యూనిస్ తుఫాను (eunice storm) ఐరోపా ఖండాన్ని (europe) వణికిస్తోంది. అది ఎంతలా అంటే చివరికి మనుషులు కూడా ఎగిరిపోతున్నారు. తుఫాను కారణంగా విమానాలు, రైళ్లు, ఫెర్రీల రాకపోకలకు అంతరాయం కలుగుతుండగా.. లక్షల మంది ప్రయాణికులు తాత్కాలిక షెల్టర్లలో ఆశ్రయం పొందుతున్నారు.

యూనిస్ తుఫాను (eunice storm) ఐరోపా ఖండాన్ని (europe) వణికిస్తోంది. దీని ధాటికి ఇప్పటికే 9 మంది చనిపోగా... తీవ్ర ఆస్తి నష్టం సంభవించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా భీకర గాలులు వీస్తున్నాయి. శుక్రవారం కొన్నిచోట్ల గంటకు 196 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. బ్రిటన్, లండన్‌లో గాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. అది ఎంతలా అంటే చివరికి మనుషులు కూడా ఎగిరిపోతున్నారు. తుఫాను కారణంగా విమానాలు, రైళ్లు, ఫెర్రీల రాకపోకలకు అంతరాయం కలుగుతుండగా.. లక్షల మంది ప్రయాణికులు తాత్కాలిక షెల్టర్లలో ఆశ్రయం పొందుతున్నారు.

అట్లాంటిక్ మహా సముద్రంలో (atlantic ocean) పుట్టిన యూనిస్ తుఫాను కారణంగా.. విద్యుత్ సరఫరా స్తంభించిపోయింది. దీంతో వేల ఇళ్లలో కరెంటు సరఫరా నిలిచిపోయింది. లక్షలాది మంది అంధకారంలో మగ్గుతున్నారు. ఈ యూనిస్ తుఫాన్ అజోర్స్ నుంచి గిరగిరా తిరుగుతూ యూరప్ పైకి దూసుకొచ్చింది. పశ్చిమ ఇంగ్లండ్‌పై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. 

మరోవైపు.. లండన్‌లో ఓ మహిళ ప్రయాణిస్తున్న కారుపై చెట్టు కూలిపోవడంతో ఆమె కారులోనే దుర్మరణం పాలవ్వగా.. లివర్ పూల్‌లో చెత్త మీదపడి వాహనంపై వెళ్తున్న వ్యక్తి చనిపోయాడు. ప్రస్తుతం ఈ భీకర గాలులు... స్కాండినేవియా దేశాలవైపు వెళ్తున్నాయి. అక్కడ ఇప్పటికే వాతావరణ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇంగ్లాండ్‌లోని ది నీడిల్స్ ప్రాంతంలో గంటకు 196 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో ఆ దేశ చరిత్రలో ఇవే అత్యంత వేగంతో వీచిన గాలులని అక్కడి వాతావరణ విభాగం ప్రకటించింది. ఈ తుఫాను వల్ల విమానాలు సైతం రన్‌వేపై ఊగిపోతున్నాయి. దీంతో బ్రిటన్ ఎయిర్ పోర్టుల్లో విమానాలు దిగకుండా ఆంక్షలు విధిస్తున్నారు. ఇప్పటి వరకు అక్కడ 436 విమానాల సర్వీసులను రద్దు చేశారు.