ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ అంత్యక్రియలు ముగిశాయి. అశేష అభిమానులు, పార్టీ కార్యకర్తల అశ్రునయనాల మధ్య పూర్తి అధికారిక లాంఛనాలతో షీలా అంత్యక్రియలు జరిగాయి.
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ అంత్యక్రియలు ముగిశాయి. అశేష అభిమానులు, పార్టీ కార్యకర్తల అశ్రునయనాల మధ్య పూర్తి అధికారిక లాంఛనాలతో షీలా అంత్యక్రియలు జరిగాయి. . అభిమానుల సందర్శనార్ధం ఆదివారం ఉధయం 11.30 గంటలకు ఢిల్లీ అక్బర్ రోడ్డులోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఆమె భౌతికకాయాన్ని ఉంచారు.
ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్రమోడీ, సోనియా గాంధీ, సుష్మా స్వరాజ్, ఎల్‌కే అద్వానీ తదితర ప్రపముఖులు షీలాకు నివాళులర్పించారు. అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు అశేష అభిమానులు, ప్రజల కన్నీటి వీడ్కోలు మధ్య షీలా దీక్షిత్ భౌతిక కాయాన్ని ప్రత్యేక వాహనంలో నిగమ్ బోధ్‌కు తరలించారు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న షీలా దీక్షిత్ శనివారం ఢిల్లీలోని ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఆసుపత్రిలో కన్నుమూసిన సంగతి తెలిసిందే.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jul 21, 2019, 5:38 PM IST