Asianet News TeluguAsianet News Telugu

Texas Shooting: కాల్పులకు ముందు ఓ అమ్మాయికి మెసేజ్ చేసిన షూటర్.. వారిమధ్య ఏం సంభాషణ జరిగిందంటే?

టెక్సాస్‌లో కాల్పులకు పాల్పడ్డ దుండగుడు అంతకు ముందు ఓ అమ్మాయికి మెసేజ్‌లు పంపాడు. సోషల్ మీడియాలో తన గన్ ఫొటోలను షేర్ చేస్తూ ఆ అమ్మాయి ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌కు ట్యాగ్ చేశారు. దీంతో చాలా మంది ఆమెను ఆ షూటర్ గర్ల్‌ఫ్రెండ్‌గా భావించారు. కానీ, ఆమె ఆ అనుమానాలను ఖండించింది. ఆ షూటర్ తనకు పంపిన మసేజ్‌లనూ బహిర్గతం చేసింది.

texas shooter chate with teenage girl in social media before firing in elementary school
Author
New Delhi, First Published May 25, 2022, 2:54 PM IST

న్యూఢిల్లీ: అమెరికాలోని టెక్సాస్ ఎలిమెంటరీ స్కూల్‌లో చిన్నారులను దారుణంగా కాల్చి హతమార్చిన షూటర్ ఈ మారణహోమానికి ముందు ఓ అమ్మాయికి మెస్సేజ్‌లు పంపాడు. ఆ షూటర్ సోషల్ మీడియాలో తన గన్ చిత్రాలను పోస్టు చేస్తూ ఆ టీనేజ్ గర్ల్‌ అకౌంట్‌ను ట్యాగ్ చేశాడు. దీంతో ఆ బాలిక షూటర్ గర్ల్ ఫ్రెండ్ అనే అనుమానాలు వచ్చాయి. కానీ, ఆ బాలిక బయటకు వచ్చి ఆ ఆరోపణలను తిప్పికొట్టింది. గన్ షూటర్ తనకు చేసిన మెస్సేజ్‌లను బయటపెట్టింది. ఇంతకీ వారి మధ్య ఏం సంభాషణ జరిగిందంటే?

టెక్సాస్ నరమేధానికి పాల్పడిన సాల్వడార్ రామోస్‌ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌గా భావిస్తున్న హ్యాండిల్ నుంచి ఓ టీనేజ్ గర్ల్‌కు మెస్సేజ్‌లు వెళ్లాయి. ఆ హ్యాండిల్ పోస్టు చేసిన గన్ చిత్రాలనూ ఆమెతో ట్యాగ్ చేశారు. ఈ విషయమై వారి మధ్య మెస్సేజ్‌లు బట్వాడా అయ్యాయి.

మే 12న సాల్వడార్ తన గన్ చిత్రాలను పోస్టు చేశాడు. వాటిని ఈ టీనేజ్ గర్ల్‌కు ట్యాగ్ చేశాడు. దీంతో ఆమె నీ గన్‌లతో నాకేం సంబంధం అంటూ సమాధానం ఇచ్చింది. జస్ట్.. నిన్ను ట్యాగ్ చేయాలనిపించింది అంటూ షూటర్ సమాధానం ఇచ్చాడు. తానొక రహస్యం చెప్పాలని భావిస్తున్నట్టు ఆ షూటర్ మరుసటి రోజు చెపపాడు. దీంతో వారి మధ్య మెస్సేజ్‌లు కొన్ని పెరిగాయి. 

తాను ఆ సీక్రెట్ చెప్పిన తర్వాత తప్పకుండా రెస్పాండ్ కావాలని కోరాడు. కానీ, ఆమె అనారోగ్యంతో ఉన్నదని, నిద్రలో ఉంటే మాత్రం రెస్పాండ్ కాలేనని స్పష్టం చేసింది. 

ఆ తర్వాత చాలా మెసేజ్‌లు పంపాడు. అసలు సంబంధం లేకుండా ఈ మెస్సేజ్‌లు ఏంటా అని ఆమె కూడా కన్ఫ్యూజ్ అవుతున్నట్టు సమాధానం ఇచ్చింది.

ఆ షూటర్ ఎవరో తనకు తెలియదని, ర్యాండమ్‌గానే మెస్సేజ్ చేశాడని వివరించింది.  తాను కనీసం టెక్సాస్‌లోనూ ఉండనని చెప్పింది. 

టెక్సాస్ కాల్పుల గురించి తెలియగానే తాను ఆ మెస్సేజ్‌లను పోలీసుల ముందుర అప్పజెప్పినట్టు ఆమె తెలిపింది. గన్ ఫొటోలు తనతో ట్యాగ్ చేయడంతో ఆమె హడలెత్తిపోయిందని, ఆ భయంతోనే ఆ షూటర్‌తో కొన్ని మెసేజ్‌లు చేసినట్టు వివరించింది. షూటర్ ఫొటోలతో ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ఫేక్ అకౌంట్లు పుట్టుకొచ్చాయి. ఈ ఖాతాలపైనా ఆమె విరుచుకుపడ్డారు. ఆ షూటర్‌లా ఫోజులు పెడుతూ అకౌంట్లు క్రియేట్ చేసుకోవడం దారుణం అని, వారి వైఖరి చెండాలంగా ఉన్నదని పేర్కొంది.

టెక్సాస్ షూటర్ సాల్వడార్ తన గన్ చిత్రాలను ఈ టీనేజ్ గర్ల్‌తో ట్యాగ్ చేయడంతో ఆమె ఆయన గర్ల్ ఫ్రెండ్ అని కొందరు అనుమానం వ్యక్తం చేశారు. ఆ అనుమానాలను ఆమె ఖండించారు. ఆయన తనకు పరిచయస్తుడు కాదని, ఆయన గురించి తనకేమీ తెలియదని ఆ అమ్మాయి స్పష్టం చేసింది. తన గన్ పోస్టులో ట్యాగ్ చేయడానికి ఆయనే నిర్ణయం తీసుకున్నాడని పేర్కొంది. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబీకులకు తన సానుభూతిని ప్రకటించారు.

అంతేకాదు, ఆయన ఓ సీక్రెట్ చెబుతాను అన్నప్పుడే మేలుకొని ఉంటే.. ఈ కాల్పుల గురించి తనకు చెప్పేవాడేమో.. తద్వార ఈ మారణ హోమం జరగకుండా అడ్డుకుని ఉంటే బాగుండేదేమోనని ఆవేదన చెందారు.

Follow Us:
Download App:
  • android
  • ios