ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో ప్రపంచం ఉలిక్కిపడింది. ఊహాకు అందని విధంగా పుతిన్ దాడికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రపంచ దేశాలు నివ్వెరపోయాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ వ్యవహారంపై రాత్రి 11 గంటలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక ప్రకటన చేయనున్నారు. ఉక్రెయిన్‌పై అకారణంగా యుద్ధం చేస్తోందంటూ ఆయన ఇప్పటికే రష్యాపై ఆగ్రహం వ్యక్తం చేశారు.అలాగే, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో కూడా చర్చించిన బైడెన్.. తమ సహాయ సహకారాలు కొనసాగుతాయంటూ హామీ ఇచ్చారు. ఈ క్రమంలో అగ్రరాజ్యాధినేత ఎలాంటి ప్రకటన చేస్తారోనని ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.
- Home
- International
- Russia Ukraine Crisis Live Updates: రాత్రి 11 గంటలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక ప్రకటన
Russia Ukraine Crisis Live Updates: రాత్రి 11 గంటలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక ప్రకటన

ఉక్రెయిన్-రష్యా దేశాల మధ్య యుద్దమేఘాలు కమ్ముకున్నాయి. ప్రపంచ దేశాలు భావిస్తున్నట్లుగానే ఉక్రెయిన్ మీద రష్యా మిలటరీ ఆపరేషన్ ప్రారంభించింది. అయితే రష్యా మిలటరీ చర్యలపై ఏమాత్రం వెనక్కి తగ్గకుండా సమర్ధవంతంగా తిప్పికొట్టేందుకు ఉక్రెయిన్ కూడా మిలటరీని సంసిద్దం చేసింది. ఇలా ఇరుదేశాలు సై అంటే సై అంటుండటంతో సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పటికే ఉక్రెయిన్ మూడు వైపులా రష్యా బలగాలు మొహరించాయి.
రాత్రి 11 గంటలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక ప్రకటన
ఉక్రెయిన్ ప్రభుత్వ భవనాలను స్వాధీనం చేసుకునే యోచనలో రష్యా
ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యా.. వేగంగా ముందుకు సాగుతోంది. ఉదయం నుంచి ఉక్రెయిన్‌పై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలో రాజధాని కీవ్‌కు సమీపంలోకి రష్యా దళాలు చేరుకున్నట్లుగా తెలుస్తోంది.
ప్రధాని నరేంద్ర మోడీ అత్యవసర సమావేశం
ఉక్రెయిన్ సంక్షోభంపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఉక్రెయిన్‌లోని భారతీయులను, మరీ ముఖ్యంగా విద్యార్థులకు, సాయపడేందుకుగల మార్గాలను భారత ప్రభుత్వం అన్వేషిస్తోంది. ఈ సంఘర్షణ మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉండటంతో వేగంగా ఆదుకునేందుకు ప్రయత్నిస్తోంది.
బాంబ్ షెల్టర్లకు ఇలా చేరుకోండి.. భారతీయులకు ఇండియన్ ఎంబసీ సూచనలు
ఉక్రెయిన్‌లోని ఇండియన్ ఎంబసీ కూడా స్పందించింది. ఉక్రెయిన్‌లో మార్షల్ లా అమల్లో వుందని.. ప్రయాణాలు కష్టంగా మారాయని పేర్కొంది. కీవ్‌లో చిక్కుకున్న వారి కోసం స్థానిక యంత్రాంగంతో సంప్రదింపులు జరుపుతున్నామని.. కీవ్‌లో బాంబు వార్నింగ్‌లు, ఎయిర్ సైరన్ల మోత వుందని ఇండియన్ ఎంబసీ వెల్లడించింది. అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్‌లో తలదాచుకుంటున్నారని చెప్పింది. పాస్‌పోర్టులతో వీలైనంత వరకు ఇళ్లలోనే వుండాలని.. సైరన్ వినిపిస్తే గూగుల్ మ్యాప్ సాయంతో బాంబ్ షెల్టర్లకు చేరుకోవాలని భారత రాయబార కార్యాలయం తెలిపింది.
రష్యా ఆధీనంలోకి ఉక్రెయిన్ విమానాశ్రయం
ఉక్రెయిన్ రాజధాని కీవ్ ఎయిర్ పోర్ట్ ను రష్యా సైన్యం ఆధీనంలోకి తీసుకుంది.
ఉక్రెయిన్ లోకి చొచ్చుకెళ్లిన రష్యన్ యుద్ద ట్యాంకులు
ఉక్రెయిన్ భూభాగంలోకి రష్యా సైనిక బలగాలు ప్రవేశించాయి. రష్యన్ యుద్ధ ట్యాంకులు, ఇతర భారీ ఆయుధ సామాగ్రి గల వాహనాలు తమ దేశ ఉత్తర ప్రాంతాల్లోని సరిహద్దును దాటి వచ్చాయని ఉక్రెయిన్ సరిహద్దు భద్రతా సిబ్బంది తెలిపారు.
ఉక్రెయిన్ లోకి చొచ్చుకెళ్లిన రష్యన్ యుద్ద ట్యాంకులు
ఉక్రెయిన్ భూభాగంలోకి రష్యా సైనిక బలగాలు ప్రవేశించాయి. రష్యన్ యుద్ధ ట్యాంకులు, ఇతర భారీ ఆయుధ సామాగ్రి గల వాహనాలు తమ దేశ ఉత్తర ప్రాంతాల్లోని సరిహద్దును దాటి వచ్చాయని ఉక్రెయిన్ సరిహద్దు భద్రతా సిబ్బంది తెలిపారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్దంలో 300మంది బలి
ఉక్రెయిన్ పై రష్యా దాడిలో ఇప్పటివరకు 300మంది చనిపోయినట్లు సమాచారం. అయితే ఇంతకంటే ఎక్కువగానే ప్రాణనష్టం జరిగివుంటుందని తెలుస్తోంది.
రష్యా దాడులతో ఉక్రెయిన్ లో మారణహోమం
రష్యా దాడులతో ఉక్రెయిన్ రక్తపాతం జరుగుతున్నట్లు భారత్ లోని ఉక్రెయిన్ రాయబార కార్యాలయం ప్రకటించింది. ఈ దాడుల్లో ఇప్పటికే భారీగా ప్రజలు మృతిచెందినట్లు ఉక్రెయిన్ రాయబారి ఇగోర్ పాలిఖా వెల్లడించారు.
రష్యాకు పాక్ మద్దతు...
ఉక్రెయిన్ పై సైనిక చర్యకు దిగిన రష్యాకు మన పొరుగుదేశం పాకిస్థాన్ మద్దతు ప్రకటించింది. ప్రస్తుతం రష్యా పర్యటనలో వున్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఉక్రెయిన్ దాడిని సమర్థించారు. ఇక ఉక్రెయిన్ కు ఇప్పటికే అమెరికా మద్దతుగా నిలవగా బ్రిటన్, ప్రాన్స్ ఇదే స్టాండ్ తీసుకున్నాయి.
జీ7 దేశాల అత్యవసర సమావేశం
రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్దవాతావరణం నేపథ్యంలో జీ7 కూటమి దేశాలతో యూఎస్ ప్రత్యేకంగా సమవేశం కానుంది. ఉక్రెయిన్ కు మద్దతుగా జీ7దేశాల సహకారాన్ని యూఎస్ కోరనుంది.
ఉక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టం ధ్వంసం... రష్యా ప్రకటన
ఉక్రెయిన్ ఎయిర్ బేస్, ఎయిర్ డిఫెన్స్ సిస్టం ను ధ్వంసం చేసినట్లు రష్యా ప్రకటించింది.
రష్యా, ఉక్రెయిన్ యుద్దం... భారత్ స్టాండ్ ఇదే...
ఉక్రెయిన్-రష్యా దేశాల మధ్య యుద్దం కొనసాగుతుండటంతో వివిధ ప్రపంచ దేశాలు ఇప్పటికే తమ స్టాండ్ ప్రకటించాయి. ఈ క్రమంలోనే తాజాగా భారత్ కు తన వైఖరిని ప్రకటించింది. ఉక్రెయిన్ తో పాటు మిత్రదేశం రష్యాకూ మద్దతుగా నిలవకుండా తటస్థంగా వుండాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి రంజన్ సింగ్ ప్రకటించారు.
ఐదు రష్యా ఫైటర్ జెట్లు కూల్చివేత... రష్యా ప్రకటన
నో ప్లయింగ్ జోన్ గా ప్రకటించినా తమ దేశ గగనతలంలోకి ప్రవేశించిన రష్యాకు చెందిన ఐదు ఫైటర్ జెట్ లను కూల్చేసినట్లు రష్యా ప్రకటించింది.
ఉక్రెయిన్ ఎదురుదాడి.. రష్యా జెట్ ఫైటర్స్ కూల్చివేత
రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ కూడా ఎదురుదాడికి దిగింది. తమ దేశంలోని ప్రవేశించి దాడులకు దిగుతున్న రష్యా జెట్ ఫైటర్ ను ఉక్రెయిన్ కూల్చివేసింది.
మానవత దృక్పథంతో యుద్దాన్ని ఆపండి: ఐక్యరాజ్య సమితి భద్రతామండలి
ప్రపంచ దేశాలు భయపడినట్టే.. యుద్ధం మొదలైపోయింది. వ్యూహాత్మకంగా ఉక్రెయిన్‌పై ఒక్కసారిగా విరుచుకుపడింది రష్యా. తూర్పు ఉక్రెయిన్‌పై సైనిక ఆపరేషన్ చేపడుతున్నట్టు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన ప్రకటన చేశారు. ఉక్రెయిన్ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని హెచ్చరించారు. ఆపరేషన్‌లో జోక్యం చేసుకునేవారిపై ప్రతీకారం తీర్చుకుంటామని పరోక్షంగా అమెరికా సహా నాటో దేశాలకు పుతిన్ హెచ్చరికలు పంపారు. ఈ క్రమంలో ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాలను లక్ష్యంగా చేసుకుని.. రష్యా దాడి చేస్తుంది. ఇప్పటికే కేపిటల్ కీవ్‌తోపాటు 11 నగరాలపై బాంబుల దాడి చేస్తుంది. ఉక్రెయిన్‌ను నాలుదిక్కుల చుట్టుముట్టి బాంబుల దాడి చేస్తుంది. ఈ తరుణంలో కీవ్ ఎయిర్‌పోర్ట్‌ను రష్యా బలగాలు స్వాధీనం చేసుకున్నారయి. మిలటరీ ఆపరేషన్‌కు దిగిన కొద్దిగంటల్లోనే ఉక్రెయిన్ కేపిటల్ కీవ్‌ను రష్యా బలగాలు ఆక్రమించాయి.
యుద్దాన్ని ఆపండి: ఐక్యరాజ్య సమితి
ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి భద్రతామండలి మరోసారి అత్యవసరంగా సమావేశమైంది. సైనిక మోహరింపు, తదితర పరిణామాలపై ఈ సమావేశంలో చర్చ సాగింది. యుద్ధ పరిణామాలు ఉక్రెయిన్‌కు వినాశకరమనీ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చాలా దూరం అవుతాయని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ అన్నారు. మానవత దృపథంతో యుద్ధాన్ని ఆపాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు చివరి నిమిషంలో విజ్ఞప్తి చేశారు.
ఉక్రెయిన్ లో సైనిక పాలన
రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ లో ఇప్పటికే ఎమర్జెన్సీ ప్రకటించగా తాజాగా మార్షల్ లా విధించారు. దీంతో దేశంలో సైనిక పాల మొదలయ్యింది.
టార్గెట్ రష్యా... ఉక్రెయిన్ కు మద్దతుగా రంగంలోకి నాటో దళాలు
రష్యా దాడులకు గురవుతున్న ఉక్రెయిన్ దేశానికి అమెరికాతో పాటు నాటో దళాలు మద్దతుగా నిలిచాయి. ఇప్పటికే రష్యా రాజధాని మాస్కొపై ఆంక్షలను కఠినతరం చేసాయి. అలాగే రష్యాకు నలువైపులా నాటో దళాలు మోహరింపబడ్డాయి.
సైనిక స్థావరాలు టార్గెట్ గా రష్యా దాడులు
సైనిక స్థావరాలే టార్గెట్ గా రష్యా దాడులకు దిగడంలో ఉక్రెయిన్ కూడా ఎదురుదాడికి దిగుతోంది. యుద్దంలో రష్యాపై విజయం సాధిస్తామని ఉక్రెయిన్ అధ్యక్షుడు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
కీవ్ విమానాశ్రయంపై రష్యా దాడి
కీవ్ ఎయిర్ పోర్టు దగ్గర పేలుళ్లు... ఇప్పటికే కీవ్ ఎయిర్ పోర్టును ఖాళీ చేసిన ఉక్రెయిన్... దేశంలో విమానాల రాకపోకలను నిషేధించిన ఉక్రెయిన్