Asianet News TeluguAsianet News Telugu

మెక్సికో జైలుపై ఉగ్రవాదుల దాడి.. 14 మంది మృతి.. 24 మంది ఖైదీలు పరారీ..

ఉత్తర మెక్సికోలోని సియుడాడ్ జుయారెజ్‌లోని జైలుపై ఆదివారం ఉగ్రదాడి జరిగింది. ఈ దాడి వల్ల 14 మంది చనిపోయారు. 24 మంది జైలు నుంచి తప్పించుకున్నారు. 

Terrorist attack on Mexico prison.. 14 dead.. 24 prisoners escaped..
Author
First Published Jan 2, 2023, 9:58 AM IST

ఉత్తర మెక్సికోలోని సియుడాడ్ జుయారెజ్‌లోని జైలుపై ఆదివారం ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో 14 మంది హతమయ్యారు. 24 మందిని జైలు నుంచి తప్పించారు. మృతుల్లో 10 మంది భద్రతా సిబ్బంది, నలుగురు ఖైదీలు ఉన్నారని మెక్సికన్ అధికారులు తెలిపారు. మరో 13 మందికి గాయాలు అయ్యాయి.

కరోనా ఉత్పాతాన్ని ఎదుర్కోవడానికి చైనాకు సహకరిస్తాం.. తైవాన్ ఆఫర్

గుర్తు తెలియని సంఖ్యలో ఉగ్రవాదులు వాహనాల్లో వచ్చి కాల్పులు జరిపారని అధికారులు పేర్కొన్నారు. ఈ దాడి ఆదివారం ఉదయం ప్రారంభమైంది. దీంతో భద్రతా బలగాలు అక్కడికి చేరుకున్నాయి. ఐదు గంటల తరువాత పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చాయి.

క‌రోనా క‌ల‌క‌లం.. చైనా ప్ర‌యాణికుల‌పై ఆంక్ష‌లు విధిస్తున్న దేశాలు

దాడికి కొన్నిక్షణాల ముందు ఉగ్రవాదులు సమీపంలోని బౌలేవార్డ్ వెంబడి మున్సిపల్ పోలీసులపై కాల్పులు జరిపారు. దాడి చేసినవారు జైలు వెలుపల ఉన్న మరొక భద్రతా ఏజెంట్లపై కాల్పులు జరిపారని తెలిపారు. కొంత మంది ఖైదీల బంధువులు నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవడానికి కాంపౌండ్ వెలుపల వేచి ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. దీంతో అక్కడంతా గందరగోళం నెలకొంది. లోపల కొందరు ఖైదీలు వివిధ వస్తువులకు నిప్పంటించారని, జైలు గార్డులతో ఘర్షణ పడ్డారని స్థానిక మీడియా నివేదించింది.

పాకిస్థాన్ న్యూయర్ వేడుకల్లో కాల్పులు.. 22 మందికి గాయాలు

జైలులోని స్పెషల్ రూముల్లో ఉన్న ఖైదీలకు, భద్రతా బలగాలకు మధ్య వాగ్వాదం జరిగిందని న్యాయవాదులు పేర్కొన్నారు. ఈ ఘటనలో ప్రమేయం ఉందని భావిస్తున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కాల్పుల సమయంలో 24 మంది ఖైదీలు తప్పించుకోగలిగారు. అయితే ఈ దాడికి గల కారణాలు ఏంటనే విషయంలో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు పాల్పడింది ఎవరనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.

మెక్సికన్ జైళ్లు గతంలో కూడా అనేక హింసాత్మక ఘటనలు వెలుగు చూశాయి. కొన్నింటిలో అధికారులు నామమాత్రపు పర్యవేక్షణ మాత్రమే ఉంటుంది. ప్రత్యర్థి ముఠాల ఖైదీల మధ్య క్రమం తప్పకుండా ఘర్షణలు చెలరేగుతాయి. ఇవి జుయారెజ్ వంటి ప్రదేశాలలో మాదకద్రవ్యాల కార్టెల్‌లకు ప్రాక్సీలుగా పనిచేస్తాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios