Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ చర్యలకు ధీటుగా ఉక్రెయిన్ బలగాలు స్పందిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య సోమవారం చర్చలు విఫలమయ్యాయి. ఈ ఇలాంటి పరిస్థితుల్లో 40 మైళ్ల పొడవునా రష్యా బలగాలు ఉక్రెయిన్ రాజధాని కైవ్ వైపు దూసుకొస్తున్నాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ చర్యలకు ధీటుగా ఉక్రెయిన్ బలగాలు స్పందిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే ఇరు దేశాల మధ్య సోమవారం చర్చలు జరిగాయి. అయితే, అవి విఫలమయ్యాయి. నాటో దళాల కుటామిలో చేరబోమంటూ ఉక్రెయిన్ రాతపూర్వకంగా రాసివ్వాలని పేర్కొంటుండగా.. వెంటనే కాల్పులు విరమించుకుని, రష్యా బలగాలు వెనక్కి వెళ్లాలని ఉక్రెయిన్ డిమాండ్ చేస్తోంది. ఇదే సమయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్.. న్యూక్లియర్ వెపన్స్ బలగాలను సన్నద్దంగా ఉండాలని పేర్కొనడం పై యావత్ ప్రపంచ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇలాంటి పరిస్థితులు ఉండగా, రష్యా బలగాలు భారీ ఎత్తున్న ఉక్రెయిన్ రాజధాని కైవ్ దిశగా దూసుకువస్తున్నాయని శాటిలైట్ చిత్రాలతో కూడిన నివేదికలు వెలువడటం తీవ్ర చర్చకు దారితీసింది.
40 మైళ్ల పొడవునా రష్యా బలగాలు ఉక్రెయిన్ రాజధాని కైవ్ వైపు దూసుకొస్తున్నాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి. Maxar Technologies నుండి వచ్చిన కొత్త ఉపగ్రహ చిత్రాలు కైవ్ శివార్లకు చేరుకున్న రష్యన్ సైనిక కాన్వాయ్ గతంలో పేర్కొన్న దానికంటే కూడా పొడవుగా ఉన్నట్లు చూపుతున్నాయి. రష్యన్ బలగాల కాన్వాయ్ 40 మైళ్ల కంటే ఎక్కువ పొడవు ఉందని మాక్సర్ వెల్లడించింది. సోమవారం ప్రారంభంలో రష్యన్ బలగాల కాన్వాయ్ సుమారు 17 మైళ్ల పోడవుగా వుందని పేర్కొన్న మాక్సర్.. ప్రస్తుతం అది 40 మైళ్ల కంటే ఎక్కువ పోడవుగా రహదారి వెంట వస్తున్నదని పేర్కొంది. ఈ పెద్ద సైనిక కాన్వాయ్‌లో సాయుధ వాహనాలు, ట్యాంకులు, ఫిరంగి వ్యవస్థలు, ఇతర లాజిస్టికల్ వాహనాలు ఉన్నాయని మాక్సర్ పేర్కొంది. Maxar సేకరించిన.. విశ్లేషించిన అదనపు ఉపగ్రహ చిత్రాలకు నవీకరించబడిన కాన్వాయ్ పొడవు కారణమని పేర్కొంది. సోమవారం తీసిన డేటా మరియు ఇమేజరీ ప్రకారం కాన్వాయ్ ఆంటోనోవ్ ఎయిర్‌బేస్ నుండి - కైవ్ సిటీ సెంటర్ నుండి 17 మైళ్ల దూరంలో - ఉక్రెయిన్‌లోని ప్రిబిర్స్క్‌కు ఉత్తరంగా విస్తరించి ఉందని మాక్సర్ తెలిపింది.
ఉక్రేనియన్ రాజధాని నుండి ప్రిబిర్స్క్ ఎంత దూరంలో ఉందో చెప్పాలంటే, చిన్న పట్టణం ఉక్రెయిన్-బెలారస్ సరిహద్దుకు దగ్గరగా ఉంది. ఇవాన్‌కివ్‌కు ఉత్తరం, వాయువ్య దిశలో, కాన్వాయ్ ప్రయాణిస్తున్న రహదారులకు సమీపంలో అనేక గృహాలు మరియు భవనాల నుండి పొగలు పైకి లేచినట్లు ఈ రిపోర్టులు పేర్కొన్నాయి. దీనికి గల కారణాలు స్పష్టం తెలియలేదని వెల్లడించింది. కొన్ని ప్రాంతాలలో రోడ్‌వేలు మిలిటరీ వాహనాలతో రద్దీగా మారనున్నాయనీ, ఇది పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్‌కు కారణమవుతుందని తెలిపింది. ఇదిలావుండగా, రష్యా, ఉక్రెయిన్ మధ్య బెలారస్ సరిహద్దుల్లో సోమవారం శాంతి చర్చలు జరిగాయి. ఇరు దేశాలు ఏకాభిప్రాయం రాకపోవడంతో ఆ చర్చలు విఫలమయ్యాయి. ఈ క్రమంలోనే మరోసారి చర్చలకు సిద్ధమని ఉక్రెయిన్ ప్రటించింది.
