Asianet News TeluguAsianet News Telugu

41మంది మహిళలపై అత్యాచారం.. నిందితుడికి వెయ్యేళ్ల జైలుశిక్ష

దొంగ‌త‌నాల‌తో పాటు మహిళలపై అత్యాచారాల‌కు పాల్ప‌డేవాడు. ప‌లువురు బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల‌ మేరకు రంగంలోకి దిగిన పోలీసులు సెల్లో అబ్రమ్ మాపున్యాను అదుపులోకి తీసుకున్నారు.

Tears of joy as Pretoria serial rapist sentenced to 1,088 years in prison
Author
hyderabad, First Published May 29, 2021, 8:41 AM IST

మహిళలపై వరస అత్యాచారాలకు పాల్పడిన వ్యక్తికి న్యాయస్థానం ఇచ్చిన తీర్పు సంచలనం రేపుతోంది. దక్షిణాఫ్రికా న్యాయస్థానం.. ఓ అత్యాచార నిందితుడికి వెయ్యేండ్ల జైలుశిక్ష విధించింది. 40ఇళ్లలో దొంగతనాలు చేయడంతో పాటు 41 మందికి పైగా మహిళలపై అత్యాచారాలకు పాల్పడినందుకు వెయ్యేండ్ల‌కు పైగా జైలు శిక్ష విధించింది. 

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సెల్లో అబ్రమ్ మాపున్యా (33) అనే వ్యక్తి (2014-19) మధ్య ఇండ్ల‌లో చొరబడి దొంగతనాలు చేసేవాడు. దొంగ‌త‌నాల‌తో పాటు మహిళలపై అత్యాచారాల‌కు పాల్ప‌డేవాడు. ప‌లువురు బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల‌ మేరకు రంగంలోకి దిగిన పోలీసులు సెల్లో అబ్రమ్ మాపున్యాను అదుపులోకి తీసుకున్నారు.


ఆ త‌ర్వాత నిందితుడిని కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసుకు సంబంధించి విచారణ జరిపిన కోర్టు.. నిందితుడు సెల్లో అబ్రమ్ మాపున్యాను దోషిగా తేల్చింది. సెల్లో అబ్రమ్ మొత్తం 40 ఇండ్ల‌లో చోరీలకు పాల్ప‌డ‌టంతో పాటు 41 మంది మహిళలపైగా అత్యాచారం చేసినట్టు ధృవీకరించింది. ఈ క్రమంలోనే న్యాయ‌స్థానం సెల్లో అబ్రమ్ మాపున్యాకు 1,088 ఏండ్ల‌ జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.

Follow Us:
Download App:
  • android
  • ios