ్ లో ఈ తరహా ప్రమాదాలు చోటు చేసుకోవడం సాధారణం,  ప్రపంచంలో అత్యంత ప్రాణాంతకమైన రహదారుల జాబితా ఈ దేశంలో ఎక్కువగా ఉన్నాయి.
మద్యం సేవించి వాహనాలు నడపడం, బలహీనమైన డ్రైవింగ్ చట్టాలు ప్రమాదాలకు కారణంగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారంగా ప్రపంచంలో ట్రాఫిక్ మరణాల రేటును రెండో స్థానంలో నిలిచింది.ఈ ప్రమాదాల్లో మరణించినవారిలో మోటార్ సైకిలిస్టులు, పర్యాటకులు, వలస కార్మికులు ఉన్నారు.