Asianet News TeluguAsianet News Telugu

మెహుల్ చోక్సీ : నమ్మిన అమ్మాయే ట్రాప్ చేసింది...కిడ్నాప్ కు సహకరించి...

నమ్మిన అమ్మాయే తనను ట్రాప్ చేసి ఎత్తుకెళ్లటానికి సాయం చేసిందని.. కోట్ల రూపాయలు కొల్లగొట్టి, దొరక్కుండా వెళ్లిన భారత నగల వ్యాపారి మెహుల్ చెక్సీ ఆరోపించారు. ఆంటిగ్వా నుంచి తనను స్థానిక పోలీసులు, కొంతమంది కిరాయి దుండగులు కిడ్నాప్ చేసి డొమినికాకు తీసుకొచ్చారన్నారు. 

she did not help when.. mehul choksi names mystery woman barbara jabarica in complaint - bsb
Author
hyderabad, First Published Jun 8, 2021, 10:38 AM IST

నమ్మిన అమ్మాయే తనను ట్రాప్ చేసి ఎత్తుకెళ్లటానికి సాయం చేసిందని.. కోట్ల రూపాయలు కొల్లగొట్టి, దొరక్కుండా వెళ్లిన భారత నగల వ్యాపారి మెహుల్ చెక్సీ ఆరోపించారు. ఆంటిగ్వా నుంచి తనను స్థానిక పోలీసులు, కొంతమంది కిరాయి దుండగులు కిడ్నాప్ చేసి డొమినికాకు తీసుకొచ్చారన్నారు. 

ఈ మేరకు ఆంటిగ్వా రాయల్ పోలీసులకు చోక్సీ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నట్లు ఆంటిగ్వా ప్రధాని గాస్టన్ బ్రౌన్ తెలిపారు. ‘బార్బరా జబరికా అనే అమ్మాయి నన్ను వలలో ఇరికించి కిడ్నాప్ కు సాయం చేసింది. ఆంటిగ్వాలో కిడ్నాప్ చేసి.. డొమినికాలో ఓ ఉన్నతస్థాయి భారత రాజకీయవేత్తకు ఇంటర్వ్యూ ఇప్పించేందుకు తీసుకొచ్చారు.

తర్వాత వారి ప్రణాళిక మారినట్లుంది. నన్ను డొమినికా కోస్టు గార్డులకు అప్పగించారు. ఇంటర్ పోల్ నోటీసున్న కారణంగా నన్ను అరెస్ట్ చేస్తున్నట్టు ఆ పోలీసులు చెప్పారు.  బార్బరా జబరికా అనే అమ్మాయి నాకు ఏడాది కాలంగా తెలుసు. మా ఇంటిదగ్గరే ఉండేది. గత నెల 23న సాయంత్రం ఇంటికొచ్చి తనను తీసుకెళ్లమని చెబితే వెళ్లా. సాయంత్రం ఐదింటికి వెళ్లా.. ఆ సమయంలో 10మంది ఆంటిగ్వా పోలీసులుగా చెప్పుకుంటున్న బలమైన వ్యక్తులు నాపై దాడి చేసి కొట్టారు. వారికి కొంతమంది కిరాయి ఆగంతకులు, బహుళ భారతీయులు కావొచ్చు.. కలిశారు. 

ఇదంతా జరుగుతుంటూ బార్బరా వారిని అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు. నాకేమాత్రం సాయం చేయలేదు. అంటే ఆమె కూడా వారితో కలిసే నన్ను కిడ్నాప్ చేసినట్లున్నారు. పడవల్లో నన్ను ఆంటిగ్వా నుంచి డొమినికాకు చేర్చారు. నరీందర్ సింగ్ అనే భారతీయ కిరాయి వ్యక్తి నాపై చేయి చేసుకున్నాడు. కేసులో సహకరించకుంటే తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించాడు..’ అని చోక్సీ ఆరోపించారు. 

భారతీయ బ్యాంకులకు సుమారు 13 వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన కేసులో నిందితుడైన చోక్ీ పరారై.. 2018నుంచి ఆంటిగ్వాలో ఉంటున్నారు. ఇటీవలే ఆయనను పక్కదేశం డొమినికాలో పట్టుకున్నారు. అక్కడి నుంచి భారత్ కు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరగుతున్నాయి. తనను ఆంటిగ్వా నుంచి కిడ్నాప్ చేశారనేది చోక్సీ ఆరోపణ, డొమినికా కోర్టులో బెయిల్ కు కూడా చెక్సీ దరఖాస్తు చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios