Asianet News TeluguAsianet News Telugu

స్కర్ట్ ధరించి, మేకప్ వేసుకుంటే.. డబల్ సాలరీ.. కంపెనీ ఆఫర్

ఆఫీసుకి వచ్చే అమ్మాయిలు స్కర్ట్ ధరించి, మేకప్ వేసుకుంటే డబల్ సాలరీ ఇస్తామంటూ ఓ కంపెనీ వినూత్న ఆఫర్ చేసింది. కాగా... ఆ కంపెనీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

Russian company offers female employees money to wear skirts
Author
Hyderabad, First Published Jun 1, 2019, 1:28 PM IST

ఆఫీసుకి వచ్చే అమ్మాయిలు స్కర్ట్ ధరించి, మేకప్ వేసుకుంటే డబల్ సాలరీ ఇస్తామంటూ ఓ కంపెనీ వినూత్న ఆఫర్ చేసింది. కాగా... ఆ కంపెనీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఈ సంఘటన రష్యాలో చోటుచేసుకుంది.

పని స్థలాల్లో ‘వెలుగులు’ నింపేందుకు నెలరోజుల పాటు ‘ఫెమినిటీ మారథాన్’ నిర్వహిస్తున్నామనీ... ఇందులో భాగంగా ఉద్యోగినులు స్కర్టులు ధరించిరావాలని ఆ కంపెనీ కోరింది. మోకాళ్ల పైన ఐదు అంగుళాలకు మించకుండా స్కర్టు ధరించి, మేకప్ వేసుకుని విధులకు వచ్చిన వారికి జీతంలో 100 రూబిళ్లు (భారత కరెన్సీలో ఇది రూ.107) ఇస్తామని ప్రకటించింది. అల్యూమినియం తయారు చేసే సదరు కంపెనీ పేరు టాట్‌ప్రూఫ్. 2014 సోచీ వింటర్ ఒలింపిక్స్‌కి అల్యూమియం సరఫరా చేసింది కూడా ఈ కంపెనీయే.

అయితే.. ఈ కంపెనీ ఇచ్చిన ఆఫర్ పై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. వెలుగులు పేరిట స్త్రీలను చీకట్లోకి తోసేయాలని చూస్తున్నారా అని విమర్శిస్తున్నారు. ఈ ఆఫర్ పెట్టిన కంపెనీ యజమానిని వివిధ రకాలుగా తిట్టడం గమనార్హం. 

Follow Us:
Download App:
  • android
  • ios