ఉక్రెయిన్ (ukraine)పై పక్కా వ్యుహాంతో దాడులు చేస్తూ రష్యా (russia) ముందుకు సాతగిపోతుంది. రష్యా వైమానిక దళాలను ఉపయోగించి ఉక్రెయిన్ సైనిక స్థావరాలపై దాడులు చేస్తోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో రష్యాతో వివాదంలో మధ్యవర్తిత్వం వహించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు.. ఇజ్రాయెల్ ప్రధానిని కోరినట్టుగా తెలుస్తోంది.
ఉక్రెయిన్ (ukraine)పై పక్కా వ్యుహాంతో దాడులు చేస్తూ రష్యా (russia) ముందుకు సాతగిపోతుంది. రష్యా వైమానిక దళాలను ఉపయోగించి ఉక్రెయిన్ సైనిక స్థావరాలపై దాడులు చేస్తోంది. ఉక్రెయిన్ కు రాజధాని కైవ్ ను చుట్టుముట్టి కాల్పులు జరుపుతోంది. యుద్దం మొదలుపెట్టిన తొలి రోజే అత్యంత కీలకమైన చెర్నోబిల్ అణు విద్యుత్తు కేంద్రాన్ని రష్యా బలగాలు స్వాదీనం చేసుకున్నాయి. ఉక్రెయిన్‌లోని వివిధ ప్రాంతాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఉక్రెయిన్ రాజధాని kyivను దాదాపు స్వాధీనం చేసుకునే దిశగా అడుగులు వేస్తుంది. అయితే ఉక్రెయిన్‌పై దండయాత్రను నిలిపివేయాలని రష్యాను ప్రపంచ దేశాలు కోరుతున్నాయి. చర్చల ద్వారా యుద్దానికి ముగింపు పలకాలని విజ్ఞప్తి చేస్తున్నాయి
మరోవైపు రష్యా, ఉక్రెయిన్‌ల నుంచి చర్చలకు సిద్దంగా ఉన్నామనే సంకేతాలు వెలువడుతున్నాయి. చర్చలు జరపాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు రష్యాను కోరారు. మరోవైపు ఉక్రెయిన్ సేనలు ఆయుధాలు వీడితే తాము చర్చలకు సిద్దమని రష్యా విదేశాంగ శాక తెలిపింది. ఉక్రెయిన్ ప్రజలకు అణచివేత నుంచి స్వేచ్ఛ కల్పించేందుకు తాము సైనిక ఆపరేషన్ చేపట్టినట్టుగా చెప్పుకొచ్చింది.
రష్యాతో వివాదంలో మధ్యవర్తిత్వం వహించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు.. ఇజ్రాయెల్ ప్రధానిని కోరినట్టుగా తెలుస్తోంది. ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలి బెన్నెట్‌ను రష్యాతో వివాదంలో మధ్యవర్తిత్వం వహించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ శుక్రవారం కోరినట్లు ఇజ్రాయెల్‌లోని ఉక్రెయిన్ రాయబారి తెలిపారు. ‘మేము ఇజ్రాయెల్‌కు మధ్యవర్తిత్వ పాత్ర గురించి కనీసం గత సంవత్సరం నుంచి ఆ దేశంతో మాట్లాడుతున్నాము. రెండు దేశాలతో అద్భుతమైన సంబంధాలను కలిగి ఉన్న ఏకైక ప్రజాస్వామ్య దేశం ఇజ్రాయెల్ అని మా నాయకత్వం విశ్వసిస్తోంది’ అని ఉక్రెయిన్ రాయబారి యెవ్‌జెన్ కోర్నిచుక్ తెలిపినట్టుగా రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. ఒకవేళ మధ్యవర్తిత్వం వహించడానికి ఇజ్రాయోల్ ప్రధాని ముందుకువస్తే.. ఇరు దేశాల మధ్య చర్చలు జరిగే అవకాశం లేకపోలేదనే వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం ఉక్రెయిన్‌ను అక్రమించాలనే ఉద్దేశం తమకు లేదని చెబుతున్నాడు. తూర్పు ఉక్రెయిన్‌ను రక్షించడానికి సైనిక చర్య అవసరమైందని అంటున్నారు. ప్రజలపై తాము దాడి చేయడం లేదని చెబుతున్నారు. తమ జోలికి వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరిస్తున్నారు. అయితే ఉక్రెయిన్‌లో క్షేత్ర స్థాయి పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని తెలుస్తోంది. పలు నగరాలపై రష్యా సైనిక బలగాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. దీంతో ఉక్రెయిన్ పౌరులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.
ఇక, గత 48 గంటల్లో 50 వేల మందికి పైగా ఉక్రెయిన్ పౌరులు ఆ దేశాన్ని వీడి వెళ్లినట్టుగా ఐక్యరాజ్య సమితి తెలిపింది. మరోవైపు ఉక్రెయిన్‌పై యుద్దం చేస్తున్న పుతిన్‌పై.. సొంత దేశంలోనే పలువురు వ్యతిరేకిస్తున్నారు. ఇలా నిరసనలు తెలిపిన వేలాది మందిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.
