Russia-Ukraine Live Updates: ర‌ష్యా- ఉక్రెయిన్ మధ్య పరిస్థితి రోజురోజుకీ తీవ్రరూపం దాల్చుతోంది. ఇరు దేశాల మ‌ధ్య యుద్ధ మేఘాలు క‌మ్ముకుంటున్నాయి. ఉక్రెయిన్ సరిహద్దుల్లో మోహరించిన రష్యా బలగాల్లో 50 శాతం ఉక్రెయిన్‌పై దాడికి సిద్ధంగా ఉన్నాయని, వచ్చే వారం లేదా రాబోయే రెండు రోజుల్లో ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయాలని భావిస్తున్నాయ‌ని అమెరికా రక్షణ శాఖ తెలిపింది 

Russia-Ukraine Live Updates: ర‌ష్యా- ఉక్రెయిన్ మధ్య పరిస్థితి రోజురోజుకీ తీవ్రరూపం దాల్చుతోంది. ఇరు దేశాల మ‌ధ్య యుద్ధ మేఘాలు క‌మ్ముకుంటున్నాయి. బ‌ల‌గాల‌ను వెన‌క్కి తీసుకున్నామ‌ని ర‌ష్యా చెబుతున్నా…. ర‌ష్యా బ‌ల‌గాలు ఉక్రెయిన్ స‌రిహ‌ద్దుల్లోనే ఉన్నాయ‌ని, యుద్ధం క‌చ్చితంగా జ‌రుగుతుంద‌ని అమెరికా చెప్పుతోంది.

ఉక్రెయిన్ సరిహద్దుల్లో మోహరించిన రష్యా బలగాల్లో 50 శాతం ఉక్రెయిన్‌పై దాడికి సిద్ధంగా ఉన్నాయని, వచ్చే వారం లేదా రాబోయే రెండు రోజుల్లో ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయాలని భావిస్తున్నాయ‌ని అమెరికా రక్షణ శాఖ తెలిపింది.

ముఖ్యంగా తూర్పు ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్‌ ప్రాంతంలో ఉక్రెయిన్ సైన్యం, రష్యా అనుకూల వేర్పాటు వాదులకు మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు మొదలయ్యాయ‌నీ, ఈ ప్రాంతంలో బాంబుల మోత‌తో ఈ ప్రాంతం దద్దరిల్లుతోందని అమెరికా చెప్పుతోంది. గ‌త రెండు రోజుల్లో దాదాపు 500 పేలుళ్లు జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది.

ఉక్రెయిన్ సరిహద్దుల్లో ర‌ష్యా 150,000 కంటే ఎక్కువ మంది సైనికులను ఉంచిందని, గ‌త మూడు నుంచి ర‌ష్యా బ‌ల‌గాల్లో గణనీయమైన కదలిక‌లు ఉన్న‌ట్టు అమెరికా రక్షణ శాఖ తెలిపింది. నలభై నుండి యాభై శాతం ర‌ష్యా బల‌గాలు ఉక్రెయిన్‌పై దాడికి సిద్ధంగా, గత 48 గంటల్లో ఆ బ‌లగాలు వ్యూహాత్మకంగా న‌డుచుకుంటున్నార‌ని అమెరికా రక్షణ శాఖ హెచ్చ‌రించింది. అలాగే... మాస్కో-ఉక్రెయిన్ సరిహద్దుల్లో 125 బెటాలియన్ల మోహ‌రించార‌నీ, సాధారణ సమయాల్లో కేవ‌లం 60 బెటాలియ‌న్లు మాత్ర‌మే ఉంటాయ‌నీ, ఫిబ్రవరి మొద‌టి వారంలో ఈ సంఖ్య‌ను 80 కి పెంచిన‌ట్టు అమెరికా రక్షణ శాఖ తెలిపింది.

ఉక్రెయిన్‌లోని ఆగ్నేయ డాన్‌బాస్ ప్రాంతంలో రష్యా అనుకూల వేర్పాటువాదులు, ఉక్రెయిన్ ప్రభుత్వ బలగాల మధ్య దాడులు జ‌రుగుతున్నాయ‌నీ,ఈ ప్రాంతంలో ఉద్రిక‌త్త వాతావ‌ర‌ణం నెల‌కొంద‌ని హెచ్చరించింది. ఉక్రెయిన్‌పై దాడి చేసేందుకు రష్యా స‌రిహ‌ద్దు ప్రాంతాల్లో రెచ్చగొట్టే ప్ర‌య‌త్నాలు అమెరికా భద్ర‌త బలాగాలు తెలిపాయి.

యుఎస్ డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ అంత‌ర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కి దాడి చేయ‌డానికి అనేక మార్గాలు ఉన్నాయ‌నీ, తాను అనుకుంటే.. చాలా త‌క్కువ స‌మ‌యంలో దాడికి పాల్ప‌డ‌వ‌చ్చు. ఇది బ్లఫ్ అని తాను నమ్మననీ ఆస్టిన్ అన్నాడు.

ఇదిలా ఉంటే.. మాస్కో దాని పశ్చిమ పొరుగు దేశాల‌పై దాడి చేయడానికి సిద్దంగా ఉంద‌నే వార్త‌ల‌ను తీవ్రంగా ఖండించింది, అయితే.. ఉక్రెయిన్ ఎప్పటికీ NATOలో చేరదని, పశ్చిమ కూటమి. తూర్పు ఐరోపా నుండి బలగాలను తొలగించే హామీని కోరుతోంది. పశ్చిమ దేశాల డిమాండ్లను ర‌ష్కా తిరస్కరించింది. రష్యా 2014లో ఉక్రెయిన్‌లోని క్రిమియా ప్రాంతాన్ని ఆక్రమించి, సానుభూతిగల వేర్పాటువాదులను ఉపయోగించుకుందని ఆరోప‌ణ‌లు బ‌ల‌ప‌డుతున్నాయి.