వందల సంఖ్యలో బైటపడ్డ చిన్నారుల అస్థిపంజరాలు (వీడియో)

వందల సంఖ్యలో బైటపడ్డ చిన్నారుల అస్థిపంజరాలు (వీడియో)

పురాతన కాలం నాటి కౄరత్వాన్ని తెలియజేసే ఓ విషాద సంఘటనను పురావస్తు శాస్త్రవేత్తలు వెలికితీశారు. చరిత్రలోనే అతిపెద్ద చిన్నారుల నరబలికి సంబంధించిన ఆనవాళ్లు పెరూ దేశంలో బైటపడ్డాయి. తవ్విన కొద్దీ చిన్నారుల అస్థిపంజరాలు గుట్టలుగా వెలువడుతుండటంతో శాస్త్రవేత్తలే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనకు చరిత్రలో చిన్నారుల పట్ల జరిగిన హింసాకాండను బైటపెట్టాయి.

పురాతన కాలంలో పెరూకు ఉత్తర ప్రాంతంలో బైట పడిన ఈ ఆనవాళ్లు చిమూ నాగరికతకు చెందినవిగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ కాలంలోనే చిన్నారుల నరబలి ఎక్కువగా ఉండేదని, అప్పుడే పెద్ద మొత్తంలో ఇలా చిన్నారులను బలి ఇచ్చి వుంటారని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

పెరూ లోని పంపాలా క్రూజ్ ప్రాంతంలో ఇప్పటివరకు జరిపిన తవ్వకాల్లో 140 మంది చిన్నారుల అస్థిపంజరాలు బైటపడినట్లు తెలుస్తోంది. అయితే తవ్వకాల్లో ఇంకా అస్థిపంజరాలు బైటపడుతూనే ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు.

ప్రస్తుతానికి ఇప్పుడు బైటపడిన అస్థిపంజరాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు.. వీరందరినీ దాదాపు ఒకేసారి బలి ఇచ్చి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కార్బన్‌ డేటింగ్‌ పద్దతిలో ఇవి సుమారు 600 ఏళ్ల క్రితం చెందినవిగా నిర్ధారించారు.  
 
ఇలా లాటిన్ అమెరికా ప్రాంతంలో పలు చోట్ల పిల్లల అస్థిపంజరాలు లభ్యమయ్యాయని, కానీ ఇంత భారీగా ఎక్కడా కనిపించలేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ తవ్వకాలకు, పరిశోధనలకు సంబంధించిన వివరాలను నేషనల్ జియోగ్రఫిక్ సొసైటీ ఈ పరిశోధనకు నిధులు సమకూరుస్తున్నారు.
 
 

 

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM INTERNATIONAL

Next page