Asianet News TeluguAsianet News Telugu

ప్రేయసికి ఇంగ్లీష్ రాదని.. ప్రియుడి సాహసం.. చివరకు..

ఆమెను పాస్  చేయడానికి ఖాదీం రంగంలోకి దిగాడు. గంగూకి బదులు పరీక్ష తాను రాయాలనే నిర్ణయం తీసుకున్నాడు.  ఇందుకోసం గంగూలా తయారయ్యాడు.
 

Senegal Man Disguises As Girlfriend To Take Exams on Her Behalf
Author
Hyderabad, First Published Aug 10, 2021, 7:34 AM IST

ప్రేమలో ఉన్నవారికి వేరే ప్రపంచం తెలీదు. ఇంకేమీ కనపడదు. ఏది ఏమైనా తమ  ప్రేమను దక్కించుుకోవాలనే అనుకుంటారు. తాము ప్రేమించినవారు ఆనందంగా ఉండాలని ఆరాటపడతారు. ఆ యువకుడు కూడా అలానే అనుకున్నాడు. తన ప్రేయసి ముఖంపై చిరు నవ్వు చూడాలని ఆశపడ్డాడు,అందుకోసం పెద్ద సాహసమే చేశాడు.  ప్రేయసికి బదులు పరీక్ష రాయడానికి మారువేషంలో వచ్చాడు. చివరకు అధికారులకు చిక్కాడు, ఈ సంఘటన సెనెగల్ లోని డైయోర్బెల్ అనే పట్టణంలో చోటుచేసుకోగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఖాదీం(22) అనే యువకుడు గంగూ(19) అనే యువతిని ప్రేమిస్తున్నాడు. వీరిద్దరూ హైస్కూల్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నారు, అయితే.. వారిలో గంగూకీ ఇంగ్లీష్ అంటే పెద్దగా రాదు, దీంతో.. ఫెయిల్ అవుతానేమోనని భయపడింది. ఆమెను పాస్  చేయడానికి ఖాదీం రంగంలోకి దిగాడు. గంగూకి బదులు పరీక్ష తాను రాయాలనే నిర్ణయం తీసుకున్నాడు.  ఇందుకోసం గంగూలా తయారయ్యాడు.

పొడవైన జట్టు విగ్, చెవి రింగులు, మేకప్ డ్రెస్ తో ముఖం కనపడకుండా ఉండేందుకు తలపై సంప్రదాయ ముసుగు కూడా వేసుకున్నాడు. మూడు రోజులు ఎవరికీ అనుమానం రాకుండా పరీక్షలు బాగానే రాశారు. నాలుగో రోజు వచ్చిన ఇన్విజిలేటర్ కి గంగూ అనుమానంగా కనిపించాడు. దీంతో,. వెంటనే పై అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఇంకేముంది.. వారు వచ్చి చెక్ చేయగా.. అక్కడ ఉన్నది గంగూ కాదని.. ఖాదీం అని తెలిసిపోయింది. 

ఇలా ఎందుకు చేశావు అంటే.. తన గర్ల్  ఫ్రెండ్ కి  ఇంగ్లీష్ రాదని.. అందుకే.. తాను పరీక్ష రాశానని చెప్పడం గమనార్హం. ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారికి రెండేళ్ల పాటు ఎలాంటి పరీక్షలు రాయకుండా నిషేధం విధించారు. అంతేకాకుండా.. ఐదేళ్ల పాటు జైలు శిక్ష జరిమానా కూడా విధించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios