తాజాగా ఈ బృందానికి సంబంధించిన 400 మందిని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ హత్యకు పురమాయించినట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పుడు.. వీరే ఉక్రెయిన్ లో బీభత్సం సృష్టిస్తున్నారని అందరూ నమ్ముతున్న సత్యం.
ప్రస్తుతం ఎక్కడ చూసినా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గురించే వినపడుతోంది. ఉక్రెయిన్ ని... ఆక్రమించుకునేందుకు రష్యా చేయని ప్రయత్నమంటూ లేదు. అక్కడ బీభత్సం సృష్టిస్తోంది. వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఉక్రెయిన్ లో ఈ విధ్వంసం వెనక ఉన్నది రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్సనల్ చెఫ్ అంటూ వార్తలు వస్తున్నాయి. ఆయన ఎవరు..? ఆయన ఎలా ఉక్రెయిన్ నాశనం చేస్తున్నాడు..? అతని వెనక ఉన్న సైన్యం ఏమిటి..? మరి ఈ వార్తల వెనక నిజమెంతో చూద్దాం..
రష్యా పాలనలో ఒలిగార్క్‌ల కు విపరీతమైన శక్తి ఉంది. వారంతా రష్యా ఖనిజాలు, ఇంధనం వంటి వాటిని నియంత్రిస్తూ దేశాన్ని శాసిస్తుంటారు. వీరు పుతిన్‌కు అత్యంత సన్నిహితులే కావడం గమనార్హం. కానీ, వీరిలో ఓ ప్రత్యేకమైన ఒలిగార్క్ ఉన్నాడు.. అతడు చేతిలో ఇంధనం లేదు.. ఖనిజాలు లేవు.. కేవలం ఫుడ్ కాంట్రాక్టులు మాత్రమే ఉన్నాయి. ఇది కాకుండా మరో కీలక విభాగం ఇతని కనుసన్నల్లో ఉంది.
అదే పుతిన్ ప్రైవేటు సైన్యం.. వాగ్నార్ ప్రైవేటు మిలటరీ కంపెనీ (పీఎంసీ)..! ఈ గ్రూపులో మొత్తం కిరాయి సైనికులే వుంటారు. వీరు రష్యాకు, పుతిన్‌కు విదేశాల్లో అవసరమైన లక్ష్యాలను సాధించడానికి రహస్యంగా పనిచేస్తారు. తాజాగా ఈ బృందానికి సంబంధించిన 400 మందిని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ హత్యకు పురమాయించినట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పుడు.. వీరే ఉక్రెయిన్ లో బీభత్సం సృష్టిస్తున్నారని అందరూ నమ్ముతున్న సత్యం.
రష్యా అధ్యక్షుడు పుతిన్ పొలిటికల్ సర్కిల్‌లో యెవ్జెనీ ప్రిగోజిన్ అంటే తెలియని వారుండరు. అతన్ని 'పుతిన్స్ చెఫ్'గా వ్యవహరిస్తుంటారు. పుతిన్ ఆంతరంగికుల్లో ప్రిగోజిన్ ఒకరు. అతనికీ.. పుతిన్ కి ఎలా పరిచయం ఏర్పడిందో తెలిస్తే.. ఎవరైనా షాకౌతారు.
1980ల్లో దొంగతనం, దోపిడీ కేసుల్లో ప్రిగోజిన్ దాదాపు 9 ఏళ్ల జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చాడు. ఆ తర్వాత హాట్‌డాగ్ విక్రయిస్తూ జీవించాడు. సోవియట్ పతనం తర్వాత సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో రెస్టారెంట్ స్థాపించాడు. 1990ల్లో పుతిన్ అక్కడ మేయర్ కార్యాలయంలో పనిచేసేవారు. అక్కడ పరిచయం ఏర్పడింది.
ఈ క్రమంలో ది వ్యాట్కా నదిపై ప్రిగోజిన్ 'న్యూ ఐలాండ్' పేరిట తేలియాడే రెస్టారెంట్‌ను స్థాపించారు. ఆ తర్వాత 2000లో పుతిన్ రష్యా అధ్యక్షుడు అయ్యారు. మరోపక్క ప్రిగోజిన్ రెస్టారెంట్లు ఇతర వ్యాపారాలను విస్తరించాడు. 2001లో ఫ్రాన్స్ అధ్యక్షుడు జాక్ షిరాక్ పర్యటించిన సమయంలో 'న్యూ ఐలాండ్'లో పుతిన్ విందు ఏర్పాటు చేశారు. ఆ సమయంలో ప్రిగోజిన్ స్వయంగా అతిథులకు వడ్డించారు.
అంటే అప్పటి నుంచి.. అతను పుతిన్ కి పర్సనల్ చెఫ్ గా మారాడు. ఆ తర్వాత నుంచి పుతిన్ సన్నిహిత వర్గాల్లో ప్రిగోజిన్ కనిపిస్తూనే ఉన్నాడు. విదేశీ అతిథులు వచ్చిన సందర్భాల్లో చాలా సార్లు ప్రిగోజిన్ వడ్డిస్తూ ఫొటోల్లో దర్శనమిస్తాడు. రష్యా ప్రభుత్వానికి చెందిన సైనిక, పాఠశాల ఫుడ్ కాంట్రాక్టులు ఇతనికే దక్కాయి.
ఆ తర్వాత 2014లో వాగ్నార్ పీఎంసీ నిర్వహణలో ప్రిగోజిన్ పాత్ర కూడా బయటకు వచ్చింది. అప్పటి వరకు అతను గురించి ఎవరూ పట్టించుకోలేదు. కానీ.. ఆ ప్రైవేట్ సైన్యాన్ని అతనే నడిపిస్తున్నాడనే విషయం చాలా ఆసల్యంగా వెలుగులోకి వచ్చింది. 2016 అమెరికా ఎన్నికల్లో ట్రంప్‌నకు అనుకూలంగా ప్రచారం చేయించింది కూడా ప్రిగోజిన్ అని ఆరోపణలు ఉన్నాయి. వీరు ట్రంప్ కి ఎక్కువ సపోర్ట్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే.. వాటిని ఎవరూ నిరూపించలేకపోయారు.
కాగా.. ఇప్పుడు ఇతని వెనక.. ఓ ప్రైవేట్ సైన్యం ఉంది. ఆ సైన్యం దేశం కోసం కాదు... కేవలం పుతిన్ కోసం మాత్రమే పనిచేస్తుందట.
వాగ్నార్ పీఎంసీ రష్యా ప్రైవేటు సైన్యం. వాస్తవానికి ఈ పేరుతో ఏ కంపెనీ రిజిస్టరై లేదు. రష్యా సైన్యానికి చెందిన మాజీ లెఫ్టినెంట్ కర్నల్ దిమిత్రి ఉత్కిన్ ప్రారంభించాడు. జర్మనీ నియంతకు ఇష్టమైన ఒపేరా కంపోజర్ వాగ్నార్ పేరిట దీనిని ప్రారంభించినట్లు చెబుతారు.
ఇప్పుడు ఉక్రెయిన్ లో జరుగుతున్న మారణ హోమాన్ని కూడా వెనక నుంచి మొత్తం నడిపించేంది ప్రిగోజిన్ అని అందరూ అంటున్నారు. దేశ అధికార సైన్యం కాకుండా.. తమ ప్రైవేట్ సైన్యంతో వీరు ఈ బీభత్సం సృష్టిస్తున్నారు. వీరికి అన్ని దేశాలతో మంచి సంబంధాలు ఉన్నాయని కూడా సమాచారం.
