Russian Ukraine Crisis: ఉక్రెయిన్‌కు అన్ని విధాలుగా సాయం చేస్తామని రొమేనియా ప్రకటించింది.  ఇప్పటికే రొమేనియా సరిహద్దుకు చేరిన ఉక్రెయిన్ పౌరులకు  ఆ ప్ర‌భుత్వం సాయం చేస్తోంది. మరోసారి త‌న దాతృత్వాన్ని మరోసారి చాటుకోవ‌డానికి ముందుకు వ‌చ్చింది రోమేనియా.   

Russian Ukraine Crisis: ఉక్రెయిన్ ను ఆక్రమించాల‌నే కుతంత్రంతో రష్యా నాలుగో రోజు కూడా దాడి చేస్తుంది. ఇప్ప‌టి ప‌లు న‌గ‌రాల‌ను ధ్వంసం చేసింది. రష్యా బ‌లాగాల‌ దాష్టీకంతో ఉక్రెయిన్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఎటుచూసినా.. బాంబు దాడులతో, వైమానిక దాడులతో భయానక దృశ్యాలు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోన‌నే భయాందోళ‌న మ‌ధ్య ఎక్క‌డ ఆశ్ర‌యం దొరికితే.. అక్క‌డ త‌ల‌దాచుకుంటున్నారు ఉక్రెయిన్ దేశ‌స్థులు.

యుద్దం విర‌మించుకోవాల‌ని ప్ర‌పంచ దేశాలు విజ్ఞ‌ప్తి చేసిన ర‌ష్యా మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేదు. ర‌ష్యా చేస్తున్న దామ‌న‌కాండ‌ను ఐక్య రాజ్య‌స‌మితి కూడా తీవ్రంగా ఖండిస్తోంది. అదే సమయంలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌తో సహా అనేక దేశాలు రష్యాపై కఠినమైన ఆంక్షలు విధించాయి. రష్యా తన తప్పుడు నిర్ణయానికి తీవ్ర పరిణామాలు ఎదుర్కొవ‌ల్సి ఉంటుంద‌ని ప‌లు అంత‌ర్జాతీయ సంస్థ‌లు హెచ్చరిస్తున్నాయి. అయినా.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. 

మరోవైపు ఉక్రెయిన్ అండ‌గా.. పలు దేశాలు సహాయం చేస్తున్నాయి. అమెరికా, బ్రిటన్ ల‌తోపాటు 28 దేశాలు వైద్య సామాగ్రి, సైనిక సాయం అందిచడానికి ముందుకు వ‌చ్చాయి. తాజాగా.. రొమేనియా కూడా ముందుకు వ‌చ్చింది. రష్యా దాడితో ద‌ద్ద‌రిల్లుతోన్న ఉక్రెయిన్‌కు అన్ని విధాలుగా సాయం చేస్తామని రొమేనియా ప్రకటించింది. ఉక్రెయిన్ సరిహద్దు దేశం రొమేనియా. ఇప్పటికే తమ దేశ సరిహద్దుకు చేరిన ఉక్రెయిన్ పౌరులకు, ఇత‌ర దేశాల పౌరులకు రొమేనియా ప్ర‌భుత్వం సాయం చేస్తోంది. రోమేనియా త‌న దాతృత్వాన్ని మరోసారి చాటుకోవ‌డానికి ముందుకు వ‌చ్చింది.

ఉక్రెయిన్‌కు 3.3 మిలియన్ డాలర్ల ($3.38 మిలియన్లు) విలువైన సహాయం అందిస్తామని చెప్పింది. తమ దేశం నుంచి ఇంధనం, మందుగుండు సామాగ్రి, బుల్లెట్ ప్రూఫ్ దుస్తులు, హెల్మెట్‌లు, సైనిక పరికరాలు, ఆహారం, నీరు వంటి సదుపాయాలు పంపబడతాయని రొమేనియన్ ప్రభుత్వం పేర్కొంది. రష్యా దాడుల్లో గాయపడ్డ సైన్యానికి, పౌరులకు వైద్య ప‌రంగా ఆదుకోవడానికి ముందుకొస్తుందని ప్రభుత్వ ప్రతినిధి డాన్ కార్బునారు తెలిపారు. ఇప్ప‌టికే ఉక్రేనియన్ సరిహద్దుల్లో త‌మ‌ అధికారులు సాయం చేస్తున్నారనీ,

ఈశాన్య సిరెట్ క్రాసింగ్ వద్ద రొమేనియా సరిహద్దును దాటడానికి పొడవైన క్యూలలో వేచి ఉన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు మరియు వృద్ధులను తీసుకవెళ్లడానికి రోమేనియన్ అంబులెన్స్‌లను ఏర్పాటు చేసిందని తెలిపారు. ఉక్రెయిన్-రొమేనియా సరిహద్దుల్లో ఉన్న సోలోట్వినో, చెర్నివ్ట్సీలకు ఆహారం, దుప్పట్లు. శీతాకాలపు దుస్తులను అంద‌జేశామ‌ని, అలాగే వారిని తీసుకువెళ్ల‌డానికి బస్సులను ఏర్పాటు చేసిన‌ట్టు తెలిపారు.