Russia Ukraine Crisis: ఉక్రెయిన్-పోలాండ్ సరిహద్దులోని భారత విద్యార్థులపై దాడులు జరుగుతున్నాయనీ, భారతీయులు, నైజీరియన్లను సరిహద్దు దాటేందుకు అనుమతించడం లేదని, కేవలం ఉక్రెయన్లను మాత్రమే సరిహద్దు దాటిస్తున్నారని భారతీయ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Russia Ukraine Crisis: ఉక్రెయిన్ పై రష్యా దాడి చేస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు నెలకొన్నాయి. ఆ దేశం నుంచి ఎలాగోలా తప్పించుకుని బయట పడాలని అక్కడి ప్రజలు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఉక్రెయిన్‌కు సమీపంలో ఉన్న పోలెండ్ సరిహద్దుకు చేరుకుంటున్నారు. ఉక్రెయిన్ నుంచి పోలెండ్ సరిహద్దులోకి వచ్చే వారికి ఎలాంటి వీసాలు అవసరం లేదని, నేరుగా రావొచ్చని అధికారులు స్పష్టం చేశారు. దీంతో భారీగా విదేశీ విద్యార్ధులు పోలెండ్ సరిహద్దుకు చేరుకుంటున్నారు. అయితే, పోలెండ్ సరిహద్దులో మాత్రం పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. సరిహద్దులో అక్కడి సైనికులు, పోలీసులు అడ్డుకుంటున్నారు. బార్డర్ దాటి వెళ్లకుండా అడ్డు పడుతున్నారు. సరిహద్దుల్లో పరిస్థితి దారుణంగా ఉందని భారతీయ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే సరిహద్దుల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నట్టు పలు వీడియోలు వైరల్ అయ్యాయి. సరిహద్దుల్లో చిత్ర హింసకు గురిచేస్తున్నారు. అమ్మాయిలనే కనికరం కూడా లేకుండా.. విక్షచణ రహితంగా కొడుతున్నారు. సరిహద్దుల్లో పరిస్థితి చాలా ఉద్రిక్తంగా, అత్యంత గందరగోళంగా ఉన్నాయని విద్యార్థులు భయాందోళనలు వ్యక్తం చేశారు.
అక్కడ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత ప్రభుత్వం త్వరితగతిన విద్యార్థులను తరలించే ఏర్పాటు చేయాలని, హింసకు గురువుతున్న భారతీయ విద్యార్థుల కుటుంబాల పరిస్థితి కూడా చాలా దయనీయంగా ఉందని అన్నారు. కాళ్లకు మొక్కితేనే మహిళలను పోలెండ్‌లోకి అనుమతిస్తున్నారని ఆరోపించారు. తాము చెప్పినట్టు వింటేనే పోలెండ్‌లోకి అడుగు పెట్టేందుకు అనుమతిస్తామని పురుషులను హెచ్చరిస్తున్నారు పోలీసులు. దీనికి సంబంధించిన వీడియోను ఇండియాకు చెందిన ఓ విద్యార్థిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో వైరల్ అవుతున్నది.
ఆపరేషన్ గంగా కార్యక్రమంలో భాగంగా ఉక్రెయిన్ నుంచి భారత్ లో అడుగుపెట్టిన విద్యార్థులను ప్రశ్నించగా.. హృదయవిచారక గాథాలు చెప్పుతున్నారు. సరిహద్దుల్లో భారతీయ పౌరులపై ఉక్రెయిన్ అధికారులు వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. భారతీయులు, నైజీరియన్లను సరిహద్దు దాటడానికి అనుమతించడం లేదని పలువురు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఉక్రెయిన్ పౌరులను మాత్రమే.. సరిహద్దు దాటిస్తున్నారనీ, భారతీయ విద్యార్థులపై ఉక్రెయిన్ అధికారులు వివక్ష చూపిస్తున్నారని ఆరోపించారు. సరిహద్దుకు చేరుకోవడానికి తాము దాదాపు 15 కిలోమీటర్లు నడవవలసి వచ్చిందని అని తెలిపారు.
మరో విద్యార్థి మీడియాతో మాట్లాడుతూ.. తరలింపు ప్రక్రియ చాలా అనిశ్చితి, గందరగోళం గా ఉందని, ఉక్రెయిన్‌లో ఇంకా చాలా మంది భారతీయులు చిక్కుకుపోయారని, సరిహద్దు దాటడమే ప్రధాన సమస్య అని ఆయన అన్నారు. పోలాండ్ సరిహద్దులో ఉక్రేనియన్ సైనికులు విచక్షణ రహితంగా వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విధ్వంసకర యుద్ధ వాతావరణం నుంచి ప్రాణాలు అరిచేత పట్టుకుని సరిహద్దులు చేరుకుంటే.. చెక్ పాయింట్‌ల వద్ద మైనస్ 4 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత లో వేట్ చేయిస్తున్నారనీ, అక్కడ ఎలాంటి ఏర్పాటు లేవనీ, అంతటి కఠినమైన చలిలో రోడ్లపైనా.. పార్కుల్లో నిద్రించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వాన్ని తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు అభ్యర్థించారు.
రాజధాని కీవ్‌తో సహా అనేక నగరాలపై రష్యా వైమానిక దాడులు చేసిన తరువాత ఉక్రేనియన్ గగనతలం మూసివేయింది. విమాన సర్వీసులకు బంద్ చేసింది. దీంతో పలువురు విద్యార్థులు ఉక్రెయిన్ లోనే ఇక్కుకపోయారు. ఈ తరుణంలో ఉక్రెయిన్ సరిహద్దులో ఉన్న హంగేరి, పోలాండ్, స్లోవాక్ రిపబ్లిక్, రొమేనియా ద్వారా పంపిస్తున్నారు.
భారతీయ విద్యార్థులను తీసుకరావడానికి భారత్ ఆపరేషన్ గంగా పేరుతో విమానాలను నడుపుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా.. ఇప్పటి వరకు ఐదు ప్రత్యేక విమానాల ద్వారా దాదాపు 1500 మంది విద్యార్థులను భారత్ కు సురక్షితంగా తీసుకవచ్చారు. ఉక్రెయిన్ సరిహద్దులో భారతీయ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్య పట్ల భారత ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుంది. ప్రధాని మోడీ అధ్యక్షతన క్యాబినేట్ భేటీ జరిగింది. ఈ భేటీలో ప్రధాన భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించారు. సమస్య పరిష్కరం కోసం మంత్రివర్గ కమిటీని ఉక్రెయిన్ సరిహద్దులకు పంపనున్నట్టు సమాచారం.
