Asianet News TeluguAsianet News Telugu

ఆఫ్గనిస్తాన్ స్కూల్‌లో ఆత్మాహుతి దాడి.. 100కుపైగా విద్యార్థులు దుర్మరణం

అఫ్గనిస్తాన్‌లోని ఓ స్కూల్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఇందులో కనీసం 100 మంది విద్యార్థులు మరణించారు. యూనివర్సిటీ పరీక్ష కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థులపై ఈ దాడి జరగడం గమనార్హం. కాబూల్‌లోని కాజ్ హైయర్ ఎడ్యుకేషనల్ సెంటర్‌లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
 

suicide bombing in afghanistan school, at least 100 students died
Author
First Published Sep 30, 2022, 10:55 PM IST

న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్‌ స్కూల్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. కాబూల్‌లోని ఓ స్కూల్‌లో ఉగ్రవాదులు టార్గెట్ చేసుకుని సూసైడ్ బాంబింగ్‌కు పాల్పడ్డారు. ఈ దాడిలో 100కు పైగా విద్యార్థులు అక్కడికక్కడే మరణించారు. వారి శరీర భాగాలు తెగి చెల్లాచెదురుగా పడిపోయాయి. ఆ స్కూల్ స్టాఫ్ కొందరు ఇలా విడి పడిపోయిన శరీర భాగాలు, కాళ్లు, చేతులను వెతుకుతూ ఒక చోట చేర్చారు. కాబూల్‌లోని పశ్చిమ ప్రాంతం దష్త్ ఈ భార్చి ఏరియాలో కాజ్ ఎడ్యుకేషన్ సెంటర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆఫ్గనిస్తాన్‌లో మూడో అతిపెద్ద వర్గమైన హజారాలను టార్గెట్ చేసుకుని ఈ దాడి జరిగినట్టు అనుమానిస్తున్నారు. 

యూనివర్సిటీలో చదువుకోవాలనే ఆశతో ఆ విద్యార్థులు అంతా సదరు ఎడ్యుకేషన్ సెంటర్‌కు వెళ్లారు. అక్కడ యూనివర్సిటీ ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాయడానికి ప్రిపేర్ అవుతున్నారు. ఇది కేవలం మాక్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ ఎగ్జామ్. నిజమైన పరీక్ష కోసం సన్నద్ధం కావడానికి ఈ క్లాసులకు వచ్చారని స్థానిక జర్నలిస్టు ఒకరు ట్వీట్ చేశారు. హాల్ అంతా కూడా విద్యార్థులతో ప్యాక్ అయింది. ఆత్మాహుతి దాడికి ముందు క్లాసులో విద్యార్థులు చదువుతున్న వీడియో కూడా సోషల్ మీడియాలో కనిపించింది. హాల్ నిండా విద్యార్థులే కనిపించారు. ఈ దాడిలో హజారాలు, షియా విద్యార్థులే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు.

వెస్ట్ కాబూల్‌లోని దష్త్ ఈ బార్చి ఏరియా తరుచూ ఐఎస్‌కేపీ దాడులకు టార్గెట్‌గా ఉంటూ వస్తున్నది.

పరీక్ష కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థులను సూసైడ్ బాంబర్ ప్రాణాలు తీశాడని పోలీసు ప్రతినిధి ఖాలీద్ జద్రాన్ తెలిపారు.

కాగా, అఫ్గనిస్తాన్‌కు అమెరికా మిషన్ చార్జ డీ అఫెయిర్స్‌గా ఉన్న కరెన్ డెక్కెర్ ఈ ఘటనపై స్పందించారు. కాజ్ హైయర్ ఎడ్యుకేషనల్ సెంటర్‌ లో జరిగిన ఇవాల్టి ఘటనను అమెరికా తీవ్రంగా ఖండిస్తున్నదని పేర్కొన్నారు. పరీక్షకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల గదిని టార్గెట్ చేసుకోవడం సిగ్గుచేటు అని తెలిపారు.ప్రతి విద్యార్థి శాంతియుతంగా.. నిర్భయంగా చదువుకోగలగాలని ట్వీట్ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios