ముద్దు మోజులో పడి మూగవాడయ్యాడో వ్యక్తి. ఈ వింత సంఘట బ్రిటన్ లో చోటుచేసుకుంది. ఓ మహిళ తనతో వాగ్వాదానికి దిగిన వ్యక్తి నాలుకను కొరికింది. దీంతో ఆ భాగం తెగిపడటంతో ఆ ముక్కను పక్షి ఎత్తుకుపోయిన వింత సంఘటన స్కాంట్లాండ్‌లో చోటుచేసుకుంది. 

2019లో జరిగిన ఈ సంఘటనలో మహిళకు ఇటీవల కోర్టు జరిమానా విధించింది. ఈ వింత ఘటన వివరాల్లోకి వెడితే.. ఎడిన్‌బర్గ్‌కు చెందిన బెథానీ ర్యాన్‌‌ అనే మహిళకు, జేమ్స్‌ మెకెంజీ అనే వ్యకికి మధ్య చిన్న వాగ్వాదం వచ్చింది. దీంతో వారిద్దరు రోడ్డుపైనే గొడవకు దిగారు. 

ఈ నేపథ్యంలో మెకెంజీ పిడికిలి బిగించి ర్యాన్ మీద దాడి చేయడానికి వెళ్లడంతో ఆమె ఊహించని రీతిలో అతడికి ముద్దు పెట్టింది. దీంతో కూల్ అయిన మెకెంజీ ముద్దులో మునిగితేలాడు. ఈ క్రమంలో ర్యాన్ అదునుచూసి మెకెంజీ నాలుక చివరి భాగాన్ని ఠక్కున కొరికింది. 

దీంతో రెండు ఇంచుల మేర అతడి నాలుక తెగి కింద పడిపోయింది. అయితే అది గమనించుకోకుండా వారిద్దరూ గొడవ పడుతూనే ఉన్నారు. అయితే కింద పడ్డ నాలుకను అక్కడే ఉన్న చెట్టు మీద ఉన్న సిగుల్ పక్షి చూసింది. 

వెంటనే అది చటుక్కున నాలుక భాగాన్ని దాని ముక్కుతో కరుచుకుని ఎగిరిపోయింది. అది గమనించిన స్థానికులు మేకంజీని ఆస్పత్రికి తరలించడంతో పరీక్షించిన వైద్యులు అతడికి సర్జరీ చేయాలని సూచించారు. దీనికోసం తెగిన నాలుక భాగం కావాలన్నారు. 

అయితే జరిగిన విషయాన్ని డాక్టర్లకు చెప్పడంతో ఆ నాలుక ముక్క లేకపోతే ఆపరేషన్‌ చేయడం కుదరదని స్పష్టం చేశారు. దీంతో మెకెంజీ మూగవాడయ్యాడు. దీంతో ర్యాన్‌పై అతడు స్థానిక పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. 

గతవారం ఈ కేసు విచారణ చేపట్టిన ఎడిన్ బర్గ్ ఫరీఫ్ కోర్టు ర్యాస్ ను దోషిగా నిర్థారించి ఆమెకు జరిమానా విధించింది.