ప్రాంక్ వీడియోలు తీసి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసేవాళ్లు చాలా మంది ఉన్నారు. కొందరు డబ్బుల కోసం చేస్తే.. మరికొందరు ఫేమ్ కోసం చేస్తుంటారు. తాజాగా ఓ వ్యక్తి డబ్బుల కోసం ఓ ప్రాంక్ వీడియో చేయాలని అనుకున్నాడు. ఫలితంగా అతని గర్ల్ ఫ్రెండ్ అందులోనూ కడుపుతో ఉన్న మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన రష్యాలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఒక యూజర్‌ ప్రాంక్‌ వీడియో చేస్తే 1300 డాలర్లు ఇస్తాననడంతో స్టాస్‌ రిఫ్లే(30) అనే యూట్యూబర్‌ లైవ్‌ స్ట్రీమ్‌లో భాగంగా తన గర్ల్‌ఫ్రెండ్‌ వాలెంటినా గ్రిగోరీవా మీద ప్రాంక్‌ వీడియో చేయాలని భావించాడు. ఇక దానిలో భాగంగా స్టాస్‌‌, గర్భవతి అయిన వాలెంటినాను బాల్కనీలో ఉంచి తాళం వేశాడు.

బయట విపరీతమైన చలి... మంచు కురుస్తుంది. దారుణం ఏంటంటే ప్రాంక్‌ వీడియో కోసం వాలెంటినా బికినీ వేసుకుని బాల్కనీలో నిల్చుని ఉంది. దాదాపు 15 నిమిషాల పాటు గట్టకట్టుకుపోయే చలిలో ఉండటంతో వాలెంటినా మరణించింది. చలికి తట్టుకోలేక మధ్యలో డోర్‌ కొట్టింది కానీ స్టాస్‌ తలుపు తీయలేదు. దాంతో ఆమె రక్తం గడ్డకట్టుపోయి.. శ్వాస తీసుకోవడానికి కుదరక.. కడుపులో బిడ్డతో సహా మరణించింది.

ఆ తరువాత స్టాస్‌ ఆమెని ఇంటి లోపలికి తీసుకెళ్లాడు. బ్లాంకెట్‌ కప్పాడు. కానీ అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది. కానీ చలికి ఆమె అలా అయి ఉంటుందనుకున్న స్టాన్ ఆ‌మెను లేపేందుకు ప్రయత్నించాడు.

కానీ ఆమె నాడి కొట్టుకోలేదు. ఆమె నాడి చూశాడు.ఏమాత్రం కదలిక లేదు. నాడి ఆగిపోయింది. శ్వాస తీసుకోవడం లేదు.. శరీరం మొత్తం మంచుముద్దలాగా గడ్డకట్టిపోయి తెల్లగా పాలిపోయింది.అదంతా లైవ్ స్ట్రీమ్ లోనే ఉండటంతో స్టాస్ ఆమెను లేపటానికి గట్టి గట్టిగా అరవడం వీడియోలో వినిపించింది.