Asianet News TeluguAsianet News Telugu

భారత ఫారెస్ట్‌ మ్యాన్‌ కు అరుదైన గౌరవం.. అమెరికా స్కూల్‌లో జాదవ్ పాఠం...

‘ఫారెస్ట్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా’గా సుపరిచితమైన అస్సాంకు చెందిన జాదవ్ పాయెంగ్ కు అరుదైన గౌరవం దక్కింది. నాలుగు దశాబ్ధాల పాటు ఒంటి చేత్తో కొన్ని వేల మొక్కలను నాటి 550 ఎకరాల అడవిని సృష్టించాడు. భారత ప్రభుత్వం జాదవ్ ను పద్మశ్రీతో సత్కరించింది. ఓ సందర్భంలో గ్రామస్తులు చెట్లను నరకబోతుంటే ప్రాణాలు అడ్డుపెట్టి మరీ కాపాడాడు.  

Story of Forest Man of India from Assam now part of US school curriculum - bsb
Author
hyderabad, First Published Nov 2, 2020, 2:52 PM IST

‘ఫారెస్ట్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా’గా సుపరిచితమైన అస్సాంకు చెందిన జాదవ్ పాయెంగ్ కు అరుదైన గౌరవం దక్కింది. నాలుగు దశాబ్ధాల పాటు ఒంటి చేత్తో కొన్ని వేల మొక్కలను నాటి 550 ఎకరాల అడవిని సృష్టించాడు. భారత ప్రభుత్వం జాదవ్ ను పద్మశ్రీతో సత్కరించింది. ఓ సందర్భంలో గ్రామస్తులు చెట్లను నరకబోతుంటే ప్రాణాలు అడ్డుపెట్టి మరీ కాపాడాడు.  

అమెరికాలోని బిస్టల్‌ గ్రీన్‌ హిల్స్‌ స్కూల్‌లో ఆరవ తరగతి విద్యార్ధులకు బోధించే పాఠ్యాంశాలలో జాదవ్‌ గురించిన పాఠం ఉంది. ఈ స్కూల్ టీచర్‌ నవామీ శర్మ మాట్లాడుతూ, ఎకాలజీ సిలబస్ లో భాగంగా జాదవ్‌ చేసిన మంచి పనులు చెబుతున్నాం. ఒక వ్యక్తి సమాజంలో ఎలా మార్పుకు కారణమవుతాడో చెప్పాలనే ఉద్దేశ్యంతోనే జాదవ్ గురించి పాఠాలు చెబుతున్నామన్నారు. 

అస్సాంకు చెందిన జాదవ్‌ పాయెంగ్‌ మజులి నది ప్రాంతంలో ఉండే ద్వీపంలోని బీడు భూమిలో 40 సంవత్సారాల నుంచి ఒక్కొక్క మొక్క నాటడం మొదలుపెట్టాడు. అలా ఆయన ఏకంగా 550ఎకరాల అడవినే తయారు చేశారు. 

ఆ అడవిలో ఏనుగులు, పులులు, జింకలు ఇంకా ఎన్నో జంతువులు ఉన్నాయి. ఒక్కడిగా జాదవ్‌ మొదలు పెట్టిన పనివల్ల ఇప్పటి వారితో పాటు, వచ్చే తరాల వారికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. అందుకే జాదవ్‌ గురించి అమెరికా పాఠ్య పుస్తకాలలో కూడా వివరిస్తున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios