ఆస్ట్రేలియాలో ఉన్మాది వీరంగం సృష్టించాడు. మెల్‌బోర్న్‌లో అత్యంత రద్దీగా ఉండే సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్‌లో గుర్తు తెలియని వ్యక్తి కత్తి తీసుకుని కనిపించిన వారిపై కత్తితో దాడి చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఉన్మాదిని పట్టుకునేందుకు ప్రయత్నించగా వారిపైనా దాడికి పాల్పడ్డాడు.

పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో ఒక కారుకి నిప్పుపెట్టిన దుండగుడు పారిపోతుండగా... పోలీసులు కాల్చి చంపారు. అతని దాడిలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరికి మెడకు, రెండవ వారికి తలపై గాయం కాగా.. మూడో వ్యక్తికి పొట్టపై గాయం అయినట్లుగా సమాచారం.. తాజా ఘటనతో పోలీసులు ఆ ప్రాంతాన్ని మూసివేసి.. తమ ఆధీనంలోకి తీసుకున్నారు.