Russia Ukraine Crisis : రష్యా ఉక్రెయిన్ మధ్య మధ్య భీకర యుద్ధం జరుగుతున్న వేళ.. ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలీ బాన్నెట్ .. పుతిన్‌ను కలిశారు. శనివారం క్రెమ్లిన్‌లో ఇరువురు నేతలు కలిసి.. ఉక్రెయిన్ అంశాన్ని చర్చించారు. ఇరుదేశాల మధ్య మధ్యవర్తిత్వ వహించడానికి మరోసారి ఇజ్రాయెల్ సిద్దంగా ఉంది. ఇజ్రాయెల్ అమెరికాతో సన్నిహితంగా ఉండే.. ఇజ్రాయెల్ కివ్‌లో రష్యా దాడిని తీవ్రంగా ఖండించింది. మానవతా దృక్పథంతో స్పందించాలని కోరింది.
Russia Ukraine Crisis : ఉక్రెయిన్, రష్యాల మధ్య భీకర యుద్ధం జరుగుతున్న వేళ.. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్ సమావేశమయ్యారు. క్రెమ్లిన్‌లో జరిగిన ఈ భేటీలో ఉక్రెయిన్ సంక్షోభంపై చర్చించినట్టు అధికార ప్రతినిధులు తెలిపారు. ఉక్రెయిన్ చుట్టూ ఉన్న పరిస్థితుల గురించి చర్చించబడినట్టు క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ రష్యా వార్తా సంస్థ ఇంటర్‌ఫాక్స్ కు నివేదించారు. ఇరుదేశాల అధినేతల మధ్య సమావేశం మూడు గంటల పాటు కొనసాగిందని, యుఎస్ పరిపాలన సమన్వయంతో, ఆశీర్వాదంతో జరిగిందని చెప్పారు.
యునైటెడ్ స్టేట్స్ సన్నిహిత మిత్రదేశమైన ఇజ్రాయెల్.. రష్యా దండయాత్రను తీవ్రంగా ఖండించింది, ఉక్రెయిన్ కు సంఘీభావం తెలిపింది. ఉక్రెయిన్‌కు మానవతావాద సహాయాన్ని పంపింది, సంక్షోభాన్ని తగ్గించడంలో సహాయపడే ఆశతో రష్యాతో కమ్యూనికేషన్‌లను కొనసాగిస్తామని తెలిపింది. ఇజ్రాయెల్ అమెరికాతో సన్నిహితంగా ఉంటోంది. కివ్‌లో రష్యా దాడిని తొలి నుంచి ఖండించింది. మానవతా దృక్పథంతో స్పందించాలని కోరింది.
భేటీ అనంతరం.. బెన్నెట్ ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ.. బెన్నెట్. పుతిన్‌తో భేటీ తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో మాట్లాడినట్లు చెప్పారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో ఇజ్రాయెల్ ప్రభుత్వం రష్యా, ఉక్రేనియన్ నాయకులతో సత్సంబంధాలను కొనసాగించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. ఇరుదేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి సిద్దమని మరోసారి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ఈ విషయాన్ని గత బుధవారం నాడు పుతిన్‌తో ఫోన్లో మాట్లాడాడు. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి కార్యాలయం ప్రకారం.. ప్రధాని బెన్నెట్‌తో పాటు ఇజ్రాయెల్ హౌసింగ్ మినిస్టర్ జీవ్ ఎల్కిన్ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ భేటీలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనే దానిపై తక్షణ సమాచారం లేదు.
