తాలిబాన్ ప్రభుత్వం మరోసారి వివాదాస్పద నిర్ణయం తీసుకుని వార్తల్లో నిలిచింది. బాలికలకు ఉన్నత పాఠశాల విద్యను అందిస్తామని ప్రకటించి.. వెంటనే మళ్లీ ఆ ఆదేశాలను వెనక్కి తీసుకుంది. ఈ నెల 22 నుంచి బాలికలకు సెకండరీ పాఠశాల విద్యను అందించడానికి అనుమతులు ఇస్తూ తాలిబాన్ ప్రభుత్వం ప్రకటించింది. కానీ, అందుకు అనుగుణంగా బాలికలు పాఠశాలలకు వెళ్లగానే వెంటనే ఆ ఆదేశాలను వెనక్కి తీసుకుంది. 

న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లు మరో ఛాందసవాద నిర్ణయం తీసుకున్నారు. బాలికలకు సెకండరీ పాఠశాల విద్యాభ్యాసంపై ఆంక్షలు విధించారు. వారికి సెకండరీ విద్యపై నిషేధాన్ని విధించారు. బాలికలకు సెకండరీ పాఠశాలలను పునరుద్ధరించాలనే నిర్ణయం తీసుకున్న గంటల వ్యవధిలోనే మూసేస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో బాలికలకు సెకండరీ పాఠశాల విద్య బోధించడంపై కన్ఫ్యూజన్ ఏర్పడింది. దీనిపై తాలిబాన్ ప్రతినిధి ఇనాముల్లా సమంగని స్పందించారు. ఔను.. బాలికలకు సెకండరీ పాఠశాల విద్యార్జనపై నిషేధం విధించినట్టు ధ్రువీకరించారు. పాఠశాలలకు వచ్చిన బాలికలను తిరిగి ఇంటికి వెళ్లిపోవాలని ఆదేశించినట్టు పేర్కొన్నారు.

గతేడాది ఆగస్టులో తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్‌లో అధికారాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత బాలికలకు విద్యపై నిషేధం విధించారు. కానీ, అంతర్జాతీయ సమాజం ఒత్తిడి, ప్రపంచ దేశాల కండీషన్లతో తాలిబాన్లు ఒకడుగు వెనక్కి వేశారు. అక్కడ ఉన్నత పాఠశాల విద్యను అర్జించడానికి విద్యార్థులకు అనుమతి ఇస్తూ ఇటీవలే ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 22వ తేదీ నుంచి సెకండరీ పాఠశాలలను విద్యార్థులకు అందించవచ్చని అనుమతులు ఇచ్చింది. కానీ, ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చిన గంటల్లోనే వాటిని వెనక్కి తీసుకుంటూ నిర్ణయాలు తీసుకున్నారు. 

Scroll to load tweet…

పాఠశాలలు తెరిచారని బాలికలు సెకండరీ పాఠశాలలకు వెళ్లారు. కానీ, వారికి మళ్లీ విద్యను అందించడంపై నిషేధం విధించడంతో వెనక్కి వెళ్లిపోయారు. ఏఎఫ్‌పీ మీడియా ఏజెన్సీ ఉదయమే.. బాలికలు సెకండరీ పాఠశాలల ముందు వీడియో తీయడానికి కాబూల్‌లోని జార్గోనా హై స్కూల్‌కు వెళ్లారు. బాలికలు సెకండరీ పాఠశాలలకు వచ్చారు. వెంటనే ఓ టీచర్ స్కూల్‌ లోపలికి వెళ్లారు. ఆ బాలికలు అందరినీ తమ తమ ఇళ్లల్లోకి వెళ్లిపోవాలని ఆదేశించారు. దీంతో ఒక్కసారిగా కన్ఫ్యూజన్ నెలకొంది. తాజాగా, తాలిబాన్ ప్రతినిధి ఇనాముల్లా సమంగని ధ్రువీకరించారు. 

తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించాలంటే.. ఆర్థిక సహాయం అందించాలంటే ముందుగా.. అందరికీ విద్యను హక్కుగా గుర్తించాలని అంతర్జాతీయ సమాజం కండీషన్ పెట్టింది.

మార్చి 22న ఉన్నత పాఠశాలలు తెరిచినప్పుడు బాలికలను తిరిగి తరగతుల‌కు అనుమతించనున్నామ‌ని తాలిబాన్లు వెల్ల‌డించారు. ఈ నిర్ణయాన్ని అంతర్జాతీయ సమాజం స్వాగతించింది. దీనిపై ఐరాస చీఫ్ కూడా స్పందిస్తూ ట్వీట్ చేశారు. "మార్చి 22న బాలికలు మరియు బాలుర కోసం పాఠశాలలను తిరిగి తెరవడానికి తాలిబాన్లు ప్రకటించిన ప్రణాళికను నేను స్వాగతిస్తున్నాను, అది ఇప్పుడు ఆమోదించబడాలి మరియు అమలు చేయబడాలి. బాలికలు మరియు అబ్బాయిలు విద్యను అభ్యసించడానికి మరియు వారి పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడానికి అన్ని తలుపులు తెరిచి ఉండాలి" అని UN చీఫ్ ట్వీట్ చేశారు.