Russia Ukraine Crisis: రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధాని ప్రకటించిన నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే భారత్ మరో కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్ లోని భారతీయులు ఎలాంటి సరిహద్దు పోస్టులకు వెళ్లవద్దని సూచించింది.
Russia Ukraine Crisis: రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధాని ప్రకటించిన నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. యుద్ధం ఆపాలని ఐరాసతో పాటు చాలా దేశాలు కోరుతున్నాయి. అయితే, ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ లోని పెద్ద సంఖ్యలో సైనిక స్థావరాలను ధ్వంసం చేయడంతో పాటు సైనిక బలగాలు కీవ్ నగరంలోకి ప్రవేశించాయి. ఇప్పటికీ ఉద్రిక్తంగా పరిస్థితులు మారాయి. ఈ క్రమంలోనే అక్కడి భారతీయులపై రక్షణపై కేంద్రం దృష్టి సారించింది. అక్కడున్న భారత పౌరులను తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం ఉక్రెయిన్ లోని భారత పౌరులకు సంబంధించి కేంద్రం మరో కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్ లోని భారతీయులు ఎలాంటి సరిహద్దు పోస్టులకు వెళ్లవద్దని సూచించింది.
"ఉక్రెయిన్‌లోని భారతీయ పౌరులందరూ సరిహద్దు పోస్టుల వద్ద భారత ప్రభుత్వ అధికారులతో ముందస్తు సమన్వయం లేకుండా సరిహద్దు పోస్టులకు వెళ్లవద్దని సూచించారు. వారికి సహాయం కోసం హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేయబడ్డాయనీ, దీని కోసం అధికారులను సంప్రదించాలని పేర్కొంది. భారత రాయబార కార్యాలయం, కైవ్ ఎమర్జెన్సీ నంబర్లును పేర్కొంటూ భారత రాయబార కార్యాలయం ఉక్రెయిన్‌లో తాజా ప్రకటనలో పేర్కొంది. కాగా, ఉక్రెయిన్ లోని భారత పౌరులను తీసుకురావడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అంతకు ముందు భారతీయ అధికారుల బృందాలను హంగేరి, పోలాండ్ దేశాల మీదుగా ఉక్రెయిన్ సరిహద్దులకు పంపి.. అక్కడ్నుంచి విద్యార్థులను స్వదేశానికి తీసుకురావడానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ఉక్రెయిన్, పోలాండ్, హంగేరి దేశాల్లోని ఇండియన్ ఎంబసీ అధికారులు ఎప్పటికప్పుడు విద్యార్థుల పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. సుమారు 16 వేల మంది ఇండియన్స్ ఉక్రెయిన్‌లో చిక్కుకున్నారని సమాచారం.
రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధాని ప్రకటించిన నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ యుద్ధం విరమించుకోవాలని ఇప్పటికే ఐక్యరాజ్య సమితి పలుమార్లు రష్యాకు విజ్ఞప్తి చేసింది. ఐరాస కౌన్సిల్ శాశ్వత సభ్య దేశాలు సైతం రష్యా తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. యూరప్ దేశాలు సైతం ఉక్రెయిన్ మద్దతుగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలోనే అమెరికా, దాని మిత్ర దేశాలు ఇప్పటికే రష్యాపై వాణిజ్య ఆంక్షలు విధించగా.. మరిన్ని చర్యలకు సిద్ధమవుతున్నాయి. ఇదిలావుండగా, ఆ దేశంపై దాడి చేసిన అనంతరం రష్యాతో ఉక్రెయిన్ అన్ని దౌత్య సంబంధాలను తెంచుకుంది. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్‌స్కీ రష్యా భారీ దాడి చేసిన తర్వాత దానితో సంబంధాలను తెంచుకోవాలనే నిర్ణయాన్ని ప్రకటించారు. ఉక్రెయిన్ అధికారులు ఆ దేశ సైన్యం తిరిగి పోరాడుతోందని మరియు పాశ్చాత్య దేశాల రక్షణ సహాయాన్ని కోరిందని చెప్పారు.
