వరుస బాంబు పేలుళ్లలో 350 మంది మరణించడంతో శ్రీలంక నష్ట నివారణా చర్యలు చేపట్టింది. భద్రతా చర్యల నేపథ్యంలో సుమారు 39 దేశాలకు వీసా జారీని నిలిపివేస్తున్నట్లు ఆ దేశ పర్యటక మంత్రిత్వశాఖ తెలిపింది.

శ్రీలంక ద్వీపం కావడంతో అక్కడి ప్రకృతి అందాలను చూసేందుకు ఏటా ఆ దేశానికి లక్షల్లో పర్యాటకులు వస్తుంటారు. ఈ ఏడాది మొదటి మూడు నెలల్లోనే సుమారు 7,40,600 మంది పర్యాటకులు ఆ దేశాన్ని సందర్శించారు.

గతేడాది సుమారు 4,50,000 మంది భారతీయులు శ్రీలంకలో పర్యటించారు. అయితే ఈస్టర్ పర్వదినం సందర్భంగా ప్రస్తుతం దేశంలో నెలకొన్ని పరిస్ధితుల నేపథ్యంలో 39 దేశాలకు చెందిన పర్యాటకులను అడ్డుకునేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.

ఈ దాడులకు అంతర్జాతీయ స్థాయిలో సంబంధాలున్నాయని విచారణలో వెల్లడైంది. దీంతో మరోసారి ఇక్కడ ఇటువంటి పరిస్థితి తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని ఆ దేశ పర్యాటక శాఖ మంత్రి జాన్ అమరతుంగ వెల్లడించారు.