ఉక్రెయిన్ లో మరో భారతీయ విద్యార్థి ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. రాజధాని కైవ్ లో ఓ విద్యార్థి బుల్లెట్ గాయాల బారిన పడి ఆస్పత్రిలో చేరాడు. ఈ మేరకు అధికారవర్గాలు వెల్లడించాయి. 


ర్జెస్జో : రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న భీకర యుద్ధంలో ఇప్పటికే ఓ భారతీయ విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన కొద్ది రోజులకే ఉక్రెయిన్ రాజధానిలో మరో భారతీయ విద్యార్థి బుల్లెట్‌ కాల్పుల్లో గాయపడి.. ఆసుపత్రి పాలయ్యాడు.

పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (MoCA) రాష్ట్ర మంత్రి (MoS) జనరల్ VK సింగ్ గురువారం పోలాండ్ Rzeszow విమానాశ్రయంలో ఈ మేరకు సమాచారాన్ని వెల్లడించారు. "కైవ్‌కు చెందిన ఒక విద్యార్థిపై కాల్పులు జరిపినట్లు నివేదికలు అందాయి. అతన్ని వెంటనే కైవ్‌లోని ఆసుపత్రిలో చేర్చారు" అని జనరల్ (రిటైర్డ్) సింగ్ చెప్పారు. 

కైవ్‌లో ఉన్న భారతీయవిద్యార్థులందర్నీ వెంటనే ఖాళీ చేయాలన్న లక్ష్యంతో భారత రాయబార కార్యాలయం చాలామేరకు తరలించింది. అయితే యుద్ధం జరుగుతున్నప్పుడు.. తుపాకీ బుల్లెట్ కు మతం, జాతీయత అనేది కనిపించదు”అన్నారాయన.

అనేక మంది విద్యార్థులు ప్రస్తుతం యుద్ధంతో అతలాకుతలం అవుతున్న ఉక్రెయిన్ నుండి పారిపోయి, సురక్షితంగా భారతదేశానికి చేరుకోవడానికి పోలాండ్ సరిహద్దుకు రావడానికి ప్రయత్నిస్తున్నారు.

నలుగురు కేంద్ర మంత్రులు, హర్దీప్ సింగ్ పూరీ, జ్యోతిరాదిత్య ఎం సింధియా, కిరెన్ రిజిజు మరియు జనరల్ (రిటైర్డ్) వీకే సింగ్ ఉక్రెయిన్‌కు ఆనుకుని ఉన్న దేశాల్లో తరలింపు ప్రయత్నాలను పర్యవేక్షిస్తున్నారు.

ఇదిలా ఉండగా, Ukraine పై రష్యా జరుపుతున్న attackలో మార్చి 1న భారత విద్యార్థి మృతి చెందడం దేశ ప్రజలను ఆందోళనకు గురి చేసింది. karnatakaలోని హవేరి జిల్లాకు చెందిన naveen gowda (21) మరణంపై దేశవ్యాప్తంగా సంతాపం వ్యక్తం అయింది. ఇదిలా ఉంటే కుటుంబ సభ్యులతో చివరిసారిగా (చనిపోయిన రోజు ఉదయం) మాట్లాడిన మాటలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తమతో మాట్లాడినట్లు తండ్రి, తాతయ్యలతో నవీన్ వీడియో కాల్ లో తెలిపాడు. భారతీయులు క్షేమంగా ఉండేలా ఇరుదేశాల అధికారులతో కేంద్రం మాట్లాడిందని మంత్రి చెప్పినట్లు పేర్కొన్నాడు.

‘కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో మాట్లాడాము. మమ్మల్ని తరలించడంలో కాస్త సమస్యలు ఏర్పడుతున్నట్లు చెప్పారు. రష్యా, ఉక్రెయిన్ దేశాలతో భారతప్రభుత్వం మాట్లాడిందని.. భారతీయులకు ఎలాంటి హానీ జరగకుండా చూస్తామని ఇరుదేశాలు హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు’ అని నవీన్ అన్నాడు. ఈ నేపథ్యంలోనే నవీన్ కు తండ్రి పలు సూచనలు చేశారు. ‘మీ వద్ద పెద్ద సైజు త్రివర్ణపతాకం ఉంటే దాన్ని మీరు ఉంటున్న బిల్డింగ్ బయట ఉంచండి. మంత్రి మాకు ఇదే విషయాన్ని వెల్లడించారు’ అని కుమారుడితో తండ్రి చెప్పారు.

Kharkivలోని గవర్నర్ కార్యాలయం పక్కనే ఉన్న అపార్ట్మెంట్లు నవీన్ స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. ఖార్కివ్ లో భయానక పరిస్థితులు నెలకొనడంతో వీరంతా సమీపంలోని Bunkerలోకి వెళ్లారు. అయితే బంకర్ లో నుంచి ఎందుకు రాలేకపోయావు? అనే ప్రశ్నకు.. 2 శాతం మంది మాత్రమే వెళ్లే అవకాశం ఉందని, రద్దీ ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. ‘రైళ్ల రాకపోకలు మళ్లీ మొదలయ్యాయి. ఉదయం 6,10 గంటలతో పాటు మధ్యాహ్నం ఒంటిగంటకు రైళ్లు ఉన్నాయి’ అని నవీన్ తండ్రితో అన్నాడు. 

‘అయితే పరిస్థితులను గమనించాకే ఎలాంటి నిర్ణయమైనా తీసుకో. అక్కడి నుంచి 40--50 కిలోమీటర్లు ముందుకు సాగితే అక్కడి నుంచి వచ్చేందుకు మరిన్ని మార్గాలు ఉంటాయి’ అని తండ్రి సూచించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడిన కొన్ని గంటలకే సెల్ దాడిలో నవీన్ మృతి చెందాడు. బంకర్ లో భోజనం, నీళ్లు లేక పోవడంతో కరెన్సీ మార్చుకుని ఆహారం తెచ్చుకునేందుకు నవీన్ బంకర్ నుంచి బయటకు వచ్చాడు. గవర్నర్ కార్యాలయానికి సమీపంలోనే ఉన్న ఓ Grocery Storeకి వెళ్లి అక్కడ క్యూలైన్లో నిలుచున్నాడు. అదే సమయంలో రష్యా బలగాలు గవర్నర్ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని షెల్ ప్రయోగించింది. అది కాస్త అదుపుతప్పి గ్రాసరీ స్టోర్ సమీపంలో పడింది దీంతో నవీన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. 

కాగా, మొదట ఇరు పక్షాల మధ్య భీకర కాల్పులు జరుగుతున్న వార్ జోన్‌లోకి నవీన్ ప్రవేశించడంతో అతనిపై కాల్పులు జరిగినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. గాయాలతో ఆసుపత్రిలో వున్నాడు.. లేక చనిపోయాడా అని నవీన్ బంధువు ప్రశ్నించగా.. అతను చనిపోయినట్లు 100 శాతం ధ్రువీకరణ అయ్యిందని విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు. మృతదేహాన్ని భారత్‌కు తరలించే విషయమై అడగ్గా.. ప్రస్తుతం ఆ ప్రాంతం వార్ జోన్‌లో వుందని, భౌతికకాయాన్ని మార్చురీలో భద్రపరిచామని.. పరిస్ధితులు చక్కబడిన తర్వాత స్వదేశానికి తరలించే ఏర్పాట్లు చేస్తామని విదేశీ వ్యవహారాల శాఖ సమాచారం అందించినట్లుగా తెలుస్తోంది.