తరువాత కొన్ని కారణాలతో వారు విడిపోయారు. అయితే తను ఇచ్చి బైక్‌ను తిరిగి ఇవ్వాలని యువతి అతన్ని కోరింది. ఇందుకు యువకుడు నిరాకరించాడు. దీంతో ఎలాగైన మాజీ ప్రేమికుడిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది. 

ప్రేమలో పడటం ఈ రోజుల్లో చాలా సులభం. ప్రేమలో పడటం ఎంత సులభమో.. అంతే సులభంగా విడిపోతున్నారు. చిన్న చిన్న మనస్పర్థలు, కోపాలు, నమ్మకం లేకపోవడం.. ఇలా కారణం ఏదైనా బ్రేకప్ చెప్పుకునేవారు పెరిగిపోయారు. అయితే.. బ్రేకప్ తర్వాత... తమ మాజీ ప్రియుడు లేదా ప్రియురాలిపై కోపం పెంచుకునేవారు కూడా చాలా మందే ఉన్నారు. తాజాగా.. ఓ యువతి.. ప్రియుడి మీద కోపంతో.. అతని అత్యంత విలువైన వస్తువును నాశనం చేసింది. ప్రియుడికి సంబంధించిన రూ.23లక్షల విలువైన బైక్ ని తగలపెట్టింది. ఈ సంఘటన థాయ్ లాండ్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

థాయ్‌లాండ్‌కు చెందిన ఓ జంట కొంతకాలం ప్రేమించుకున్నారు. ఆ సమయంలో కనాక్‌ వావన్‌ అనే యువతి తన లవర్‌కు లక్షల విలువైన బైక్‌ను గిఫ్ట్‌గా అందించింది. తరువాత కొన్ని కారణాలతో వారు విడిపోయారు. అయితే తను ఇచ్చి బైక్‌ను తిరిగి ఇవ్వాలని యువతి అతన్ని కోరింది. ఇందుకు యువకుడు నిరాకరించాడు. దీంతో ఎలాగైన మాజీ ప్రేమికుడిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది. 

ఓ ప్లాన్‌ వేసింది. బ్యాంకాక్‌లోని ఓ భవనం మూడో అంతస్తులో ప్రియుడి బైక్‌ పార్క్‌ చేసి ఉందని తెలుసుకుంది. అక్కడికి వెళ్లి ఆమె ఇచ్చిన లగ్జరీ బైక్‌ను పెట్రోల్‌ పోసి తగలబెట్టింది. ఈ క్రమంలో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. పక్కనే ఉన్న మరో ఆరు బైక్‌లకు కూడా మంటలు అంటుకున్నాయి. అయితే అక్కడున్న సిబ్బంది వెంటనే తెరుకొని అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో పెద్ద ప్రమాదమే తప్పింది.

అనంతరం సీసీ టీవీఫుటేజీని పరిశీలించగా అసలు విషయం బయటపడింది. ప్రమాదం జరిగడానికి ముందు ఓ మహిళ వచ్చి ఓ బైక్‌ మీద పెట్రోల్‌ పోసి తగలబెట్టడం పోలీసులు గమనించారు. ప్రమాదానికి కనాక్‌ వావన్‌ కారణమని తెలుసుకొని ఆమెను అరెస్ట్‌ చేసి విచారించగా మరిన్ని వివరాలు బయటకొచ్చాయి. ఆ బైక్‌ ధర ఒక మిలియన్‌ బాట్‌ అంట. అంటే మన కరెన్సీలో సుమారు ₹23 లక్షల వరకు ఉంటుంది. ఇద్దరూ ప్రేమలో ఉన్నప్పుడే ఆమె కొనిచ్చనని, ఇప్పుడు విడిపోవడంతో అతని మీద కోపంతో ఆ బైక్‌ను తగలబెట్టాలని తెలిపింది.దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.