ఉక్రెయిన్‌పై (ukraine)  రష్యా దాడి (russia invasion) నేపథ్యంలో ఆ దేశ రాజధాని కీయివ్‌లో (kyiv) ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలంతా నగరాన్ని వీడేందుకు జనం సిద్ధపడటంతో కీయివ్‌లోని వీధులు, మెట్రో స్టేషన్లన్నీ జనంతో నిండిపోయాయి. మరికొందరు బస్సుల్లో కిక్కిరిసి వున్నప్పటికీ ప్రయాణిస్తూనే వున్నారు. యుద్ధం నేపథ్యంలో వీధుల్లో జనాలు ప్రార్థనలు చేస్తూ కనిపించారు. 

ఉక్రెయిన్‌పై (ukraine) రష్యా దాడి (russia invasion) నేపథ్యంలో ఆ దేశ రాజధాని కీయివ్‌లో (kyiv) ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఏ వైపు నుంచి ఏ క్షిపణి వచ్చి పడుతుందో.. ఏ బాంబు వచ్చి పేలుతుందోనని జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తట్టాబుట్ట సర్దుకుని పిల్లలు, పెంపుడు జంతువులను చంకనెత్తుకుని ప్రాణాలరచేత పట్టుకుని కీయివ్‌ను విడిచిపెట్టి పారిపోతున్నారు. మరికొందరు బాంబులు, క్షిపణుల దాడి నుంచి తప్పించుకునేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బంకర్లలోకి వెళ్తున్నారు. బంకర్లకు దారి చూపిస్తూ గోడలపై ఎర్రని మార్కుతో అధికారులు బాణం గుర్తులేశారు. 2014లోనే ఏర్పాటు చేసిన బాంబు షెల్టర్ల అవసరం ఇప్పుడు రావడంతో.. వాటికి దారి తెలిసేలా ఈ మార్కులు వేశారు.

ప్రజలంతా నగరాన్ని వీడేందుకు జనం సిద్ధపడటంతో కీయివ్‌లోని వీధులు, మెట్రో స్టేషన్లన్నీ జనంతో నిండిపోయాయి. కొందరు తలదాచుకోవడానికి మెట్రో అండర్ గ్రౌండ్ స్టేషన్లకు వెళితే.. మరికొందరు ఏ రైలు దొరికితే ఆ రైలు ఎక్కేసి సిటీని వీడుతున్నారు. మరికొందరు బస్సుల్లో కిక్కిరిసి వున్నప్పటికీ ప్రయాణిస్తూనే వున్నారు. యుద్ధం నేపథ్యంలో వీధుల్లో జనాలు ప్రార్థనలు చేస్తూ కనిపించారు. 

ఇక గురువారం తెల్లవారుజామున పుతిన్ (putin) తన ప్రకటనలో రష్యా.. సైనిక స్థావరాలపై మాత్రమే దాడి చేస్తోందనీ, జనాభా ఉన్న ప్రాంతాలను కాద‌ని పేర్కొన్నారు. కానీ, అప్పటికే భారీ ప్రాణనష్టం జరిగినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఉక్రెయిన్ సరిహద్దు దళం ఉత్తరాన ఉన్న తమ పోస్ట్‌లు రష్యన్ మరియు బెలారస్ దళాల నుండి దాడికి గురయ్యాయని పేర్కొంది. అంటే, ర‌ష్యా ఒక్క‌వైపు నుంచే కాకుండా అన్ని వైపుల నుంచి ఉక్రెయిన్ పై దాడిని కొన‌సాగిస్తున్న‌ద‌ని ఈ ప‌రిణామాలు తెలియ‌జేస్తున్నాయి. 

బెలారస్ వైపు నుంచి కొన‌సాగిన దాడికి సంబంధించిన వీడియో క్లిప్ లు వైర‌ల్ అవుతున్నాయి. కీవ్‌కు 120 మైళ్ల దూరంలో ఉన్న బెలారస్ సరిహద్దుపై కూడా రష్యా దాడి చేసిందని ఉక్రేనియన్ ప్రభుత్వ ప్రతినిధి ధృవీకరించారు. "ఉక్రెయిన్ రాష్ట్ర సరిహద్దు రష్యా మరియు బెలారస్ నుండి వచ్చిన దళాలచే దాడి చేయబడింది. ఉదయం 5 గంటలకు, ఉక్రెయిన్ రాష్ట్ర సరిహద్దు, రష్యన్ ఫెడరేషన్ మరియు రిపబ్లిక్ ఆఫ్ బెలారస్ ఉన్న ప్రాంతంలో, బెలారస్ మద్దతు ఉన్న రష్యన్ దళాలు దాడి చేశాయి" అని తెలిపారు. 

ఇదిలావుండ‌గా, ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధం (russia ukraine war) నేప‌థ్యంలో అంత‌ర్జాతీయ స‌మాజం ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోంది. ఐరాస ఈ యుద్ధం ఆపాల‌ని ఇప్ప‌టికే ర‌ష్యాను కోరింది. దీని కోసం వ‌రుస స‌మావేశాలు నిర్వ‌హిస్తోంది. ఇక ప్ర‌పంచంలోని అగ్ర దేశాధినేత‌లు సైతం ర‌ష్యా తీరు మార్చుకోవాల‌ని పిలుపునిస్తున్నారు. అమెరికా అయితే, ఉక్రెయిన్‌కు అండ‌గా ఉంటామ‌నీ, దీనికి పూర్తి బాధ్య‌త వ‌హించేలా ర‌ష్యాపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఘాటు వ్యాఖ్య‌లు చేసింది. 

ఉక్రెయిన్‌కు తమ మద్దతును కొనసాగిస్తామనీ, సైనిక దాడికి ప్రపంచం ముందు రష్యాను బాధ్యులను చేస్తుందని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ అన్నారు. ఈ యుద్ధం రష్యా ప్రేరేపిత, అన్యాయమైన చ‌ర్య‌గా అభివ‌ర్ణించారు. "రష్యన్ సైనిక బలగాలచే ప్రేరేపించబడుతూ.. అన్యాయమైన దాడికి గురవుతున్న ఉక్రెయిన్ ప్రజలకు తాము అండ‌గా ఉంటాం" అని బిడెన్ తెలిపారు. ఈ యుద్ధం కార‌ణంగా సంభ‌వించే మ‌ర‌ణాలు, విధ్వంసానికి రష్యా మాత్రమే బాధ్యత వహిస్తుందనీ, యునైటెడ్ స్టేట్స్, దాని మిత్రదేశాలు, భాగస్వాములు ఐక్యంగా ఉండి.. నిర్ణయాత్మక మార్గంలో ప్రతిస్పందిస్తాయ‌నీ, ప్రపంచం ముందు రష్యాను జవాబుదారీగా ఉంచుతుంద‌ని బైడెన్ పేర్కొన్నారు.