Asianet News TeluguAsianet News Telugu

బికినీలో టీచర్: ఉద్యోగం ఊడింది, టీచర్ల వినూత్న నిరసన

బికినీలో ఫోటో పెట్టిందని ఉద్యోగం పోయింది

Russian teacher sacked over Instagram swimsuit photos


మాస్కో: బికినీ ధరించిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందనే  కారణంగానే ఓ టీచర్ తన ఉద్యోగాన్ని పోగోట్టుకొంది. ఈ ఫోటోను చూసిన విద్యార్ధుల తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెను ఉద్యోగం నుండి తొలగించారు. అయితే ఈ టీచర్ కు మద్దతుగా టీచర్లంతా నిరసనకు దిగారు.

26 ఏళ్ల విక్టోరియా పోప్‌రోవా ఓమ్‌స్క్‌ పట్టణంలో 7 సిటీ స్కూల్‌లో హిస్టరీ టీచర్‌గా పని చేస్తుండేది. ఇటీవల సెలవులపై కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లింది.  బికినీలో ఓ ఫోటోషూట్‌ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్‌ చేశారు. 

అయితే ఆమెను ఫాలో అయ్యే వారిలో ఆమె స్టూడెంట్లు కూడా ఉన్నారు. ఈ విషయం కొందరు పేరెంట్స్‌ దృష్టికి రావటంతో వారంతా స్కూల్‌ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె నుంచి వివరణ కోరిన స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ చివరకు ఆమెను ఉద్యోగం నుంచి తొలగించింది.

విషయం తెలిసిన టీచర్ల అసోసియేషన్‌ మండిపడింది. టీచర్స్‌ ఆర్‌ హ్యూమన్స్‌ టూ పేరిట వినూత్నంగా నిరసనకు దిగారు. ఇందులో మొత్తం 11 వేల మంది టీచర్లు  పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా పలువురు టీచర్లు బికినీలతో ఫోటోలు దిగి విక్టోరియా పోప్‌రోవాకు మద్దతు తెలిపారు. ఆమెకు న్యాయం జరగకపోతే ఉద్యమం మరో రూపం దాల్చుతుందని హెచ్చరించారు. 

ఈ ఉద్యమం సోషల్‌ మీడియాను కదిలించింది. దేశంలోని మిగతా ప్రాంతాల నుంచి కూడా టీచర్లు ఆమెకు మద్ధతు ప్రకటిస్తూ తమ ఫోటోలను అప్‌లోడ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ బికినీ ఉద్యమం అక్కడ హాట్‌ టాపిక్‌గా మారింది.

Follow Us:
Download App:
  • android
  • ios