ఉక్రెయిన్‌పై (Ukraine) రష్యా దాడిని (russia) ప్రపంచదేశాలన్నీ ఖండిస్తున్న సంగతి తెలిసిందే. . తాజాగా ఈ అంశంపై ఆఫ్ఘనిస్థాన్‌ను పాలిస్తున్న తాలిబన్లు (talibans) సైతం స్పందించారు. రెండు దేశాలు సంయమనాన్ని పాటించాలని.. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని తాలిబన్ ప్రభుత్వం సూచించింది.
ఉక్రెయిన్‌పై (Ukraine) రష్యా దాడిని (russia) ప్రపంచదేశాలన్నీ ఖండిస్తున్న సంగతి తెలిసిందే. అమెరికా సహా నాటో దేశాలు పుతిన్ (putin) నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. యుద్ధాన్ని ఆపేందుకు అన్ని దేశాలు కృషి చేస్తున్నాయి. అమెరికా, బ్రిటన్ , జర్మనీ, యూరోపియన్ యూనియన్‌లు రష్యాపై ఆంక్షలు విధించాయి. అటు భారత ప్రధాని నరేంద్ర మోడీ సైతం పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడి యుద్ధాన్ని విరమించుకోవాలని సూచించారు. తాజాగా ఈ అంశంపై ఆఫ్ఘనిస్థాన్‌ను పాలిస్తున్న తాలిబన్లు (talibans) సైతం స్పందించారు. రెండు దేశాలు సంయమనాన్ని పాటించాలని.. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని తాలిబన్ ప్రభుత్వం సూచించింది. ఉక్రెయిన్ లో తమ విద్యార్థులు చదువుకుంటున్నారన్న తాలిబన్లు... విద్యార్థుల రక్షణపై ఆందోళన వ్యక్తం చేసింది. యుద్ధం వల్ల ప్రాణాలు కోల్పోతున్న ప్రజల గురించి తాలిబన్లు ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే తాలిబన్లు చేసిన ప్రకటనపై సోషల్ మీడియాలో నెటిజన్లు కౌంటర్ వేస్తున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు.. గడిచిన రెండు దశాబ్ధాలుగా ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల దాడుల్లో వేలాది మంది అమాయపౌరులు మరణించారు. అలాంటి తాలిబన్లు శాంతి ప్రవచనాలు వల్లించడం కొందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది.
గతేడాది ఆగస్టు 15న ఆఫ్గన్‌లోని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసి.. తాలిబన్లు దేశ పాలనా పగ్గాలను చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో అప్పటి ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం విడిచి పారిపోవడంతో .. తాలిబన్లు ఎలాంటి ప్రతిఘటన లేకుండా రాజధాని కాబూల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఫలితంగా ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం కుప్పకూలగా.. తాలిబన్ల సారథ్యంలోని ఇస్తామిక్ ఎమిరేట్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ పేరిట ప్రభుత్వం ఏర్పడింది.
అంతకుముందు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ (volodymyr zelensky) .. భావోద్వేగానికి గురయ్యారు. యుద్ధంలో ఒంటరైపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. విదేశాల నుంచి ఎలాంటి సాయాన్ని ఆశించవద్దని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. అయితే, తాము మాత్రం రష్యాను చూసి భయపడట్లేదని, పోరాడుతామని, దేశాన్ని కాపాడుకుంటామని స్పష్టం చేశారు. రష్యా దాడికి బెదిరేది లేదంటున్నారు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాడిమిర్ జెలొంస్కీ. రష్యా దాడులను తిప్పికొడతామని స్పష్టం చేశారు. ప్రపంచదేశాలు తమకు సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో 10 రష్యా యుద్దవిమానాలను , హెలికాప్టర్లను కూల్చేసినట్టు ఉక్రెయిన్ ప్రకటించింది. అయితే తాము ఒక్క యుద్ద విమానాన్ని కూడా కోల్పోలేదని ఉక్రెయిన్ అసత్య ప్రచారం చేస్తుందని రష్యా పేర్కొంది.
తాజాగా.. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ (Sergey Lavrov) సంచలన ప్రకటన చేశారు. ఉక్రెయిన్ సైన్యం తక్షణమే యుద్దం ఆపాలి. ఉక్రెయిన్ సైన్యం తన చేతుల్లోని ఉన్న ఆయుధాలను వదిలేయాలి. ఆపై రష్యా సైన్యానికి లొంగిపోవాలి. ఉక్రెయిన్ సైన్యం మొత్తం రష్యా సైన్యానికి లొంగిపోయాలి. ఆ తర్వాత ఉక్రెయిన్ ప్రభుత్వంతో తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ చెప్పారు. మరి ఈ ప్రకటనపై ఉక్రెయిన్ అధ్యక్షుడు ఎలా స్పందిస్తారో చూడాలి.
