Asianet News TeluguAsianet News Telugu

పజిల్స్ ఇష్టమని.. కొడుక్కి ABCDEFGHIJK అని పేరు పెట్టాడు..!

తల్లిదండ్రులు తమకు ఇష్టమైన వ్యక్తుల పేర్లు, అభిమాన తారల పేర్లు లేదా సాంప్రదాయాన్ని పాటించి జన్మనక్షత్రం ఆధారంగా పేర్లు పెడుతుంటారు. కానీ, కొందరు ఇలాంటి ఆచర వ్యవహారాలన్నింటినీ పక్కనపెట్టి వినూత్న పేర్లు కాదు.. కాదు.. వింత పేర్లు పెట్టి వార్తల్లోకెక్కుతుంటారు. తాజాగా, ఇండోనేషియాకు చెందిన ఓ వ్యక్తి తన కొడుక్కి ఏబీసీడీఈఎఫ్‌జీహెచ్ఐజేకే అనే పేరుపెట్టాడు.
 

indonesian names son as ABCDEFGHIJKzuzu
Author
New Delhi, First Published Oct 27, 2021, 2:43 PM IST

న్యూఢిల్లీ: సాధారణంగా పిల్లలకు దేవుడి పేర్లు, లేదా జన్మనక్షత్రం ఆధారంగా పేర్లు పెడుతుంటారు. లేదా తమ పూర్వీకులపై ప్రేమ, గౌరవంతో వారి పేర్లను పెడుతుంటారు. అదీలేదనుకుంటే తమ అభిమాన తారలు, వ్యక్తుల పేర్లతో పిలుచుకుంటారు. కానీ, కొందరు తల్లిదండ్రులూ అసాధారణ శైలిని అనుసరిస్తారు. కానీ Indonesiaకు చెందిన ఓ వ్యక్తి తన కొడుకుకు English Alphabetలోని అక్షరాలను పేరుగా పెట్టాడు. ABCDEFGHIJK zuzu అనే పేరు పెట్టాడు. 

దక్షిణ సుమత్రాలోని మురా ఎనిన్‌లో టీకా వేసుకోవడానికి ఆ బాలుడు వెళ్లడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తన పేరేమిటని అధికారులు అడగ్గా, ఆ పిల్లాడు ఇంగ్లీష్ అల్భాబేట్ గడగడ చదవడం ప్రారంభించాడు. దీంతో అధికారులు ఇదంతా జోక్ అని తేలికగా తీసుకుని మరోసారి పేరేమిటని అడిగారు. ఆ బాలుడు మళ్లీ అదే తీరు పాటించాడు. ఇలా కాదని, ఆ అధికారులు బాలుడి తండ్రిని ఆరాతీశారు. అప్పుడు ఆ బాలుడి పేరే ఏబీసీడీఈఎఫ్‌జీహెచ్ఐజేకే జుజు అని నిర్ధారణకు వచ్చారు. ఆ బాలుడు తన మిత్రుల దగ్గర ఇవన్నీ అక్షరాలు చదవడానికి బదులుగా ఓ షార్ట్ ఫామ్‌ను ఎంచుకున్నాడు. సింపుల్‌గా అడెఫ్‌గా పిలిపించుకుంటున్నాడు.

ఈ వింత పేరుకూ ఆ తండ్రి దగ్గర ఓ వివరణ ఉన్నది. తనకు క్రాస్ పజిల్స్ చేయడమంటే ఇష్టమని, అందుకే ఇంగ్లీష్ వర్ణమాలలోని అక్షరాలపై ప్రేమ కారణంగానే తన కొడుకుకి ఈ పేరు పెట్టినట్టు వివరించారు. కాగా, చివర అంటించిన జుజుకూ ఓ ప్రత్యేకత ఉన్నది. ఆ దంపతుల పేర్లు జుహ్రో, జుల్ఫాహ్మి. ఈ ఇద్దరి పేర్లలోని ‘జు’లను తీసుకుని చివరన జుజు అని తగిలించాడు. ఆ వ్యక్తి మరో ఇద్దరు పిల్లలున్నారని, ఇంగ్లీష్ అల్ఫాబెట్‌లోని మిగతా అక్షరాలతో పేరు పెట్టాలని నిర్ణయించుకుని వెనక్కి తగ్గినట్టు వివరించాడు. మిగతా ఇద్దరి పిల్లలకు ఎన్‌వోపీక్యూఆర్‌ఎస్‌టీయూవీ, ఎక్స్‌వైజెడ్‌ల పేరు పెట్టాలని భావించినట్టు చెప్పాడు.

Also Read: పోర్న్ సైట్‌లో మ్యాథ్స్ క్లాస్‌లు.. ఏడాదికి రూ. 2 కోట్లు సంపాదిస్తున్న టీచర్

పిలిప్పీన్స్‌కు చెందిన ఓ తండ్రి తన కుమారుడికి ఇదే తరహాలో పేరుపెట్టాడు. జీహెచ్ఎల్‌వైఎన్ఎన్‌వైఎల్ హెచ్‌వైఎల్‌హెచ్‌వైఆర్ వైజెడ్‌జెడ్‌వైజీహెచ్‌వైఎల్ అని పెట్టాడు. ఆ పిల్లాడిని సింపుల్‌గా కాన్సొనెంట్(హల్లులు) అనే నిక్ నేమ్‌తో పిలుచుకుంటున్నారు.

ఇలాంటి వింత పేర్లు విదేశాలకే పరిమితం కాదు.. మనదేశంలోనూ ఇలాంటివాటికి కొదవ లేదు. కరోనా మహమ్మారి విజృంభించిన తొలినాళ్లలో ఇద్దరు దంపతుల తమ పాపకు కరోనా అని పేరుపెట్టారు. అంతెందుకు తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లోనూ చిత్తూరుకు చెందిన ఓ రైతు చరిత్రపై తనకున్న ఆసక్తితో పిల్లలకు చైనా రెడ్డి, రష్యా రెడ్డి, జపాన్ రెడ్డి వంటి వింత పేర్లు పెట్టి వార్తల్లోకెక్కారు.

Follow Us:
Download App:
  • android
  • ios