Asianet News TeluguAsianet News Telugu

అక్కడ మరోసారి లాక్ డౌన్.. విజృంభిస్తున్న కరోనా..

ప్రపంచవ్యాప్తంగా కరోనా మళ్లీ విజృంభిస్తోంది. పలు చోట్ల మళ్లీ లాక్ డౌన్ విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్రెజిల్ లోని రియో డీ జెనీరోలో కూడా కరోనా మళ్లీ పడగ విప్పుతోంది. ఆసుపత్రులు కరోనా బాధితులతో నిండిపోతున్నాయి. దీంతో రాజధానిలో రెండు వారాలపాటు లాక్ డౌన్ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆదివారం నుంచి లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చింది. 

second time covid 19 lock down in brazil capital rie de janeiro - bsb
Author
Hyderabad, First Published Mar 1, 2021, 11:31 AM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా మళ్లీ విజృంభిస్తోంది. పలు చోట్ల మళ్లీ లాక్ డౌన్ విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్రెజిల్ లోని రియో డీ జెనీరోలో కూడా కరోనా మళ్లీ పడగ విప్పుతోంది. ఆసుపత్రులు కరోనా బాధితులతో నిండిపోతున్నాయి. దీంతో రాజధానిలో రెండు వారాలపాటు లాక్ డౌన్ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆదివారం నుంచి లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చింది. 

బ్రెజిల్ లోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. నియంత్రణ చర్యలను ముమ్మరం చేసింది. నగరాలు, ముఖ్య పట్టణాల్లో గతవారం రోజులుగా కర్ఫ్యూ కొనసాగిస్తున్నారు. దేశంలో ఇప్పటివరకు కరోనా కారణంగా 2,54,000 మంది మరణించారు. 

గత గురువారం ఒక్కరోజే 1,541 మంది ప్రాణాలు కోల్పోయారు. బ్రెజిల్ లో మార్చి 15 వరకు హోటళ్లు, బార్లు, షాపింగ్ మాల్స్, షాపింగ్‌ మాల్స్, స్కూళ్లు మూసివేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios