అమెరికా: అదృష్టం అంటే అందరికీ ఉండదంటారు...ఎవరికో ఒకరికి ఆ అదృష్టం వరిస్తుందని చెప్తుంటారు. అది నిజమైంది ఓ మహిళ విషయంలో. అమెరికాలోని మేరీల్యాండ్‌కు చెందిన ఓ మహిళ క్యాబేజ్‌ కొనేందుకు ఓ దుకాణానికి వెళ్లింది. క్యాబేజీ కొనేందుకు వెళ్లిన ఆమె భారీ లాటరీ గెలుచుకుంది. 

ఏకంగా 2.25 లక్షల డాలర్ల విలువైన సొమ్మును ఆ మహిళ గెలుచుకుని లక్ అంటే తనదేనని నిరూపించింది. గ్రోవ్‌టన్‌ పట్టణానికి చెందిన వెనెస్సా వార్డ్‌ అనే మహిళకు ఆమె తండ్రి ఫోన్‌ చేసి క్యాబేజ్‌ తీసుకొని రమ్మని చెప్పాడు. దీంతో వెనెస్సా వార్డ్  స్థానిక జైంట్‌ ఫుడ్‌ స్టోర్‌ అనే దుకాణానికి వెళ్లింది. అక్కడ ఆమె అనుకోకుండా ఓ లాటరీ టికెట్‌  కొనుగోలు చేసింది. 

ఇంటికెళ్లాక ఆ టికెట్‌ను స్క్రాచ్ చేయ్యగా అందులో 2.25 లక్షల డాలర్లు గెలిచినట్లుగా ఉంది. దీంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. తాను గెల్చుకున్న సొమ్మును భవిష్యత్తులో పదవీ విరమణ పొందాక ఉపయోగించుకుంటానని, డిస్నీ వరల్డ్‌ చూసేందుకు వెళ్తానని లక్కీ పర్సన్ అయిన వెనెస్పా స్పష్టం చేసింది.