రష్యా తన సైనికులకు మిలటరీ పరికరాలు అందించేందుకు ఉపయోగిస్తున్న ఆంటోనోవ్ యాన్-26 గురువారం కుప్పకూలింది.  ఈ ప్రమాదం సమయంలో విమానంలో ఉన్న సిబ్బంది అంతా మరణించారు. కానీ ఎంత మంది చనిపోయారనే విషయంలో క్లారిటీ లేదు. 

రష్యా (Russia) కు చెందిన ఆంటోనోవ్ యాన్-26 (Antonov An-26 ) రవాణా విమానం ఉక్రెయిన్ (Ukraine) సమీపంలోని రష్యాలోని దక్షిణ వొరోనెజ్ (southern Voronezh) ప్రాంతంలో కుప్పకూలింది. అయితే ఈ ఘ‌ట‌న‌లో అందులో ఉన్న సిబ్బంది అందరూ మరణించారని ర‌ష్యా రక్షణ మంత్రిత్వ శాఖ గురువారం ప్ర‌క‌టించింది.

‘‘మిలిటరీ (military) పరికరాలను రవాణా చేస్తున్న రష్యన్ ఏరోస్పేస్ (Russian aerospace) దళాలకు చెందిన An-26 విమానం గురువారం కూలిపోయింది. ఆ స‌మ‌యంలో విమానంలో ఉన్న సిబ్బంది మ‌రిణించారు.‘‘ అని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించిందని ఆ దేశ మీడియా సంస్థ‌లు ల్లడించాయి. అయితే ఈ ఘ‌ట‌నలో ఎంత మంది మ‌ర‌ణించారు ? వారి స్థాయి ఏమిటి వంటి వివ‌రాలు ఏవీ తెలియ‌జేయ‌లేదు. 

పొరుగు దేశంపై భారీ దండయాత్రకు వ్లాదిమిర్ పుతిన్ (vladimir putin) ఆదేశించిన త‌రువాత రష్యా (Russia) దళాలు ఉక్రేనియన్ సరిహద్దును దాటి రాజధాని కైవ్‌ను చుట్టుముడుతున్న స‌మ‌యంలో ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి పరికరాల వైఫల్యమే కారణమని ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది, ఇది నేల‌పై ఎలాంటి విధ్వంసం కలిగించలేదని తెలిపింది. రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి AFPతో మాట్లాడుతూ.. ఈ విమాన ప్ర‌మాదాన్ని ధృవీకరించారు. అయితే ఎంత మంది సిబ్బంది మరణించారనే వివ‌రాలు చెప్పడానికి నిరాకరించారు. కాగా సాధార‌ణంగా An-26 విమానాలు ఆరుగురు సిబ్బందిని, 38 మంది సైనిక సిబ్బందిని కలిగి ఉంటాయి.

ఇది ఇలా ఉండ‌గా.. ఉక్రెయిన్‌పై రష్యా దాడికి ప్రతిస్పందనగా యునైటెడ్ స్టేట్స్ (united stats) మరో 7,000 మంది సైనికులను యూరప్‌ లో మోహరించనుంది. ‘‘ అమెరికా నాటో (NATO) మిత్రదేశాలకు భరోసా ఇవ్వడానికి, రష్యా దూకుడును నిరోధించడానికి ఈ ప్రాంతంలో అనేక అవసరాలకు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా జర్మనీలో సైనికులను మోహరిస్తారు’’ అని పెంటాగాన్ తెలిపింది. అయితే వారు రాబోయే రోజుల్లో అక్కడి చేరుకుంటారని చెప్పింది. 

వ్లాదిమిర్ పుతిన్ (vladimir putin)ను తీసుకుంటున్న చర్యల ఫలితంగా మరో దేశం కూడా రష్యాపై ఆంక్షలు విధించాలని నిర్ణయించుకుంది. గురువారం బ్రిటన్ రష్యాపై ఆంక్షల ప్యాకేజీని విధించింది. ఈ వివ‌రాల‌ను ఆద దేశ ప్ర‌ధాని బోరిస్ జాన్సన్ ఈ వివ‌రాల‌ను వెల్లడించారు. లండన్‌లో రష్యా, ఆ దేశ సంస్థ‌లు డబ్బు సేకరించకుండా నిరోధించడానికి బ్రిటన్ చట్టాన్ని చేస్తుంద‌ని చెప్పారు. సైనిక అవ‌స‌రాలకు ఉపయోప‌గ‌డే పరికరాల ఎగుమతిని నిషేధిస్తుంది. ఉక్రెయిన్ పై దాడి చేయాల‌ని త‌న బ‌ల‌గాల‌ను ఆదేశించిన వ్లాదిమిర్ పుతిన్ ను జాన్స‌న్ నియంతగా అభివ‌ర్ణించారు. అత‌ను తీసుకున్న చ‌ర్యల వ‌ల్ల ఆయ‌న చేతికి అంటిన ఉక్రెయిన్ రక్తాన్నిఎప్ప‌టికీ శుభ్రపరచలేరు అని అన్నారు.

కాగా ఉక్రెయిన్ పై దాడి చేస్తున్న కార‌ణంగా రష్యా రాయ‌బారి ఆండ్రీ కెలిన్‌ ని బ్రిటీష్ విదేశాంగ కార్యదర్శి లిజ్ ట్రస్ గురువారం తీవ్రంగా దూషించారు. ఆ దేశంలో జ‌రిగిన స‌మావేశం నుంచి అత‌డిని బ‌హిష్క‌రించారు. దీని కంటే ముందే రష్యాను అంతర్జాతీయ పరిహాసంగా లిజ్ ట్ర‌స్ట్ అభివ‌ర్ణించారు.