పాకిస్తాన్‌ మిలటరీపై ఆత్మాహుతి దాడి జరిగింది. బలూచిస్తాన్ రాష్ట్రంలోని తుర్బట్ ప్రాంతంలో సైనికుల కాన్వాయ్‌పై సూసైడ్ బాంబర్ దాడి చేయడంతో 9 మంది జవాన్లు అక్కడికక్కడే మరణించగా...మరో 11 మందికి తీవ్రగాయాలయ్యాయి.

తామే ఈ దాడికి పాల్పడినట్లు బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్, బలోచ్ రిపబ్లిక్ గార్డ్ సంస్థలు ప్రకటించాయి. సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ పాక్‌లో పర్యటించనున్న నేపథ్యంలో ఈ దాడి జరగడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు.