Mars in just 45 days: నెదర్లాండ్స్‌లోని డెల్ఫ్ట్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ (TU డెల్ఫ్ట్) శాస్త్రవేత్తలు భూమి నుంచి అంగారక గ్రహాన్ని చేరుకోవడానికి పట్టే సమయాన్ని తగ్గించడానికి లేజర్-థర్మల్ ప్రొపల్షన్ సిస్టమ్‌ను ఉపయోగించాలని భావిస్తున్నారు. ఈ విధానం ద్వారా.. దాదాపు 500 రోజులు ప‌ట్టే ప్ర‌యాణాన్ని కేవ‌లం 45 రోజులకు తగ్గించగలమ‌ని చెప్పారు. 

Mars in just 45 days: అంగారకుడిపైనా నీటి జాడలు ఉన్నాయని తేలడంతో అక్కడ మాన‌వుడు జీవించ‌డానికి అనువుగా ఉంటుంద‌ని, అక్క‌డ అనుకూల వాతావ‌ర‌ణం ఉంటుంద‌ని ఖగోళ శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు. అయితే.. మానవులు అంగార‌క గ్ర‌హానికి చేరుకోవడానికి దాదాపు 500 రోజులు పడుతుందని నాసా అంచనా వేసింది. ఈ ప్ర‌యాణ‌కాలాన్ని గ‌ణ‌నీయంగా త‌గ్గించ‌వ‌చ్చ‌ని నెదర్లాండ్స్‌లోని డెల్ఫ్ట్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ (TU డెల్ఫ్ట్) శాస్త్రవేత్తలు చెప్పుతున్నారు. కేవలంలో 45 రోజుల్లోనే అంగార‌క గ్ర‌హం మీద కాలు పెట్ట‌వ‌చ్చ‌ని భావిస్తున్నారు. 

లేజర్-థర్మల్ ప్రొపల్షన్స సిస్ట‌మ్(Laser Propulsion System) ద్వారా.. రాకెట్ల‌లో ఉప‌యోగించే హైడ్రోజన్ ఇంధనాన్ని అత్యధికంగా వేడి చేయ‌వ‌చ్చ‌ని, తద్వారా.. స్పేస్‌క్రాఫ్ట్‌ వేగాన్ని పెంచ‌వ‌చ్చ‌ని కెనడాలోని మెక్‌గిల్ యూనివర్సిటీ ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు. ఈ వివాదం ద్వారా.. స్పేస్‌క్రాఫ్ట్ భూమికి సమీపంలో ఉన్నప్పుడు చాలా త్వరగా వేగం అందుకుంటుంద‌నీ, కేవలం ఆరు వారాల్లో అంగారక గ్రహాన్ని చేరుకోవ‌చ్చ‌నీ, లేజర్-థర్మల్ ప్రొపల్షన్స సిస్ట‌మ్ అనే అణు విచ్ఛిత్తి శక్తితో నడిచే స్పేస్‌క్రాఫ్ట్ ల్లో మాత్రమే సాధ్యమని భావించారు.

 భూమి, అంగార‌క గ్రహాలు రెండు గ్రహాలు ఒకదానికొకటి తమ కక్ష్యలో అత్యంత సమీపంలో ఉన్నప్పుడు.. (ప్రతి 26 నెలలకు) మిషన్‌ను ప్రారంభించాల‌ని భావిస్తున్నారు. ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, భూమి నుండి అంగారక గ్రహానికి రవాణా చేయడానికి ఆరు నుండి తొమ్మిది నెలల సమయం పడుతుంది.


TU డెల్ఫ్ట్ ప్రధాన పరిశోధకుడు ఇమ్మాన్యుయేల్ డుప్లే మీడియాతో మాట్లాడుతూ.. ఇది NASA-నిధులతో చేస్తున్న‌ స్టార్‌లైట్ ప్రోగ్రామ్ . దీనిని డైరెక్ట్డ్ ఎనర్జీ ప్రొపల్షన్ ఫర్ ఇంటర్‌స్టెల్లార్ ఎక్స్‌ప్లోరేషన్ (DEEP-IN) అని కూడా పిలుస్తారు. DEEP-IN ప్రోగ్రామ్ ద్వారా వ్యోమనౌకను అంతరిక్షంలో వేగంగా ప్ర‌యాణించ‌డానికి లేజర్ సాంకేతికత ఉపయోగప‌డుతుంద‌ని భావిస్తున్నాం. సౌర వ్యవస్థలో వేగవంతమైన రవాణా కోసం అదే లేజర్ సాంకేతికతను ఎలా ఉపయోగప‌డుతుంద‌నే దానిపై ప్ర‌యోగాలు సాగిస్తున్నాం..అని డుప్లే తెలిపారు. డైరెక్టెడ్-ఎనర్జీ ప్రొపల్షన్ అనేది కొత్త ఆలోచన కాదనీ, ఇటీవలే బ్రేక్‌త్రూ స్టార్‌షాట్‌తో కూడా ఉప‌యోగించిన‌ట్టు తెలిపారు. కేవలం 45 రోజుల్లో 200lb ఉపగ్రహాన్ని అంగారక గ్రహానికి పంపగలవని అంచనా వేశారు. మరింత భారీ అంతరిక్ష నౌకకు నెల నుండి ఆరు వారాల సమయం అవసరమ‌ని అన్నారు. ఇందుకు గిగావాట్-పవర్ లేజర్ శ్రేణి అవసరమ‌నీ, ఇది అంత‌రిక్ష నౌక వేగాన్ని మ‌రింత వేగవంతం చేయడానికి ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని తెలిపారు.

DEEP-IN ప్రోగ్రామ్ ద్వారా స్పేస్ షిప్.. భూమికి దగ్గరగా ఉన్నప్పుడు త్వరగా వేగవంతం చేయడానికి ఉప‌యోగ‌ప‌డుతోంది. లేజర్‌ను అంతరిక్షంలోకి కేంద్రీకరించాల్సిన అవసరం లేదు. ఇది అంగారక గ్రహానికి చేరుకున్నప్పుడు.. అక్క‌డ వాతావరణ ప‌రిస్థితుల‌కు అనుగుణంగా.. సిబ్బంది క్యాబిన్ విడిపోవడానికి, దిగడానికి వీలు కల్పిస్తుంది.ప్రధాన రోవర్‌ను అంగారక గ్రహానికి పంపిన త‌ర్వాత.. బూస్టర్‌ను భూమికి తిరిగి పంప‌డానికి.. అదే లేజర్-శక్తితో కూడిన రాకెట్ ఇంజిన్‌ను ఉపయోగించవచ్చని తాము భావిస్తున్నామనీ, త‌ద్వారా.. రీసైకిల్ చేసి ..తదుపరి ప్రయోగానికి ఉప‌యోగించుకునే వీలు ఉంటుంది.

ఈ విధానం.. ఒక పెద్ద ఆవిరి బాయిలర్ మాదిరిగానే ప్రొపెల్లెంట్‌ను నేరుగా వేడి చేయడానికి అంతరిక్ష నౌకపై మరింత తీవ్రమైన లేజర్ ప్రవాహాన్ని ఉపయోగిస్తుందని అని డోబెల్లి చెప్పారు. ఈ విధానంలో.. US స్పేస్ ఏజెన్సీ NASA, చైనా రెండూ 2030 లలో మార్స్ మీదికి మానవులను పంపాలని ప్లాన్ చేస్తున్నాయి.