Russia Ukraine Crisis :ఉక్రెయిన్ గ‌గ‌న‌త‌లాన్ని నో-ఫ్లై జోన్‌గా ప్ర‌క‌టిస్తే.. ప‌రోక్షంగా యుద్దం చేయాల‌నే కోరిక ఉన్న‌ట్లేన‌ని రష్యా అధ్యక్షుడు పుతిన్ పేర్కోన్నారు.  ఏ దేశమైనా నో ఫ్లై జోన్‌గా విధించినా.. అలా విధించాలని కోరినా యుద్ధానికి దిగినట్టేనని హెచ్చరించారు. ‘నో ఫ్లై జోన్‌’పై ముందుకు వెళ్తే.. నాటో దేశాలతో పాటు యావత్తు ప్రపంచం భారీ, విపత్తు పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చ‌రించారు.  

Russia Ukraine Crisis : రష్యా, ఉక్రెయిన్ మధ్య వరుసగా ప‌దో రోజు కూడా భీకర యుద్ధం చేస్తుంది. ఇప్ప‌టికే ఉక్రెయిన్ లోని పలు న‌గరాల‌ను ఆక్ర‌మించిన ర‌ష్యా.. శ‌నివారం కూడా ఉక్రెయిన్ లోని పలు న‌గ‌రాల‌పై బాంబుల వర్షం కురిపించింది. రాజధాని కీవ్ సిటీతో సహా చెర్నిహివ్, ఖార్కివ్, ఖేర్సన్, మైకోలైవ్ నగరాలపై దాడుల‌ను కొన‌సాగించింది. రాజ‌ధాని న‌గ‌రం కీవ్ లోకి రష్యన్ బలగాలు ప్ర‌వేశించ‌కుండా.. ఉక్రెయిన్ సైనికులు, తీవ్రంగా శ్రమిస్తున్నారు. వీరోచితంగా పోరాటం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్ గగనతలాన్ని ‘నో-ఫ్లై జోన్‌’గా ప్రకటించాలని ఆ దేశ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీ.. నాటో కు విజ్ఙ‌ప్తి చేశారు. కానీ.. ఆయ‌న విజ్ఞ‌ప్తిని సున్నితంగా తోసిపుచ్చింది. ఈ నేప‌థ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మీడియాతో మాట్లాడుతూ ఉక్రెయిన్ గ‌గ‌న‌త‌లాన్ని నో-ఫ్లై జోన్‌గా ప్ర‌క‌టిస్తే.. ప‌రోక్షంగా యుద్దం చేయాల‌నే కోరిక ఉన్న‌ట్లేన‌ని పేర్కోన్నారు. ఏ దేశమైనా నో ఫ్లై జోన్‌గా విధించినా.. అలా విధించాలని కోరినా యుద్ధానికి దిగినట్టేనని హెచ్చరించారు.

 ‘నో ఫ్లై జోన్‌’పై ముందుకు వెళ్తే.. నాటో దేశాలతో పాటు యావత్తు ప్రపంచం భారీ, విపత్తు పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చ‌రించారు. రష్యాలో ఆందోళనల కట్టడికి మార్షల్‌ లా విధించే ఆలోచన లేదని, నోఫ్లై జోన్ ఆంక్ష‌లు విధిస్తే.. తమపై యుద్ధాన్ని ప్రకటిస్తున్నట్టుగానే పరిగణిస్తామని తెలిపారు. అన్నీ ఆలోచించిన తర్వాతనే ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగామని పేర్కొన్నారు.

నో-ఫ్లై జోన్ ప్ర‌యోజ‌నాలేంటీ..? 

సాధారణంగా యుద్ధ ప‌రిస్థితుల్లో వైమానిక దాడుల నుంచి పౌర జనాభాను రక్షించడానికి ఆయా దేశాలు నో ఫ్లై జోన్ గా ప్ర‌క‌టిస్తారు. ఆ గ‌గ‌న త‌లంలోకి శత్రు దేశాలు విమానాలు వ‌స్తే.. ఎలాంటి ముంద‌స్తు హెచ్చ‌రిక‌లు లేకుండా.. వాటిని ధ్వంసం చేయ‌వ‌చ్చు. అంటే.. రష్యా.. ఉక్రెయిన్ దేశ గగనతలంపై దాడి చేస్తే ఆ దేశానికి చెందిన మిలట్రీ లేదా దానిని విధించిన కూటమి ప్రత్యర్థి విమానాలను కూల్చివేయవలసి ఉంటుంది.

ఇందుకే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ .. త‌న దేశ గ‌గ‌త త‌లాన్ని.. నో-ఫ్లై జోన్ గా ప్ర‌క‌టించాల‌ని నాటో సభ్య దేశాలకు విజ్ఞ‌ప్తి చేసింది. కానీ, నాటో.. జెలెన్‌స్కీ విజ్ఞ‌ప్తిని తోసిపుచ్చింది. అలా చేస్తే పెను యుద్ధానికి దారులు పడతాయని నాటో హెచ్చరిస్తోంది. నిజానికి అమెరికా, నాటో దేశాలు నో ఫ్లై జోన్‌ వినతిని తిరస్కరించడానికి బలమైన కారణాలు లేకపోలేదు. నో ఫ్లై జోన్‌ను ప్రకటిస్తే రష్యా విమానాలను ఉక్రెయిన్ కూల్చివేస్తుంది. నో ఫ్లై జోన్ ప్రకటించిన దేశాలు కూడా రష్యా యుద్ధ విమానాలను కూల్చేయాల్సి వస్తుంది. పైగా తూర్పు ఐరోపాను యుద్ధంలోకి లాగడానికి నాటో కూటమి ఇష్టపడటం లేదు.

అంతేకాదు.. ఇలా నో ఫ్లై జోన్ విధించే దేశాలు క్షేత్రస్థాయిలోని ఆయుధాలను ఆధీనంలోకి తీసుకోవాలి. అదే జరిగితే మూడో ప్రపంచ యుద్ధానికి నాంది పలికినట్టే అవుతుంది. గతంలో అమెరికా కొన్ని దేశాల్లో నో ఫ్లై జోన్ విధించింది. 1991లో మొదటి గల్ఫ్ యుద్ధం తర్వాత కొన్ని జాతి, మత సమూహాలపై దాడులను నిరోధించడానికి అమెరికా, దాని సంకీర్ణ భాగస్వాములు ఇరాక్‌లో రెండు నో ఫ్లై జోన్‌లను ఏర్పాటు చేశారు. అయితే దీనికి ఐక్యరాజ్య సమితి మద్దతు లభించలేదు. అదే విధంగా లిబియాలో 2011 సైనిక జోక్యంలో భాగంగా యూఎస్ భద్రతా మండలి కూడా నో ఫ్లై జోన్‌ను ఆమోదించింది.