Asianet News TeluguAsianet News Telugu

ఛీ..ఛీ.. వీడు తండ్రేనా.. యేడాదిగా కూతురిపై అఘాయిత్యం.. జైలుకెళ్లొచ్చినా వదలనంటూ బెదిరింపు...

కామంతో కళ్లుమూసుకు పోయిన కన్నతండ్రి కన్న కూతురునే చెరబట్టాడు.  ఏడాది నుంచి బిడ్డపై తన పశువాంఛ తీర్చుకుంటున్నాడు.  విషయం తల్లికి తెలిసింది.  కానీ భర్త కు వ్యతిరేకంగా పోరాటం చేయలేని పరిస్థితుల్లో ఆమె ఉంది.  దీంతో తన బిడ్డను కాపాడమంటూ Suicide attempt చేసింది. 

Seeking justice, Pak woman attempts suicide at court in Lahore after husband 'rapes' daughter
Author
Hyderabad, First Published Oct 28, 2021, 8:37 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ఇస్లామాబాద్ : సమాజంలో ఆడవారిపై ఆకృత్యాలు పెరిగిపోతున్నాయి. కామంతో కళ్లు మూసుకుపోయి... వావివరుసలు మరచి ప్రవర్తిస్తున్నారు. పాము తన పిల్లల్ని తానే చంపి తిన్న చందంగా.. కన్న బిడ్డలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రులే వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. రోజురోజుకు ఇలాంటి ఘటనలు పెరిగిపోతున్నాయి.

ఎవరికి చెప్పుకోవాలో.. ఏం చేయాలో తెలియక.. పసిమొగ్గలు వారి కర్కశత్వానికి నలిగిపోతున్నాయి. చాలా కేసుల్లో భార్యలకు విషయం తెలిసిన  ప్రతిఘటించ లేని పరిస్థితులే ఎక్కువగా ఉంటున్నాయి. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.

కామంతో కళ్లుమూసుకు పోయిన కన్నతండ్రి కన్న కూతురునే చెరబట్టాడు.  ఏడాది నుంచి బిడ్డపై తన పశువాంఛ తీర్చుకుంటున్నాడు.  విషయం తల్లికి తెలిసింది.  కానీ భర్త కు వ్యతిరేకంగా పోరాటం చేయలేని పరిస్థితుల్లో ఆమె ఉంది.  దీంతో తన బిడ్డను కాపాడమంటూ Suicide attempt చేసింది.  ఈ సంఘటన పాకిస్తాన్‌లో చోటు చేసుకుంది.  ఆ వివరాలు…

లాహోర్ కు చెందిన ఓ మహిళకు ఐదుగురు సంతానం. ఈ క్రమంలో కొన్ని  సంవత్సరాల క్రితం భార్యాభర్తలిద్దరూ విడిపోయారు. ముగ్గురు ఆడపిల్లలు భర్త దగ్గర ఉంటుండగా... ఇద్దరూ భార్యతో ఉంటున్నారు.  

కొద్ది రోజులు బాగానే గడిచినా.. ఆ తరువాత ఆ కసాయి కన్నతండ్రి కన్ను మైనర్ కూతురిపై పడింది. దీనికితోడు భార్య తన నుంచి విడిపోయిందన్న కక్ష తోడైంది. అంతే..Lustతో కళ్లు మూసుకుపోయిన తండ్రి ఏడాది నుంచి తన 15 ఏళ్ళ కుమార్తెపై sexual assaultకి ఒడిగడుతున్నాడు.

పజిల్స్ ఇష్టమని.. కొడుక్కి ABCDEFGHIJK అని పేరు పెట్టాడు..!

అంతేకాకుండా.. ఆ చిన్నారిని తీవ్ర బెదిరింపులకు లోను చేశాడు. ఈ సంఘటన గురించి ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో భయాందోళనలకు గురైన minor girl మౌనంగా దారుణాన్ని భరిస్తూ వస్తుంది. 

ఇలాంటివి ఎన్ని రోజులు దాగుతాయి. చెడు ఏదో ఓ రోజు బయట పడక తప్పదు కదా. అలా.. ఎలాగే.. భర్త చేస్తున్న దారుణం గురించి విడిపోయిన భార్యకు తెలిసింది. ఆమె మొదట షాక్ అయ్యింది. భర్త నీఛపు బుద్దికి, కామవాంఛకు ఆమెకు నోట మాట రాలేదు. 

అయినా, కన్న కూతురు వేదన ఆమెలోని తల్లిని మేల్కొలిపింది. భర్తను  ‘ఏంటి పని..’ అని నిలదీసింది. కానీ నీచబుద్ధితో దుర్మార్గానికి ఒడిగడుతున్న ఆ భర్త చాలా దారుణాతి దారుణంగా సమాధానం ఇచ్చాడు. ‘ నా ఇష్టం.. పోలీసులకు చెప్పుకుంటావా..  చెప్పు.  జైలు నుంచి వచ్చాక  మళ్లీ  నీ బిడ్డలు అందరిపై 
Rape చేస్తాను’  అని బెదిరించాడు.

దీంతో ఆతల్లికి ఏం చేయాలో పాలు పోలేదు. అంతగా బరి తెగించిన భర్తనుంచి పిల్లల్ని ఎలా కాపాడుకోవాలో ఆ తల్లికి అర్థం కాలేదు.  నీచుడైన ఆ భర్తకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి ఆమె ఆర్థిక పరిస్థితి అనుకూలించదు.  ఏం చేయాలో పాలుపోని Woman సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది.  

ఈ క్రమంలో సదరు మహిళ Court of Sessionsలో Suicide attempt చేసింది. సజీవదహనం చేసుకోవాలని భావించింది.  కానీ చుట్టూ ఉన్నవారు ఆమె ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. సెషన్స్ కోర్టు జడ్జి మహిళా భద్రత పై తగిన చర్యలు తీసుకోవాలని.. బాధిత బాలికకు రక్షణ కల్పించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios