షార్క్ తన నోరు తెరిచి ఆమెను మింగడానికి  సిద్ధంగా ఉన్న సమయంలో.. సదరు మహిళ తప్పించుకొని పడవ ఎక్కడం విశేషం. టైగర్ షార్క్ మహిళ ఫ్లిప్పర్‌లను దాదాపుగా తాకుతుంది.

షార్క్ ని నీటిలో దూరంగా చూస్తేనే భయం వేస్తుంది. అలాంటిది దాని దగ్గరకు.. అది కూడా దాని నోటిదాక వెళ్తే ఎంత భయకరంగా ఉంటుందో ఓసారి ఊహించుకోండి. ఓ మహిళకు ఇదే అనుభవం ఎదురైంది. నీటిలో డైవింగ్ చేస్తుండగా.. షార్క్ నోటిలోకి వెళ్లబోయి తృటిలో తప్పించుకుంది.దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారగా... పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

'ఆడ్లీ టెర్రిఫైయింగ్' సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా శుక్రవారం ఈ వీడియో పోస్టు చేయగా.. వైరల్ గా మారింది. షార్క్ తన నోరు తెరిచి ఆమెను మింగడానికి సిద్ధంగా ఉన్న సమయంలో.. సదరు మహిళ తప్పించుకొని పడవ ఎక్కడం విశేషం. టైగర్ షార్క్ మహిళ ఫ్లిప్పర్‌లను దాదాపుగా తాకుతుంది.

Scroll to load tweet…

"జంప్ ఇన్" అనే క్యాప్షన్‌తో వీడియో షేర్ చేశారు. 'డీప్ బ్లూ సీ' లేదా 'జాస్' వంటి ప్రముఖ షార్క్ మూవీని చూసిన అనుభూతి కలుగుతుంది. ఈ వీడియోకి 1.6 మిలియన్ కంటే ఎక్కువ వ్యూస్ రావడం గమనార్హం.

ఫుటేజ్ వాస్తవానికి అక్టోబర్, 2022లో రామ్సే అనే మహిళ తన ఇన్ స్ట్రా గ్రామ్ పేజీలో షేర్ చేసుకుంది. పాతది అయినప్పటికీ ఇప్పుడు ఇది వైరల్ గా మారడం గమనార్హమం. ఈ సంఘటన హవాయిలో జరిగింది. క్యాప్షన్‌లో, ఆమె షార్క్‌ను క్వీన్ నిక్కీగా పేర్కొనడం గమనార్హం.