సౌదీ అరేబియాలో 30 ఏళ్లుగా నడుస్తున్న ఓ రెస్టారెంట్‌ను అధికారులు మూసేశారు. ఆ షాప్‌లో సమోసాలు, ఇతర స్నాక్స్‌ను 30 ఏళ్లుగా ఓ వాష్‌రూమ్‌లో తయారు చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. వీటితోపాటు అనేక నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్టు గుర్తించి షాప్ క్లోజ్ చేశారు.

న్యూఢిల్లీ: సౌదీ అరేబియా సమోసాలు అమ్మే ఓ రెస్టారెంట్‌పై కఠిన చర్యలు తీసుకుంది. ఆ రెస్టారెంట్‌పై అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వారు గత 30 ఏళ్లుగా సమోసాలు, ఇతర స్నాక్స్ వాష్‌రూమ్‌లో తయారు చేసినట్టు తెలిసింది. మరెన్నో నిబంధనలు ఉల్లంఘించినట్టు వెల్లడైంది. ఆ వెంటనే అధికారులు రెస్టారెంట్‌ను మూసివేయాలని ఆదేశాలు ఇచ్చారు. సౌదీ అరేబియా నగరం జెడ్డాలో ఈ రెస్టారెంట్ ఉన్నది.

సుమారు 30 ఏళ్లుగా జెడ్డాలో సమోసా రెస్టారెంట్ నడుస్తున్నది. చాలా మంది అక్కడ తిని వెళ్లుతుంటారు. అయితే, ఆ రెస్టారెంట్‌లో సమోసాలు, ఇతర స్నాక్స్ వాష్ రూమ్‌లోనే తయారు చేస్తున్నట్టు స్థానికులు కొందరు మున్సిపాలిటీ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీనిపై అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. ఆ రెస్టారెంట్‌పై అనూహ్య తనిఖీలు చేశారు.

ఆ రెస్టారెంట్‌లో సమోసాలు, స్నాక్స్, ఇతర మీల్స్ అన్నీ వాష్‌రూమ్‌లోనే తయారు చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. అంతేకాదు, ఆ రెస్టటారెంట్‌లో కాలం చెల్లిన వస్తువులూ లభించాయని తెలిసింది. మాంసం, చీజ్ వంటి ఉత్పత్తులు ఎక్స్‌పైర్ అయిపోయాయని అధికారులు గుర్తించారు. అవన్నీ కనీసం రెండేళ్ల క్రితం నాటివని పేర్కొన్నారు. అంతేకాదు, అక్కడే కొన్ని పురుగులు, ఎలుకలనూ గుర్తించారు. ఆ రెస్టారెంట్‌లో పని చేస్తున్న వర్కర్లకు హెల్త్ కార్డులు లేవని అధికారులు వివరించారు. రెసిడెన్సీ చట్టాన్నీ వారు స్పష్టంగా
ఉల్లంఘించారని తెలిపారు. అందుకే ఆ రెస్టారెంట్‌ను అధికారులు మూసేశారు.

ఇలా సౌదీ అరేబియాలో ఒక రెస్టారెంట్‌ను మూసేయడం ఇదే తొలిసారి కాదు. జనవరిలోనూ జెడ్డాలోని ఓ షావర్మా రెస్టారెంట్‌నూ మూసేశారు. అక్కడ షావర్మా కోసం వినియోగించే మాంసం స్కూయర్ పైన టాప్‌లో ఓ ఎలుక తిరుగుతూ కనిపించింది. దీంతో అధికారులు ఆ షావర్మా రెస్టారెంట్‌ను క్లోజ్ చేసింది.

ఇదిలా ఉండగా, ఉగ్రవాదంతో పాటు హత్యల వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడిన 81 మందికి Saudi Arabia మార్చి నెలలో సామూహికంగా మరణ శిక్ష అమలు చేశారు.1979లో Makkah Masjid ను స్వాధీనం చేసుకున్న 63 మంది Terrorist లకు 1980 జనవరిలో killed అమలు చేశారు. ఆ తర్వాత ఇంత మందికి ఒకేసారి మరణ శిక్ష అమలు చేయడం ఇదే తొలి సారి. పిల్లలు, మహిళలను హత్య చేసిన వారితో పాటు ఉగ్రవాదులుగా పని చేసిన వారు కూడా ఉన్నారని స్థానిక ప్రభుత్వ మీడియా తెలిపింది. Al Qaeda, ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ సభ్యులు, యెమెన్ హౌతీ మద్దతు దారులు కూడా మరణశిక్షకు గురైన వారిలో ఉన్నారు.నిందితులకు న్యాయవాదులు తమ సహాయం అందించారు. న్యాయ ప్రక్రియలో సౌదీ చట్టం ప్రకారం పూర్తి హక్కులు కల్పించినట్టుగా మీడియా ప్రతినిధులు తెలిపారు.

2016 జనవరిలో 47 మందిని Hang తీశారు. షియా మత గురువు సహా పలువురిని ఉరి తీశారు.2019 లో 37 మంది సౌదీ పౌరులను తల నరికి చంపారు. వీరిలో ఎక్కువగా షియాలున్నారు. తీవ్రవాద సంబంధిత నేరాలకు పాల్పడినందుకు మరణ శిక్ష విధించారు. 1980 జనవరిలో మక్కాలోని మసీదును స్వాధీనం చేసుకొన్న దోషులు 63 మందికి కూడా మరణ శిక్ష విధించారు. వీరికి కూడా తల నరికి మరణశిక్ష విధించారు.