Russia Ukraine Crisis: రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధాని ప్రకటించిన నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. యుద్ధం ఆపాలని ఐరాసతో పాటు చాలా దేశాలు కోరుతున్నాయి. ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై ఐక్యరాజ్య సమితి (ఐరాస) చీఫ్ ఆంటోనియో గుటెరస్ స్పందిస్తూ.. "నా పదవీకాలంలో అత్యంత విషాదకరమైన క్షణం" అని పేర్కొన్నారు.
Russia Ukraine Crisis: రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధాని ప్రకటించిన నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ యుద్ధం విరమించుకోవాలని ఇప్పటికే ఐక్యరాజ్య సమితి పలుమార్లు రష్యాకు విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలోనే మరోసారి స్పందించిన UN సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్.. ఉక్రెయిన్‌పై ప్రత్యేక సైనిక చర్య గురించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించడం "నా పదవీకాలంలో అత్యంత బాధాకరమైన.. విషాదకరమైన క్షణం" అని పేర్కొన్నారు. అయితే భద్రతా మండలి సభ్యులు రష్యా తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రేరేపిత.. అన్యాయమైన చర్యకు రష్యా దిగుతున్నదని విమర్శిస్తున్నారు. అయితే, పౌరులను రక్షించే ఉద్దేశంతో తూర్పు ఉక్రెయిన్‌లో ప్రత్యేక సైనిక చర్యను ప్రారంభించినట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. ఇతర దేశాల జోక్యం కూడా కుదరదని హెచ్చరించాడు.
“ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌గా నా పదవీకాలంలో ఇది అత్యంత విషాదకరమైన క్షణం. భద్రతా మండలి సమావేశాన్ని ప్రెసిడెంట్ పుతిన్‌ను ఉద్దేశించి, నా హృదయం బాధపడుతోంది. తీవ్ర దుఃఖానికి గురిచేస్తోంది. ఉక్రెయిన్‌పై దాడి నుండి మీ దళాలను ఆపండి. చాలా మంది మరణించారు కాబట్టి శాంతికి అవకాశం ఇవ్వండి” అని గుటెర్రెస్ UN ప్రధాన కార్యాలయంలో విలేకరులతో అన్నారు. ప్రస్తుత సమయంలో మానవత్వం ప్రదర్శించాలని రష్యాను కోరారు. “నేను తప్పక చెప్పాలి.. అధ్యక్షుడు పుతిన్.. మానవత్వం పేరుతో మీ దళాలను రష్యాకు తిరిగి రప్పించడంది. మానవత్వం పేరుతో, ఐరోపాలో శతాబ్ది ప్రారంభం నుండి అత్యంత ఘోరమైన యుద్ధాన్ని ప్రారంభించడానికి అనుమతించవద్దు. పరిణామాలు ఉక్రెయిన్‌కు మాత్రమే కాదు, రష్యన్ ఫెడరేషన్‌కు మాత్రమే కాదు, ప్రపంచం మొత్తానికి వినాశకరమైనవి” అని అన్నారు.
కోవిడ్ (మహమ్మారి) నుంచి బయటపడుతున్న తరుణంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో కూడా ఊహించలేమనీ, చాలా అభివృద్ధి చెందుతున్న దేశాలు కోలుకోవడానికి ఖచ్చితంగా సమయం అవసరం అని UN చీఫ్ అన్నారు. అధిక చమురు ధరలతో, ఉక్రెయిన్ నుండి గోధుమల ఎగుమతులు ముగియడంతో మరియు అంతర్జాతీయ మార్కెట్లలో అస్థిరత కారణంగా పెరుగుతున్న వడ్డీ రేట్ల అంతర్జాతీయంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతకుముందు ఐరాస కౌన్సిల్ సమావేశమైన సమయంలోనే పుతిన్ ఉక్రెయిన్ పై మిలిటరీ చర్యకు సంబంధించిన ప్రకటన చేశారు. ఐరాస కౌన్సిల్ సభ్య దేశాలు తీవ్ర స్థాయిలోనే స్పందిస్తున్నాయి. రష్యాపై ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడుతూ.. ఉక్రెయిన్ పై ఈ చర్యలను ఆపాలని పిలుపునిస్తున్నాయి. దౌత్యం కోసం పిలుపునిచ్చాయి. యూఎన్ కౌన్సిల్ లో శాశ్వత సభ్యదేశాలైన US, UK, ఫ్రాన్స్‌లతో సహా ఇతర సభ్య దేశాలు పుతిన్ చర్యలను ఖండిస్తూ.. ఉక్రెయిన్ కు మద్దతు తెలిపాయి.
యుఎస్ రాయబారి లిండా థామస్-గ్రీన్‌ఫీల్డ్ మాట్లాడుతూ.. "మేము శాంతిని కోరుతూ కౌన్సిల్‌లో సమావేశమైన ఖచ్చితమైన సమయంలో, పుతిన్ ఈ కౌన్సిల్ బాధ్యతను పూర్తిగా తృణీకరిస్తూ యుద్ధ ప్రకటన చేశారు. ఇది తీవ్రమైన అత్యవసర పరిస్థితి. కౌన్సిల్ చర్య తీసుకోవాలి మరియు మేము దీనిపై తీర్మానాన్ని తీసుకువస్తాం" అని తెలిపారు. UK రాయబారి బార్బరా వుడ్‌వార్డ్ మాట్లాడుతూ, "మేము ఈ ఛాంబర్‌లో కూర్చొని రష్యా తన చర్యలను వెనక్కి తీసుకోవాలని కోరుతున్నామని" తెలిపారు. "ఇది రెచ్చగొట్టబడని మరియు అన్యాయమైనది. ఇది ఉక్రెయిన్‌కు మరియు ఐక్యరాజ్యసమితి సూత్రాలకు సమాధి దినం" అని వుడ్‌వార్డ్ అన్నారు. ఫ్రెంచ్ రాయబారి నికోలస్ డి రివియర్ మాట్లాడుతూ.. “అత్యంత ఘోరమైన మరియు యుద్ధాన్ని నిరోధించడానికి మేము అత్యవసరంగా సమావేశమైన సమయంలో, మీరందరూ చేసినట్లుగా, రష్యన్ ఫెడరేషన్ అధ్యక్షుడు ప్రత్యేక సైనిక చర్యకు ఆదేశించారని మేము తెలుసుకున్నామని" తెలిపారు."ఈ కౌన్సిల్ సమావేశం జరుగుతున్న తరుణంలో ప్రకటించిన ఈ నిర్ణయం, రష్యా అంతర్జాతీయ చట్టాన్ని మరియు ఐక్యరాజ్యసమితిని కలిగి ఉన్న ధిక్కారాన్ని వివరిస్తుంది" అని ఫ్రెంచ్ రాయబారి అన్నారు. భద్రతా మండలి ముందు రష్యా జవాబుదారీగా ఉండాలని, అందుకే ఫ్రాన్స్ తన భాగస్వాములను కౌన్సిల్‌లో చేరి రాబోయే గంటల్లో ఈ యుద్ధాన్ని ఖండిస్తూ తీర్మానాన్ని సిద్ధం చేస్తుందని ఆయన అన్నారు.
