ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో పలు దేశాలు, టెక్ కంపెనీలు రష్యాపై ఆంక్షలు విధిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఉక్రెయిన్‌పై దాడులు ఆపేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఆంక్షలు విధిస్తున్న దేశాలపై పుతిన్ ఎదురుదాడికి దిగుతున్నారు.
ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో పలు దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తున్న సంగతి తెలిసిందే. పలు దేశాలు రష్యా విమానాలకు తమ గగనతలాల్లోని అనుమతించడం లేదు. కొన్ని దేశాలు ఆర్థికంగా కూడా కఠిన ఆంక్షలు విధించాయి. మరోవైపు గత వారం రోజులుగా టెక్ కంపెనీలు గత వారం రోజులుగా టెక్ కంపెనీలు తమ ఉత్పత్తులు, సేవలను బ్లాక్ చేస్తున్నాయి. అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఉక్రెయిన్‌పై దాడులు ఆపేది లేదని స్పష్టం చేస్తున్నారు. రష్యాపై ఆంక్షలు విధిస్తున్న దేశాలపై పుతిన్ ఎదురుదాడికి దిగుతున్నారు. రష్యాను ఒంటరి చేయాలనే చూస్తున్న దేశాలపై పుతిన్ ఆంక్షలు విధించాడు.
తాజా సమాచారం ప్రకారం రష్యా దేశంలోని ట్విట్టర్, ఫేస్‌బుక్ ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్‌ను నిరోధించాలని నిర్ణయం తీసుకుంది. ట్విట్టర్, ఫేస్‌బుక్‌తో పాటు పలు వార్తా సంస్థలు, సోషల్ మీడియా సైట్‌లను రష్యాలో బ్లాక్ చేసినట్టుగా పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు రిపోర్ట్ చేశాయి. డెర్ స్పీగెల్ రిపోర్టర్ మాథ్యూ వాన్ రోహ్ కూడా ఇదే విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. ట్విట్టర్, ఫేస్‌బుక్, వార్తా సంస్థలు BBC, Deutsche Welleతో పాటు యాప్ స్టోర్స్‌ను బ్లాక్ చేసినట్టుగా తెలిపారు.
రష్యాలోని చాలా మంది పాఠకులు తమ వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేయలేకపోయారని లాట్వియన్ వార్తా సైట్ మెడుజా కూడా పేర్కొంది. ఫేస్‌బుక్ ఎగ్జిక్యూటివ్ నిక్ క్లెగ్గ్ స్పందిస్తూ.. ‘రష్యన్ ప్రభుత్వ యాజమాన్యంలోని నాలుగు మీడియా సంస్థలు Facebookలో పోస్ట్ చేసిన కంటెంట్ యొక్క స్వతంత్ర వాస్తవ తనిఖీ, లేబులింగ్‌ను నిలిపివేయాలని రష్యా అధికారులు నిన్న మమ్మల్ని ఆదేశించారు" అని చెప్పారు. ‘అందుకు మేము నిరాకరించాము. ఫలితంగా.. వారు మా సేవల వినియోగాన్ని పరిమితం చేస్తామని ప్రకటించారు’ అని పేర్కొన్నారు.
ఇక, ఉక్రెయిన్ పై రష్యా దాడి కొనసాగుతూనే ఉంది. రష్యా మరింత దూకుడుగా ప్రదర్శిస్తుండటంతో అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే శాంతియుతంగా ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలని చాలా దేశాలు కోరుతున్నాయి. అయినప్పటికీ రష్యా ఏమాత్రం పట్టించుకోకుండా దూకుడుగా ముందుకు సాగుతూ.. ఉక్రెయిన్ పై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే పలు మార్లు ఆ దేశ నేతలు అణుబాంబు దాడులు గురించి ప్రస్తావించడం ఉక్రెయిన్ తో పాటు యావత్ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు 9వ రోజుకి చేరుకోవడంతో పాటు, నకిలీ వార్తలు, ప్రచారం పెరుగుతున్న నేపథ్యంలో వాస్తవాలపై అనిశ్చితి కొనసాగుతోంది.
