రష్యాకు చెందిన అధికారిక ప్రతినిధి వ్యాచెస్లావ్ వోలోడిన్ కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ .. రాజధాని కీవ్‌ను విడిచి రహస్య ప్రాంతానికి చేరుకున్నారని వెల్లడించారు. ఆయన ప్రస్తుతం ఎల్వివ్‌లో వున్నారని వోలోడిన్ వ్యాఖ్యానించారు. అయితే దీనిపై ఉక్రెయిన్ ప్రభుత్వం స్పందించాల్సి వుంది.
ఉక్రెయిన్‌పై (ukraine ) రష్యా దాడి నేపథ్యంలో (russia attack) ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ (volodymyr zelensky) తీవ్ర నిరాశలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. అన్ని దేశాలు తమకు సాయం చేస్తాయని భావించిన ఆశలు అడియాశలయ్యాయి. అయినప్పటికీ జెలెన్ స్కీ ఒంటరి పోరు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రష్యాకు చెందిన అధికారిక ప్రతినిధి వ్యాచెస్లావ్ వోలోడిన్ కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ .. రాజధాని కీవ్‌ను విడిచి రహస్య ప్రాంతానికి చేరుకున్నారని వెల్లడించారు. ఆయన ప్రస్తుతం ఎల్వివ్‌లో వున్నారని వోలోడిన్ వ్యాఖ్యానించారు. అయితే దీనిపై ఉక్రెయిన్ ప్రభుత్వం స్పందించాల్సి వుంది.
మరోవైపు.. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మూడో రోజుకు చేరాయి. రష్యా సైన్యం ఉక్రెయిన్‌లోని మిలిటరీ స్థావరాలపై దాడులు చేస్తున్నది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పైనా పలుచోట్ల దాడులు నిర్వహించింది. ఈ నేపథ్యంలోనే అమెరికా ఆ దేశ అధ్యక్షుడు వొలిడిమిర్ జెలెన్‌స్కీకి ఓ ఆఫర్ ఇచ్చింది. కీవ్‌లోకి రష్యా సేనలు ప్రవేశిస్తున్న నేపథ్యంలో రాజధాని నగరం నుంచి ప్రజలను తరలించడానికి తాము సిద్ధంగా ఉన్నామని అమెరికా తెలిపింది. తాము ఉక్రెయిన్‌కు హెల్ప్ చేయడానికి రెడీ అని వివరించింది. ఇదే ఆఫర్ అమెరికా.. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీకి ఇచ్చింది. కానీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు అమెరికా ఆఫర్‌ను తిరస్కరించారు. రాజధాని కీవ్‌పై ఇంకా పట్టు కోల్పోలేదని జెలెన్ స్కీ పేర్కొన్నారు. యుద్ధం ఆగితేనే శాంతి నెలకొంటుందని.. పోరాడేందుకు పౌరులు ముందుకొస్తే ఆయుధాలిస్తామని జెలెన్ స్కీ పేర్కొన్నారు.
‘ఇక్కడ పోరాటం జరుగుతున్నది. మాకు పేలుడు పదార్థాలు, ఆయుధాలు కావాలి. అంతేకాదు.. రైడ్ కాదు’ అని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీ చెప్పినట్టు అమెరికాకు చెందిన సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు వెల్లడించారు. వొలొడిమిర్ జెలెన్‌స్కీ యుద్ధం ఒత్తిడిలో లేరని, ఆయన పోరాటాన్ని విజయవంతం చేయాలనే ఆరాటంలో ఉన్నారని పేర్కొన్నారు.
ఈ రోజు ఐక్యరాజ్యసమితి (united nations 0 భద్రతా మండలిలో ఉక్రెయిన్‌పై దాడి గురించి 12 దేశాలు సంయుక్తంగా ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. కానీ, చైనా, ఇండియా, యూఏఈ అందులో పాల్గొనలేదు. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఉన్న రష్యాకు వీటో పవర్ ఉండటంతో ఆ తీర్మానం విఫలం అయింది. అయితే, ఈ తీర్మానంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పందించారు. 12 దేశాలు ఈ తీర్మానం ప్రవేశపెట్టడం హర్షనీయం అని, అంటే.. ప్రపంచ దేశాలు ఉక్రెయిన్‌తోనే ఉన్నాయనే విషయం స్పష్టం అవుతున్నదని వివరించారు.
ఇది ఇలా ఉండగా, ఉక్రెయిన్ పై రష్యా దాడిని ఖండిస్తూ.. రష్యా తన దళాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని తీర్మానంలో డిమాండ్ చేస్తూ.. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (UN)లో తీర్మానం ప్రవేశపెట్టారు. కానీ రష్యా తన వీటో అధికారాన్ని ఉపయోగించింది. మండలి 15 సభ్య దేశాల్లో 11 దేశాలు రష్యాకు వ్యతిరేకంగా..ఉక్రెయిన్ పై దండయాత్రను ఖండిస్తూ ఓటు వేశాయి. అయితే రష్యా తన వీటో అధికారంతో తీర్మానాన్ని తిరస్కరించింది. భారత్, చైనా, యూఏఈ ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి. ఐక్య రాజ్య సమితిలోని భద్రతా మండలిలో అమెరికా, అల్బేనియా దేశాలు రష్యాకు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశ పెట్టాయి. వెంటనే ఉక్రెయిన్ నుంచి రష్యా దళాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి.
