ఉక్రెయిన్‌లోని మరో కీలక నగరం ఖేర్సన్‌ను రష్యా సేనలు వశపరచుకున్నాయి. ఇక... బుధవారం కూడా ఖార్కివ్ నగరంలో పోలీసు కార్యాలయంపై రష్యా సేనలు దాడులు చేశాయి. దీంతో ఈ ప్రాంతమంతా బాంబు పేలుళ్లతో దద్దరిల్లుతోంది. 

ఉక్రెయిన్‌ (ukraine) యుద్ధాన్ని రోజుల్లోనే ముగించాలనుకున్న రష్యాకు (russia) అది అంత తేలిక కాదనే విషయం త్వరగానే అర్ధమైంది. ఇప్పటికీ ఉక్రెయిన్‌లోని కీలక నగరాలను ఆక్రమించుకోకపోవడమే ఇందుకు నిదర్శనం. ఈ క్రమంలో రష్యాకు కాస్త ఉపశమనం లభించింది. దక్షిణ ఉక్రెయిన్ లోని ఖేర్సన్ నగరంపై ఆ దేశపు సైన్యం పూర్తిగా పట్టు సాధించింది. నగరంలో ఎక్కడ చూసినా రష్యా సాయుధ వాహనాలే కనిపిస్తున్నాయి. గత కొన్నిరోజులుగా ఉక్రెయిన్ నగరాల దిశగా రష్యా అదనపు బలగాలను తరలిస్తోంది. 

అటు, రాజధాని కీవ్ పైనా రష్యా బలగాలు బాంబులు, క్షిపణులతో విరుచుకుపడుతున్నాయి. ఇక్కడి భారీ టీవీ టవర్ ను రష్యా సైన్యం పేల్చివేసింది. దాంతో కీవ్ లో టెలివిజన్ ప్రసారాలు నిలిచిపోయాయి. ఇక.. నిన్న క్షిపణి దాడులతో దద్దరిల్లిన ఖార్కివ్ లోనూ పరిస్థితి ఏమీ మారలేదు. బుధవారం కూడా ఖార్కివ్ నగరంలో పోలీసు కార్యాలయంపై రష్యా సేనలు దాడులు చేశాయి. ఖార్కివ్ నగరంలోనే నిన్న జరిగిన క్షిపణి దాడిలో కర్ణాటకకు చెందిన భారతీయ విద్యార్థి నవీన్ సహా 21 మంది మరణించగా.. 100 మందికి పైగా క్షతగాత్రులయ్యారు.

ఇకపోతే.. మంగళవారం నాడు కార్యక్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మాట్లాడారు. రష్యా వైమానిక దళాన్ని నిలిపివేయడానికి నో ఫ్లై జోన్ ను విధించాలని జెలెన్ స్కీ నాటో దేశాలను కోరారు. రష్యా దళాలు ఉక్రెయిన్ రాజధాని వైపునకు వస్తున్నాయి. అయితే ఉక్రెయిన్ రాజధాని Kvivనగరాన్ని వదిలి వెళ్లేందుకు జెలెన్ స్కీ మాత్రం ససేమిరా అంటున్నారు. 

కనీసం తమ దేశ ప్రజలపై బాంబు దాడులను ఆపడం అవసరమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ (volodymyr zelensky) కోరారు. బాంబు దాడులను నిలిపివేయకుండా చర్చల్లో కూర్చోవడం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకుు రెండు అంతర్జాతీయ మీడియా సంస్థలకు జెలెన్ స్కీ ఇంటర్వ్యూ ఇచ్చారు.గత నెల 28వ తేదీన రష్యా, ఉక్రెయిన్ మధ్య తొలి దశ చర్యలు సాగాయి. ఈ చర్చల్లో కొంత పురోగతి ఉందని సమాచారం. రెండో విడత చర్చలు ఇవాళ జరగనున్నాయి. ఈ ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలోనే రష్యా దళాలు ఉక్రెయిన్ రాజధాని లోని హోలోకాస్ట్ స్మారక స్థలాానికి సమీపంలో ఉన్న TV టవర్ ను రష్యా క్షిపణి ఢీకొట్టిందని వార్తలు వచ్చాయి. మంగళవారం నాడు తెల్లవారుజాము నుండి ఖార్కివ్ నగరంపై రష్యా దాడులు చేస్తోంది. 

రష్యా దాడులు ఏడో రోజుకు చేరడంతో వాట్సాప్‌లో హెల్ప్‌లైన్ నెంబర్‌ను ప్రవేశపెట్టింది. ఆయా ప్రాంతాల్లోని పరిస్థితులను, ముఖ్య మైన సమాచారం, సలహాలను ప్రజలకు ఈ హెల్ప్‌లైన్ ద్వారా చేరవేయనుంది. నిన్న రష్యా మొత్తం ఖార్కివ్‌పైనే ఫోకస్ పెట్టింది. షెల్లింగ్ దాడులతో విరుచుకుపడింది. ఈ రోజు ఏకంగా రష్యా పారాట్రూపులు ఈ నగరంలో కాలుమోపాయి. రష్యా వైమానిక దళ సిబ్బంది ఖార్కివ్ నగరంలో దిగిందని ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది. వారు దిగీదిగగానే స్థానిక హాస్పిటల్‌ను ధ్వంసం చేశారని వివరించింది. ఇక్కడ యుద్ధం ఇంకా కొనసాగుతున్నదని పేర్కొంది.