కౌగిలించుకున్నందుకు.. రెండేళ్ల జైలు శిక్ష

First Published 17, Jul 2018, 10:36 AM IST
Saudi woman held for ‘hugging’ singer
Highlights

సదరు యువతిపై వేధింపుల కేసు నమోదు చేశారు. బలవంతంగా సింగర్‌ను కౌగిలించుకున్నందుకు గాను ఆమెకు రెండేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. 

సౌదీలో శిక్షలు కఠినంగా ఉంటాయని తెలుసు కానీ.. మరీ ఇంత కఠినంగా ఉంటాయని తెలీదు. కేవలం ఓ సింగర్ ని కౌగిలించుకున్నందుకు ఓ యువతికి రెండేళ్ల జైలు శిక్ష విధించారు. 

అసలేంజరిగిందంటే..సౌదీ అరేబియాలో ఆదివారం ఇరాకీ సింగర్‌ మజిద్‌ అల్‌ ముహాన్‌దిస్‌ ప్రత్యేక కార్యక్రమం జరిగింది. గల్ఫ్‌ దేశాల్లో మజిద్‌కు విపరీతమైన క్రేజ్‌ ఉంది. రియాద్‌లో జరిగిన కార్యక్రమంలో మజిద్‌ పాట పాడుతుండగా.. బురఖా ధరించిన ఓ యువతి వేదికపైకి వెళ్లి అతడిని కౌగిలించుకుంది. వెంటనే గమనించిన సిబ్బంది అక్కడి నుంచి తీసుకెళ్లిపోయి.. పోలీసులకు అప్పగించారు.

సదరు యువతిపై వేధింపుల కేసు నమోదు చేశారు. బలవంతంగా సింగర్‌ను కౌగిలించుకున్నందుకు గాను ఆమెకు రెండేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. దీంతో పాటు రూ.18లక్షల జరిమానా కూడా విధించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

loader