Asianet News TeluguAsianet News Telugu

Afghanistan: తాలిబాన్లకు వ్యతిరేకంగా ఉపాధ్యాయుల నిరసనలు.. జీతాలివ్వాలని డిమాండ్

ఆఫ్ఘనిస్తాన్‌లో నిరసనగళాలు పెరుగుతున్నాయి. ఇన్నాళ్లు హక్కులకే పరిమితమైన నిరసనలు ఇప్పుడు ఆర్థికాంశాల చుట్టూ బయటకు వస్తున్నాయి. తాజాగా, హెరాత్ ప్రావిన్స్‌లో ఉపాధ్యాయులు ఆందోళనబాట పట్టారు. నాలుగు నెలలుగా నిలిపేసిన తమ జీతాలను వెంటనే చెల్లించాలని తాలిబాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కారు. ఆఫ్ఘనిస్తాన్‌లో రోజువారీ జీవితాలను వెళ్లదీయడం ఉపాధ్యాయులకు ఇప్పుడు కష్టంగా మారింది. 
 

teachers went protest demanding salaries against taliban in afghanistan
Author
New Delhi, First Published Oct 22, 2021, 1:21 PM IST

న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్‌లో ఆర్థిక సమస్యలు క్రమంగా జటిలమవుతున్నాయి. యుద్ధాలతో ఛిద్రమైన Afghanistan ఆర్థిక వ్యవస్థ పతన దశకు చేరింది. నగదు చలామణి తగ్గిపోయింది. బ్యాంకుల్లోనూ నగదు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాధారణ పౌరులూ డబ్బు లేక రోజువారీ జీవనం గడపడానికి విలవిల్లాడుతున్నారు. Taliban ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత హక్కుల కోసం నిరసనలు పెద్దపెట్టున జరిగాయి. ఇప్పుడు ఆర్థిక సమస్యలపైనా ఆందోళనలు మొదలయ్యాయి. తాజాగా, Herat ప్రావిన్స్‌లో వేలాది మంది Teachers రోడ్డెక్కారు. పెండింగ్‌లో ఉన్న తమ Salaries అందించాలని తాలిబాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నిరసనబాట పట్టారు.

గత నాలుగు నెలలుగా టీచర్లకు జీతాలు అందడం లేదు. వారి జీతాలే అంతంత మాత్రంగా ఉన్నాయి. అవి అప్పటి రోజువారీ జీవితాలకు సరిపడేలా ఉన్నాయి. భవిష్యత్ కోసం దాచుకునే స్థాయిలో జీతాల్లేవు. దీంతో నాలుగు నెలలుగా ఉపాధ్యాయుల జీవితాలు దుర్భరంగా మారాయి. ఇంటిలో కరెంట్ బిల్లులు, ఇతర కనీస అవసరాలూ తీర్చుకోలేని స్థితికి వారు దిగజారారు. దీంతో విద్యుత్ కోతలు మొదలయ్యాయి. ఎటూ తాళలేక వారు రోడ్డెక్కి Protest చేస్తున్నారు. భవిష్యత్ అవసరాల కోసం దాచుకునే స్థాయిలో టీచర్లకు వేతనాలు లేవని నిరసన చేస్తున్న ఓ టీచర్ లతీఫా అలిజాయ్ టోలో న్యూస్ ప్రతినిధికి చెప్పారు. ఇంటిలో కరెంట్ బిల్లులు కట్టడానికి డబ్బుల్లేవని మరో టీచర్ నసీర్ అహ్మద్ హకీమీ తెలిపారు. ఇంకో టీచర్ సాదత్ అతీఫ్ మాట్లాడుతూ, నా కూతురు కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నదని చెప్పారు. కానీ, ఆమెను ఓ వైద్యుడి దగ్గరకూ తీసుకెళ్లడానికి డబ్బు లేదని వాపోయారు.

Also Read: సంక్షోభం అంచున ఆఫ్ఘనిస్తాన్ బ్యాంకింగ్ సెక్టార్.. రిజర్వుల నిలిపివేతతో కుదేలు

కనీసం నాలుగు నెలలుగా సుమారు 18వేల మంది టీచర్లు జీతాలు అందుకోలేదు. ఇందులో సుమారు 10వేల మంది మహిళా టీచర్లు ఉన్నారని టోలో న్యూస్ సంస్థ అంచనా వేసింది.

గత ఆగస్టులో పాశ్చాత్య దేశాల మద్దతున్న అష్రఫ్ ఘనీ ప్రభుత్వాన్ని కూల్చి తాలిబాన్లు అధికారాన్ని హస్తగతం చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పటికే 20ఏళ్లుగా ఈ ప్రభుత్వంతో తాలిబాన్లు పోరాడుతూనే వచ్చారు. అంతకు ముందు నుంచే ఆఫ్ఘనిస్తాన్‌లో ఆర్థిక వ్యవస్థ ప్రమాదకరపరిస్థితుల్లోనే కొనసాగింది. తాలిబాన్లు అధికారంలోకి రాగానే బ్యాంకింగ్ సంక్షోభం ప్రధానంగా తెరపైకి వచ్చింది. వారు అధికారంలోకి రాగానే బ్యాంకులు మూసేశారు. తర్వాత క్రమంగా తెరిచినప్పటికీ ఖాతాదారులందరు తమ సొంత డబ్బునే బ్యాంకుల నుంచి తీసుకోలేని దుస్థితికి బ్యాంకింగ్ సెక్టార్ చేరుకుంది. 

Also Read: ఆ ముస్లిం యోధుడు.. సోమనాథ్ ఆలయ విగ్రహాలను ధ్వంసం చేశాడు.. తాలిబాన్ నేత ట్వీట్.. ఇండియన్స్ ఫైర్

ఏ క్షణాన ఏ రంగం కుదేలవుతుందో చెప్పలేని పరిస్థితి. ముఖ్యంగా Banking Sector సంక్షోభం అంచున ఉన్నది. ఏ క్షణాన కుప్పకూలుతుందో అన్నట్టుగా పరిస్థితులున్నాయి. అమెరికాలోని అఫ్ఘనిస్తాన్ Reserves నిలిపివేత దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నది. ఇదే విషయాన్ని ఇస్లామిక్ బ్యాంక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ చీఫ్ సయ్యద్ మూసా అల్ ఖలీమ్ అల్ ఫలాహి తెలిపారు. దేశంలో ఫైనాన్షియల్ సెక్టార్ ఎప్పుడూ కుదేలవుతుందో చెప్పలేమని అన్నారు. ప్రజలు భారీ స్థాయిలో నగదు విత్ డ్రా చేసుకుంటుండంతో ఈ పరిస్థితులు తలెత్తాయని వివరించారు. ప్రస్తుతం దేశంలో చాలా బ్యాంకులు పనిచేయడం లేదని తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios